మరో హీరోయిన్‌కు బంపర్ ఆఫర్‌! | Huma Qureshi to play Tom Cruise leading lady in The Mummy? | Sakshi
Sakshi News home page

మరో హీరోయిన్‌కు బంపర్ ఆఫర్‌!

Published Sun, Apr 24 2016 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

Huma Qureshi to play Tom Cruise leading lady in The Mummy?

బాలీవుడ్‌ అందాల రాశులు ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే దీపికా పదుకోనే, ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఆఫర్లతో తమ సత్తా చాటారు. 'ట్రిపుల్ ఎక్స్: జాండర్‌ కేగ్ రిటర్న్స్ ' షూటింగ్‌ దీపిక బిజీగా ఉండగా.. 'బేవాచ్‌' సెట్స్‌లో ప్రియాంక హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఇద్దరు భామలు ఇలా హాలీవుడ్‌ కలల వెంట సాగుతుండగానే మరో బాలీవుడ్ సుందరీని బంపర్‌ ఆఫర్‌ వరించింది.  హాలీవుడ్‌ టాప్ హీరో టామ్ క్రూయిజ్ నటిస్తున్న 'ద మమ్మీ' సినిమాకుగాను హ్యుమా ఖురేషి ఎంపికైంది. ద గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్‌ చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఖురేషి 'మమ్మీ' సినిమా మూడోపార్టులో నటించనుంది. ఇందుకు సంబంధించిన ఆడిషన్‌లో ఆమె సక్సెస్ అయిందని ఆమె అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే 'ద మమ్మీ', 'ద మమ్మీ-2' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో సంచలన విజయాలు సాధించాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న మూడోపార్టులో టామ్ క్రూయిజ్‌ సరసన ఖురేషి నటించనుందని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ సోఫియా బౌటెల్లా కూడా నటించనుంది. ఖురేషి ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తుండగా.. టామ్‌ 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement