'Mission: Impossible - Dead Reckoning Part One' Release Date Out! - Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు రెడీ అయిన టామ్‌ క్రూజ్‌ ‘మిషన్‌: ఇంపాజిబుల్‌’

Published Tue, Jul 11 2023 10:38 AM | Last Updated on Tue, Jul 11 2023 10:53 AM

Mission Impossible Dead Reckoning Part One Release Date Out - Sakshi

టామ్‌ క్రూజ్‌ నటించిన చిత్రం ‘మిషన్‌: ఇంపాజిబుల్‌–డెడ్‌ రికనింగ్‌ పార్ట్‌ వన్‌’. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో రేపు(బుధవారం) విడుదలవుతోంది. ‘‘మిషన్‌: ఇంపాజిబుల్‌–ఫాల్‌ అవుట్‌ (2018)కి సీక్వెల్, 7వ విడత ‘మిషన్‌: ఇంపాజిబుల్‌’ ఫిల్మ్‌ సిరీస్‌గా రూపొందిన చిత్రం ‘మిషన్‌: ఇంపాజిబుల్‌–డెడ్‌ రికనింగ్‌ పార్ట్‌ వన్‌’.

ఏతాన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌), అతని ఐఎమ్‌ఎఫ్‌ (ఇంపాజిబుల్‌ మిషన్‌ ఫోర్స్‌) బృందం ఓ ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభిస్తారు. ఆ మిషన్‌ ఏంటి? టామ్‌ క్రూజ్‌ ఇప్పటివరకూ చేయని, ఈ మూవీలో చేసిన ప్రమాదకరమైన స్టంట్‌ ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement