ఒబామా ప్రసంగం.. దూసుకెళ్లిన విమానం | Obama Meets Pilot Of Plane That Crashed After Flying Over His Speech | Sakshi
Sakshi News home page

ఒబామా ప్రసంగం.. దూసుకెళ్లిన విమానం

Published Fri, Jun 3 2016 2:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

ఒబామా ప్రసంగం.. దూసుకెళ్లిన విమానం

ఒబామా ప్రసంగం.. దూసుకెళ్లిన విమానం

వాషింగ్టన్: తాను ఓ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో తమ పై నుంచి వెళ్లి కూలిపోయిన తేలికపాటి యుద్ధ విమాన పైలెట్ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పరామర్శించారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే స్వయంగా వెళ్లి అతడిని పరామర్శించి పొగడ్తల్లో ముంచెత్తాడు. గురువారం కొలరాడోలో ఒబామా ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా పీటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చెందిన యుద్ధ విమానం ఎగురుతూ వెళ్లింది. ఆ కొద్ది సేపటికే అది కూలిపోయింది.

అయితే, అందులోని పైలెట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో తన సభను ముగించుకొని వాషింగ్టన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా తిరుగు ప్రయాణమవ్వాల్సిన ఒబామా ఆ పైలెట్ ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా దేశానికి ఆ పైలెట్ అందించిన సేవలను కొనియాడారు. ఎఫ్-16 థండర్ బర్డ్ అనే పేరు గల ఈ విమానం అమెరికా ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ సామర్థ్యాన్ని తెలిపేలా ప్రదర్శనలు ఇచ్చిన కాసేపటికే కూలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement