శ్రీదేవికి నాడు యశ్‌ చోప్రా చెప్పని నిజం | When Yash Chopra Didnt Tell Sridevi About Her Father Death | Sakshi
Sakshi News home page

శ్రీదేవికి నాడు యశ్‌ చోప్రా చెప్పని నిజం

Published Mon, Feb 26 2018 3:38 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

When Yash Chopra Didnt Tell Sridevi About Her Father Death - Sakshi

యశ్‌చోప్రా, శ్రీదేవి (ఫైల్‌ ఫొటోలు)

సాక్షి, ముంబయి : ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత గొప్ప నటిగా ఉన్నా శ్రీదేవి మాత్రం తన సహజత్వాన్ని ఎన్నడూ కోల్పోలేదు. అన్నిసార్లు, అన్ని వేళలా ఆమె ఒక మాములు మనిషిగానే ఉన్నారు. బాధ వస్తే చిన్నపిల్లలా ఏడ్చేయడం, సంతోషం వస్తే ఎగిరిగంతేసినంత పని చేయడం ఆమె చేసేవారు. అందుకే, ఆమె సున్నిత మనస్తత్వాన్ని సున్నిత మనస్తత్వాన్ని యశ్‌చోప్రా కూడా ఓ కీలక సందర్భంలో నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయారంట. ఆయన బతికున్న రోజుల్లో ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహార్‌ చేసిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీదేవి అకాల మరణంతో ఇప్పుడు ఆ విషయం వైరల్‌ అవుతోంది. ఇంతకీ యశ్‌ చోప్రా చెప్పలేకపోయిన ఆ విషయం ఏమిటంటే ఆమె తండ్రి మరణ వార్త.

అవును.. లంహే అనే చిత్రం షూటింగ్‌ చేస్తున్నప్పుడు వారంతా మాంచెస్టర్‌లో ఉన్నారంట. ఆ సమయంలో అనుకోకుండా శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ యంగర్‌ చనిపోయినట్లు కబురు వచ్చింది. దీంతో ఆ వార్తను యశ్‌చోప్రా ఆమెకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. దాంతో ఆమెను దగ్గరకు పిలుచుకొని, తండ్రిగారి ఆరోగ్యం బాగాలేదంటా వెళ్లి చూసి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి మెల్లగానే సినిమా షూటింగ్‌కు వచ్చేయ్‌ అని చెప్పారట. దాంతో శ్రీదేవి ఇంటికి వెళ్లి చూసే వరకు కూడా ఆమె తన తండ్రిని కోల్పోయిందనే విషయం తెలుసుకోలేకపోయారంట. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని 16 రోజుల తర్వాత ఆమె తిరిగి షూటింగ్‌కు వచ్చినట్లు యశ్‌చోప్రా చెప్పారు. ఇప్పుడు ఆ విషయం వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement