ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ అంతర్జాతీయ స్టార్‌గా ప్రపంచానికి పరిచయమై నేటికి సరిగ్గా 35 ఏళ్లు. 1986 మే 16న టోనీ స్కాట్ దర్శకత్వంలో ట్రామ్ క్రూజ్ నటించిన యాక్షన్ సినిమా ‘టాప్‌గన్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. అప్పట్లో టాప్‌గన్ ప్రేక్షకుల మనసులు దోచుకుని.. 353 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే టాప్‌గన్ విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమాను అమెరికా వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో తిరిగి విడుదల చేశారు. డాల్బీ సినిమా ఏఎమ్‌సీ థియేటర్లలో 150 స్క్రీన్‌లపై సినిమాను విడుదల చేశారు.
ఇప్పటి లేటెస్ట్ సినిమా టెక్నాలజీ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఆడియోను జోడించించడమే కాకుండా.. ట్రామ్‌క్రూజ్, టాప్‌గన్ నిర్మాత జెర్రీ బ్రుక్‌హైమర్‌ల ఇంటర్య్వూలతో పాటు 35 ఏళ్ల టామ్ క్రూజ్ లెగసీని వివరిస్తూ అదనపు సమాచారాన్ని అందించడం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లకు వెళ్లడానికి భయపడే వాళ్ల కోసం ప్రత్యేకంగా డిజిటల్, 4కే అల్ట్రా హెచ్‌డీ, బ్లూ రేలలో టాప్‌గన్‌ను అందుబాటులో ఉంచారు. ఇన్నేళ్ల తర్వాత ‘టాప్‌గన్’కు సీక్వెల్‌గా ‘టాప్‌గన్ మావెరిక్’ను తెరకెక్కించారు. నిరుడే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్–19 కారణంగా వాయిదా పడి ఈ ఏడాది నవంబర్‌లో విడుదలకు సన్నాహమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment