జెమ్స్ కామెరూన్ ‘అవతార్–2’ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా కోసమే కాదు షూటింగ్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు సినీ అభిమానులు. ఈ సినిమాలో టైటానిక్ ఫేమ్ కెట్ విన్‌స్లేట్ ‘రోనల్’ అనే కీలక పాత్ర పోషించింది. ఊపిరి బిగపట్టి నీటి అడుగు భాగంలో 7 నిమిషాల 14 సెకన్ల సీన్ ఒకటి చేసినప్పుడు కొన్ని నెలల క్రితం ఆ ఫోటోను సోషల్ మీడియాలో చూసి అభిమానులు ఆహా, ఓహో అన్నారు.
ఈ సీన్‌కు సంబంధించి తన అనుభవాన్ని తాజాగా ‘అబ్జర్వర్’ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది కెట్ విన్‌స్లేట్. ‘మది స్తంభించిపోయింది. కనిపిస్తున్న నీటిబుడగలను చూడడం తప్ప ఏ ఆలోచనా లేదు. ఒక దశలో నేను చనిపోయానా? అవును... నేను చనిపోయాను...అనుకున్నాను’ అని చెప్పింది. భయం సంగతి ఏమిటో గానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా కోసం టామ్‌క్రూజ్ ఆరునిమిషాల అరసెకను పాటు ఊపిరిబిగపట్టిన రికార్డ్‌ను కెట్ విన్‌స్లేట్ బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment