Tom Cruise Mission Impossible Dead Reckoning Part One Trailer Released: యాక్షన్ ప్రియులను సీట్ ఎడ్జ్‌లో కూర్చుండపెట్టే సినిమాలలో మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫ్రాంచైజీ ఒకటి. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఏజెంట్ 'ఈథన్ హంట్'గా ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ మూవీ సిరీస్‌కు క్రేజ్ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్ యాక్షన్ సీక్వెన్స్, అడ్వంచెర్స్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్ అందిస్తాయి. ఇక పరిస్థితులకు తగినట్లు వివిధ పాత్రల గెటప్పుల్లోకి హీరో మారే సన్నివేశాలు మంచి కిక్కిస్తాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆరు సినిమాలు ఎంతో అలరించాయి. ప్రస్తుతం సిరీస్ నుంచి 7, 8వ సినిమాలు రానున్న విషయం తెలిసిందే.
తాజాగా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ వన్'గా ఏడో సినిమా ట్రైలర్‌ను సోమవారం (మే 24) రాత్రి విడుదల చేశారు. ''గ్రేటర్ గుడ్'గా పిలవబడే మీ పోరాట రోజులు ముగిశాయి'' అంటూ ప్రారంభమైన ట్రైలర్ యాక్షన్ సీన్స్‌తో ఆద్యంత ఆకట్టుకునేలా ఉంది. లొకేషన్లు, సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఏదో ఒక 'కీ' నేపథ్యంలో సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో కొండపై నుంచి బైక్‌తో సహా హీరో దూకే సీన్ థ్రిల్లింగ్‌గా ఉంది. 1996లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' మొదటి సినిమాలోని ఐఎమ్‌ఎఫ్ డైరెక్టర్ యూజీన్ కిట్రిడ్జ్‌గా కనిపించిన హెన్రీ జెర్నీ ఇందులో నటించడం విశేషం.
చదవండి:👇
36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. బడ్జెట్ రూ. 12 వందల కోట్లు
ఈ సినిమాకు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కథ, దర్శకత్వం అందించారు. ఇతను 2015లో 'రోగ్ నేషన్', 2018లో 'ఫాల్ అవుట్' సినిమాలను డైరెక్ట్ చేశాడు. 'డెడ్‌రెకనింగ్ పార్ట్ 1' జూలై 14, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024లో 'డెడ్‌రెకనింగ్ పార్ట్ 2' విడుదల కానుంది. అయితే ఇదే ఈథన్ హంట్‌గా టామ్ క్రూజ్ చివరి సినిమా అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment