గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కూడా అనువాద చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. జేమ్స్ బాండ్, అవెంజర్స్, టెర్మినేటర్, లాంటి యాక్షన్ మూవీ సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా టెర్మినేటర్ సిరీస్‌లోని ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బుధవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమా చూశానని చెప్పాడు. అప్పట్లో ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేసేవాళ్లమని తెలిపాడు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల తెలుగు డబ్బింగ్ చూస్తే ఇరిటేషన్ వచ్చేదని.. ఇప్పుడు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగా పెరిగిందన్నాడు. ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’లో డబ్బింగ్ చాలా బాగున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోందన్నారు. తను ఇంకా చిన్నవాడినని.. ప్రభాస్ లాంటి వారు టెర్మినేటర్ లాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తెలుగులోకి హాలీవుడ్ సినిమాలను తీసుకొస్తున్న డిస్నీ సంస్థ మన ‘సాహో’, ‘సైరా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలి’ అని విజయ్ దేవరకొండ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment