'టామ్ క్రూజ్' విమానం కూలి ఇద్దరి మృతి | film pilot who was working with Tom cruise dies after his small plane crashes | Sakshi
Sakshi News home page

'టామ్ క్రూజ్' విమానం కూలి ఇద్దరి మృతి

Published Sat, Sep 12 2015 7:38 PM | Last Updated on Sat, Jun 30 2018 4:20 PM

'టామ్ క్రూజ్' విమానం కూలి ఇద్దరి మృతి - Sakshi

'టామ్ క్రూజ్' విమానం కూలి ఇద్దరి మృతి

కొలంబియా: మినీ విమానం కూలిన సంఘటనలో ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తదుపరి చిత్రంలో పనిచేస్తున్నఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన కొలంబియాలో శుక్రవారం చోటు చేసుకుంది. క్రూజ్ నటిస్తున్న 'మినా' చిత్ర షూటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయ్యాయని కొలంబియా ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో క్రూజ్ విమానంలో లేడని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించక పోవడం వల్లే విమానం కూలి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. క్రూజ్ తరుపరి చిత్రం 'మినా' చిత్రీకరణ కోసం ఈ మినీ విమానాన్ని వాడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement