'పైలట్ వల్లే ఘోరం జరిగింది'
బొగోటా:ఇటీవల కొలంబియాలో విమానం కూలి 71 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ విమానానికి సంబంధించిన పైలట్ కు సరైన శిక్షణ లేకపోవడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని కో-పైలట్స్ అటార్నీ వెల్లడించిన నివేదికలో స్పష్టమైంది. ఈ మేరకు విమాన పైలట్ మైగుల్ కురోగా శిక్షణకు సంబంధించిన దర్యాప్తులో ఈ విషయం వెల్లడైనట్లు కోపైలట్ అటార్నీ ఓమర్ డురాన్ తెలిపారు. 'ఒక పైలట్ కు కొంతకాలం శిక్షణ ఉంటుంది. అయితే మైగుల్ పూర్తిస్తాయిలో శిక్షణ పూర్తి చేయలేదు. ట్రైనింగ్ అవర్స్ను పూర్తి చేయకుండానే అతను విమాన పైలట్గా బాధ్యతలు తీసుకున్నాడు. దాంతోనే ఘోర జరిగింది. అతనికి పైలట్ గా లైసెన్స్ ఇచ్చిన లామియా ఎయిర్ లైన్స్ పై చర్యలు తీసుకున్నాం. ఆ ఎయిర్ లైన్స్ యెక్క పర్మిట్ను రద్దు చేయడంతో పాటు, ఆ సంస్థ యొక్క మేనేజర్ ను అరెస్ట్ చేశాం 'అని డురాన్ తెలిపారు.
ప్రస్తుతం ఆ విమాన ప్రమాదంపై విచారణ జరుగుతోంది. గత నెల 29వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో పైలట్తో 71 మంది అసువులు బాసారు. ఇందులో అత్యధికంగా బ్రెజిల్ ఫుట్బాల్ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఓ క్లబ్ మ్యాచ్లో భాగంగా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.