హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్‌కు చెందిన ఓ లగ్జరీ కారు సినీ ఫక్కీలో చోరీకి గురైంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉన్న కారును పక్కా స్కెచ్‌తో అవలీలగా ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆ బీఎండబ్ల్యూ కారును.. చివరికి ఎలాగోలా ట్రేస్ చేయగలిగిన పోలీసులు. కానీ..
కారులో విలువైన లగేజీ, కొంత డబ్బును మాత్రం ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం బర్మింగ్‌హమ్(ఇంగ్లండ్)లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఓ లగ్జరీ హోటల్‌లో సినిమా యూనిట్ బస చేసింది. అయితే కారు బయట పార్కింగ్ చేసిన కాస్ట్‌లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు.
చాలా తెలివిగా..
మోడ్రన్ డే కారులు కీలెస్‌గా, ఇగ్నిషన్ ఫోబ్స్‌తో వస్తున్నాయి. ఇది దొంగలకు అనుకూలంగా మారుతోంది. వైర్‌లెస్ ట్రాన్స్‌మీటర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే తీరులో టామ్ క్రూజ్ కారు చోరీకి గురైంది. కారుకు దగ్గరగా నిలబడ్డ దొంగలు.. ఫ్రీక్వెన్సీ మీటర్ల ద్వారా ఫోబ్ సిగ్నల్‌ను క్యాప్చర్ చేయగలిగారు. అదే టైంలో ఒరిజినల్ ఫోబ్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పని చేయకుండా చేశారు. అటుపై దర్జాగా కారును వేసుకుని వెళ్లిపోయారు. కారు చోరీకి గురైందని గుర్తించిన టామ్ క్రూజ్ బాడీగార్డులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ట్రేస్ చేసి.. స్మెత్‌విక్ విలేజ్‌లో కారును గుర్తించారు. అయితే కారు దొరికినప్పటికీ.. అందులో లగేజీ, కొంత డబ్బు మాయమైనట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష పౌండ్లు విలువ(మన కరెన్సీలో కోటి రూపాయలు) చేసే బీఎండబ్ల్యూ ఎక్స్7.. 4.4 లీటర్ V8 ఇంజిన్, 523 హార్స్ పవర్ ఇంజిన్, నాలుగు సెకన్లలో 96 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకునే సామర్థ్యం ఉంది. టాప్ స్పీడ్ 249 కిలోమీటర్లు. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తున్న.. MI-7 వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment