![Janhvi Kapoor: People Hate Me Because Of Karan Johar - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/23/jahanvikapoor.jpg.webp?itok=7OGuOsZb)
మరాఠీ బ్లాక్‌బస్టర్ మూవీ సైరాట్ హిందీలో ధడక్‌గా రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగ్రేటం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించాడు. ఆ తర్వాత కరణ్ నిర్మించిన పలు సినిమాల్లో తళుక్కున మెరిసింది జాన్వీ. ఇదే ఆమెకు విమర్శలు తెచ్చిపెట్టింది. తనను కరణ్ జోహార్ లాంచ్ చేయడం వల్లే తనపై ఇంత విద్వేషం చిమ్ముతారంటొంది జాన్వీ.
తాజాగా బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'గొప్ప నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ నన్ను ఇండస్ట్రీలో లాంచ్ చేసింది. ఇదే నాపై ట్రోలింగ్‌కు కారణమనుకుంటా. ఐకానిక్ ధర్మ ప్రొడక్షన్స్ నన్ను ద్వేషించేందుకు ఓ మార్గాన్ని కల్పించింది. దీనివల్ల ఒత్తిడికి లోనవుతాను, కానీ క్షణం కూడా పశ్చాత్తాపపడను.
ఎందుకంటే.. కరణ్ జోహార్, అతడికి సంబంధించిన ధర్మ ప్రొడక్షన్ హౌస్ సృజనాత్మక నిర్ణయాల గురించి మీకు తెలియదు. వాళ్ల బ్యానర్‌లో పని చేసినందుకు నేను అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నా. అన్నింటికీ మించి కరణ్ వంటి నిర్మాత నుంచి నాకు ప్రేమ, విశ్వాసం, మార్గదర్శకత్వం లభించింది' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. ప్రస్తుతం ఆమె బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలు చేస్తోంది.
చదవండి: ఎట్టకేలకు ఓటీటీలో కాంతార
ఆ హీరోతో డేటింగ్, ఇదేం పాడుపని అన్నారు
Comments
Please login to add a commentAdd a comment