Avatar 3
-
అవతార్ 3 టైటిల్ రివీల్..
-
అవతార్ త్రీకి టైటిల్ ఫిక్స్
పండోరా ప్రపంచంలోకి మళ్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ ఫ్రాంచైజీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమాలు వచ్చాయి. తాజాగా ‘అవతార్’ ఫ్రాంచైజీలోని మూడో సినిమాకు ‘అవతార్:ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు, ఈ సినిమాను 2025 డిసెంబరు 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ వర్తింగ్టన్, జో సల్దాన, కేట్ విన్స్లెట్ తదితరులు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక పండోరా అనే కల్పిత గ్రహం నేపథ్యంలో ‘అవతార్’ ఫ్రాంచైజీ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. -
'అవతార్ 3' క్రేజీ అప్డేట్.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటన
90స్ జనరేషన్ పిల్లల్ని అవాక్కయ్యేలా చేసిన హాలీవుడ్ సినిమా 'అవతార్'. అప్పుడెప్పుడో 2009లో తొలి భాగం రిలీజ్ కాగా.. మళ్లీ 2022లో సీక్వెల్ రిలీజ్ చేశారు. మొత్తంగా వీటిని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు మూడో పార్ట్ పేరుతో పాటు విడుదల తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)దిగ్గద దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' తొలి భాగం అప్పట్లో వసూళ్లలో ప్రపంచ రికార్డులు సృష్టించింది. దీన్ని పండోరా గ్రహంలో భూమిపై తీయగా.. 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' అనే పేరుతో వచ్చిన రెండో భాగాన్ని పూర్తిగా నీటిలో తీశారు. ఇప్పుడు మూడో భాగానికి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అనే టైటిల్ నిర్ణయించారు. పంచ భూతాల్లో మూడోది అయిన అగ్ని కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని తీస్తారని క్లారిటీ వచ్చేసింది.'అవతార్ 3' సినిమాని 2025 డిసెంబరు 19న థియేటర్లలో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. అంటే మరో ఏడాది టైమ్ ఉంది. ఇది కాకుండా మరో రెండు పార్ట్స్ కూడా ఉన్నాయి. వీటిని 2027, 29లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కాకపోతే వాటి పేర్లు, రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరో సూర్యకు గాయం) View this post on Instagram A post shared by Avatar (@avatar) -
అవతార్ 3 కాన్సెప్ట్ అదుర్స్.. అంచనాలను పెంచేసిన డైరెక్టర్
‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు. దీంతో అవతార్ 3పై అందరికి ఆసక్తి నెలకొంది. పార్ట్ 3 నేపథ్యం ఏంటి? కొత్తగా ఏం చూపించబోతున్నారనే ఉత్సకత ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. తాజాగా అవతార్ 3 కాన్సెప్ట్ ఏంటో దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించాడు. నిప్పు నేపథ్యంలో అవతార్ 3 కొనసాగుతుందట. ఇటీవల క్రిటిక్ చాయిస్ అవార్డ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అవతార్ 2కి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ మూవీ అవార్డు లభించింది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ పాల్గొని, అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్ 3 ఎలా ఉండబోతుందో వివరించాడు. ‘అగ్ని ఒక చిహ్నం..ప్రయోజకారి. అవతార్ 3లో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. దీంతో పాటు మరో రెండో సంస్కృతులను కూడా పరిచయం చేస్తా. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. ఇదంతా పండోరా గ్రహంలోనే జరుగుతుంది. ఇంతకు మించి ఏమి చెప్పలేను’అని జేమ్స్ కామెరూన్ అన్నారు. అవతార్2తో పాటే అవతార్ 3 షూటింగ్‌ని కూడా పూర్తి చేశాడు జేమ్స్ కామెరూన్. విజువల్ఎఫెక్ట్స్ పని మాత్రం మిగిలి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పండోరా గ్రహంలోని ఏడాది ప్రదేశంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్. అక్కడ ఉండే సంపదను దోచుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తే.. వారిని జేక్ సెల్లీ ఫ్యామిలీ ఎలా అడ్డుకుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.