
Tom Cruise Chief Guest In RRR Movie Pre Release Event At Dubai: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌గా వస్తున్న చిత్రం చిత్రం 'రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్)'. 14 భాషల్లో తెరకెక్కిన సినిమా కోసం ప్రేక్షకలోకం, అభిమానగనం ఎంతగానో ఎదురచూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో చిత్రబృందం త్వరలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలను తిరిగి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్ఆర్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే తాజాగా ఈ విషయానికి సంబంధించి ఒక క్రేజీ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 'ఆర్‌ఆర్ఆర్' చిత్రం ప్రీరిలీజ్ వేడుకను త్వరలో దుబాయ్‌లో జరిపేందుకు జక్కన్న టీం సన్నహాలు చేస్తుందని టాక్. ఈ అతిపెద్ద ఈవెంట్‌కు ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నడనే వార్త సోషల్ మీడియాలో గింగిరాలు తిరిగుతోంది. కాగా ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వార్త ఆర్‌ఆర్ఆర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Comments
Please login to add a commentAdd a comment