ఆరోసారి వస్తున్న టెర్మినేటర్‌ | 'Terminator 6' to release in July 2019  | Sakshi
Sakshi News home page

ఆరోసారి వస్తున్న టెర్మినేటర్‌

Published Thu, Sep 28 2017 4:15 PM | Last Updated on Thu, Sep 28 2017 4:15 PM

'Terminator 6' to release in July 2019 

లాస్‌ఏంజెల్స్‌: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, హాలీవుడ్‌ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్ కు కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టిన టెర్మినేటర్‌కు మరో సీక్వెల్‌ రాబోతోంది. ష్వాజ్ నెగర్ హీరోగా టెర్మినేటర్‌-6 ను 2019 లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. సారా కానర్‌గా టెర్మినేటర్‌-1లో నటించి మెప్పించిన లిండా హామిల్టన్‌నే ఇందులోనూ స్వ్కార్జ్‌నెగ్గర్‌తో పాటు నటించనున్నారు.

సినిమా విడుదలకు 2019 జూలై 26 వ తేదీని ఖరారు చేశామని ప్రొడ్యూసర్‌ జేమ్స్‌ కామెరాన్‌ తెలిపారు. అయితే, కథకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ సినిమా డైరెక్టర్‌ టిమ్‌ మిల్లర్‌, స్క్కిప్ట్‌ రైటర్‌గా కామరూన్‌ వ్యవహరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement