అవతార్‌ త్రీకి టైటిల్‌ ఫిక్స్‌ | Avatar 3: Fire and Ash Title Revealed | Sakshi
Sakshi News home page

అవతార్‌ త్రీకి టైటిల్‌ ఫిక్స్‌

Published Sun, Aug 11 2024 12:43 AM | Last Updated on Sun, Aug 11 2024 6:15 AM

Avatar 3: Fire and Ash Title Revealed

పండోరా ప్రపంచంలోకి మళ్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్‌’ ఫ్రాంచైజీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘అవతార్‌’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్‌’, ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ సినిమాలు వచ్చాయి. తాజాగా ‘అవతార్‌’ ఫ్రాంచైజీలోని మూడో సినిమాకు ‘అవతార్‌:

ఫైర్‌ అండ్‌ యాష్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు, ఈ సినిమాను 2025 డిసెంబరు 19న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సామ్‌ వర్తింగ్టన్, జో సల్దాన, కేట్‌ విన్స్‌లెట్‌ తదితరులు ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ సినిమాలో లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక పండోరా అనే కల్పిత గ్రహం నేపథ్యంలో ‘అవతార్‌’ ఫ్రాంచైజీ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement