అద్భుతాలు చూపిస్తాం: జేమ్స్‌ కామెరూన్‌ | James Cameron Shares Fresh Update on Avatar Fire And Ash | Sakshi
Sakshi News home page

అద్భుతాలు చూపిస్తాం: జేమ్స్‌ కామెరూన్‌

Published Wed, Jan 22 2025 12:12 AM | Last Updated on Wed, Jan 22 2025 2:59 AM

James Cameron Shares Fresh Update on Avatar Fire And Ash

‘‘అవతార్, అవతార్‌ 2’ చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఎన్నో అంచనాలుంటాయి. ఆ అంచనాలను మించి మా సినిమా ఉంటుంది’’ అని ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘అవతార్‌’ (2009), ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (2022) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.

ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రం ‘అవతార్‌–ఫైర్‌ అండ్‌ యాష్‌’. ఈ చిత్రానికి కూడా జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘అవతార్‌–ఫైర్‌ అండ్‌ యాష్‌’ గురించి జేమ్స్‌ కామెరూన్‌ మాట్లాడుతూ– ‘‘వెండితెరపై ఈ విజువల్‌ వండర్‌ను చూసి ఆడియన్స్‌ ఆశ్చర్యపోతారు. తొలి, ద్వితీయ చిత్రాల్లో చూపినవి రిపీట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ధైర్యం చేసి సరికొత్తవి తీసుకొస్తున్నాం.

ఇలా ధైర్యం చేసి కొత్తవాటిని సృష్టించకపోతే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసినవాడిని అవుతాను. ‘అవతార్, అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ చిత్రాల్లో లేని అద్భుతాలను ‘అవతార్‌–ఫైర్‌ అండ్‌ యాష్‌’లో చూస్తారు. అంచనాలకు మించిన లైవ్‌ యాక్షన్‌ని ప్రేక్షకులకు చూపించనున్నాం. ఓ కొత్త ప్రపంచంతో పాటు వైవిధ్యమైన కథ, పాత్రలు ఇందులో కనిపిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబరు 19న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement