ఫాలౌట్ చిత్రంలో టామ్ క్రూజ్
హాలీవుడ్ ఐకాన్ టామ్ క్రూజ్ తన తదుపరి చిత్రం మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్ క్లైమాక్స్‌ను చిత్రీకరించేందుకు టీమ్‌తో కలసి కశ్మీర్‌కు విచ్చేశారు. అయితే, అది నిజమైన కశ్మీర్ కాదు. న్యూజిలాండ్‌లోని ఓ గ్రామంలో ఏర్పాటుచేసిన కశ్మీర్ సెట్. ఈ చిత్రంలోని హెలికాప్టర్ ఛేజ్ సీన్‌ను చిత్రీకరించేందుకు ప్రపంచంలో న్యూజిలాండ్ మినహా ఏ దేశం అనుమతి ఇవ్వలేదు. దీంతో కశ్మీర్ సెట్‌ను న్యూజిలాండ్‌లో వేసి మరి చిత్రీకరణ జరుపుతున్నారు.
కేవలం కశ్మీర్‌తోనే కాకుండా భారతీయ ఆర్మీ ప్రస్తావన కూడా ఈ చిత్రంలో ఉంది. అంటే ఇంపాజిబుల్-ఫాలౌట్‌కు భారత్‌కు ఏదో ప్రత్యేక సంబంధాన్ని తెరపై చూపబోతున్నారన్నమాట. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంపాజిబుల్ సిరీస్ ఓ దర్శకుడు రెండోసారి దర్శకత్వం చేయడం ఇదే తొలిసారి. మెక్‌క్వారీ తొలుత మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్‌కు దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment