
జాన్వీ కపూర్
సాక్షి, ముంబై: ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే జాన్వీ కపూర్‌కు కావాల్సినంత స్టార్ డమ్ వచ్చేసిందనే చెప్పాలి. ధడక్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ బ్యూటీ.. తనను తాను ప్రమోట్ చేసుకునే పనులను ప్రారంభించారు. ఓ ప్రముఖ మ్యాగ్జైన్ ఫోటో షూట్‌తో ఆకట్టుకున్న జాన్వీ, ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ఆమె పేర్కొన్నారు.
తన అభిమాన స్టార్లు ఎవరన్న విషయాన్ని చెప్పేశారు. బాలీవుడ్ విలక్షణ నటులు రాజ్‌కుమార్ రావ్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు. ‘వాళ్ల నటన అద్భుతంగా ఉంటుంది. అందుకే వారంటే నాకు ఇష్టం’ అని జాన్వీ చెప్పారు. ముఖ్యంగా రాజ్‌కుమార్ రావ్‌పై ఆమె ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు.
‘ఆయనంటే(రాజ్‌కుమార్ రావ్) ముందునుంచి అభిమానం ఉండేది. కానీ, బరేలీ కీ బర్ఫీ(2017) చిత్రం చూశాక ఆయనకు వీరాభిమానిగా మారిపోయా. ఒకానొక టైమ్‌లో ఆయన దృష్టిలో పడాలని ఎంతో ప్రయత్నించా. ఆయన సోషల్ మీడియాలో ఫోటోలన్నింటికీ కామెంట్లు చేయటం ప్రారంభించా. నేను ఎవరినైనా ఫోటో అడగదల్చుకున్నానంటే అది ఆయన్నే. అంత పిచ్చి ఆయనంటే’ అని జాన్వీ చెప్పుకొచ్చారు. ‘అయితే ఫెవరేట్ అనగానే అందరు హీరోయిన్లలా ఏ ఖానో లేక కపూరో పేరు చెబుతావనుకుంటే.. ఊహించని సమాధానం ఇచ్చావంటూ’ కరణ్, జాన్వీ అభిరుచికి హ్యాట్సాఫ్ చెప్పారు. తల్లి శ్రీదేవితో అనుబంధాన్ని, చివరి స్పర్శను గుర్తు చేసుకున్న ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment