Terminator sequel
-
అలాంటి సినిమాలు ప్రభాస్ అన్నే చేయాలి..
గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కూడా అనువాద చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. జేమ్స్ బాండ్, అవెంజర్స్, టెర్మినేటర్, లాంటి యాక్షన్ మూవీ సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా టెర్మినేటర్ సిరీస్‌లోని ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బుధవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. స్కూల్లో చదువుకునే రోజుల్లో ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమా చూశానని చెప్పాడు. అప్పట్లో ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేసేవాళ్లమని తెలిపాడు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల తెలుగు డబ్బింగ్ చూస్తే ఇరిటేషన్ వచ్చేదని.. ఇప్పుడు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగా పెరిగిందన్నాడు. ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’లో డబ్బింగ్ చాలా బాగున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోందన్నారు. తను ఇంకా చిన్నవాడినని.. ప్రభాస్ లాంటి వారు టెర్మినేటర్ లాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తెలుగులోకి హాలీవుడ్ సినిమాలను తీసుకొస్తున్న డిస్నీ సంస్థ మన ‘సాహో’, ‘సైరా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలి’ అని విజయ్ దేవరకొండ అన్నాడు. -
అవతార్ రిటర్న్స్ టు టెర్మినేటర్!
టెర్మినేటర్ అంటే తెలుగు ప్రేక్షకులకూ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గరే గుర్తొస్తారు. ఇప్పటివరకు ‘టెర్మినేటర్’ సిరీస్ (ఐదు సిన్మాల్లో)లో ఈ ఇంగ్లీష్ హీరో అంతలా ఇరగదీసి నటించారు. అయితే... ‘టెర్మినేటర్’కి, ‘అవతార్’కి లింక్ ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా! ‘అవతార్’ అంటే ముందుగా గుర్తొచ్చేదెవరు? ఆ చిత్రదర్శకుడు జేమ్స్ కామెరూన్. ‘టెర్మినేటర్’ సిరీస్‌లో ఫస్ట్ రెండు సిన్మాలకు దర్శకుడూ ఆయనే. కామెరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించిన ‘టెర్మినేటర్–2’ ఆల్మోస్ట్ 525 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. సెకండ్ పార్ట్ విడుదలైన పన్నెండేళ్లకు వచ్చిన మూడో పార్ట్ ‘టెర్మినేటర్ 3: రైజ్ ఆఫ్ ద మెషీన్స్’ (2003) గానీ, తర్వాత ‘టెర్మినేటర్ సాల్వేషన్’ (2009) గానీ, ఐదో పార్ట్ ‘టెర్మినేటర్ జెనిసిస్’ (2015) గాని రెండో పార్ట్ వసూళ్లను దాటలేదు. కారణం అదేనో... మరొకటో... ఆరో పార్ట్ హక్కులు మళ్లీ కామెరూన్ చేతికి వచ్చాయి. అయితే... ‘టెర్మినేటర్–2’కి సీక్వెల్‌గా రూపొందనున్న ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహించడం లేదు. కథారచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బిల్లీ రేతో కలసి కథ రాసిన కామెరూన్, డేవిడ్ ఎల్లీసన్తో కలసి ‘టెర్మినేటర్–6’ను నిర్మిస్తున్నారు. ‘డెడ్‌పూల్’ ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకుడు. స్క్రిప్ట్ అండ్ ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ మొదలై చాలా రోజులైంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారట! ద బ్రెయిన్ బిహైండ్ టెర్మినేటర్... కామెరూన్ మళ్లీ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్తో కలవడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇంతకీ ఆరో ‘టెర్మినేటర్’ ఎప్పుడు వస్తుందో తెలుసా? 2019లో. -
‘టెర్మినేటర్’ ఇక రాడు!
హాలీవుడ్: చిన్నపిల్లల దగ్గర నుంచి యాక్షన్ చిత్రాలను ఇష్టపడే కుర్రకారు వరకు అందరినీ అలరించిన ‘టెర్మినేటర్’ చిత్రాలు ఇక రావు. వరుస సీక్వెల్స్‌తో అలరించిన టెర్మినేటర్ సీరిస్ చిత్రాలను ఇకపై నిర్మించబోమని నిర్మాణ సంస్థ పారామౌంట్ స్టూడియోస్ ప్రకటిం చింది. ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ కథానాయకుడి గా వచ్చిన ఈ చిత్రాలకు ఇక ముగింపు పలకనున్నట్లు సోమవారం ప్రకటించింది. ‘టెర్మినేటర్ అండ్ ఆర్నాల్డ్.. శకం ముగిసింది. మా నిర్మాణ సంస్థ ఈ స్వీక్వెల్స్కు ముగింపు పలకాలని నిర్ణయించింది. దీంతో ఇకపై టెర్మినేటర్‌కు సంబంధించి ఎటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇకపై జరగవు. దీని అర్థం.. టెర్మినేటర్ ఇక ప్రేక్షకుల ముందుకు రాబోడు. నిజానికి టెర్మినేటర్ సీరిస్‌ను దీర్ఘకాలంపాటు కొనసాగిద్దామని అనుకున్నాం. కానీ అనుకున్న విధంగా అన్నీ జరగవు కదా..! ఇది కూడా అలాగే మధ్యలోనే నిలిపివేయాల్సివస్తోంద’ని పారామౌంట్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.