Janhavi Kapoor To Act With Akhil Akkineni In Karan Johar Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Akhil Akkineni: కరణ్‌జోహార్‌ సినిమాలో అఖిల్‌, జాన్వీ కపూర్‌

Published Sat, Mar 12 2022 4:53 PM | Last Updated on Sat, Mar 12 2022 7:04 PM

Janhavi Kapoor Akhil Akkineni Join Hands With Karan Johar Film - Sakshi

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్‌ అ‍క్కినేని ప్రస్తుతం ఏజెంట్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌పై ఇప్పటికే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న అఖిల్‌ ఇందులో 6ప్యాక్‌ బాడీతో కనిపించనున్నాడు. ఇక ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ చిత్రం అనంతరం అఖిల్‌ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్‌కి జంటగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది.

శ్రీదేవీ కూతురిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పటివరకు ఏ టాలీవుడ్‌ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. త్వరలోనే తెలుగులో ఆమె ఎంట్రీ ఉండనున్నట్లు వార్తలు చక్కర్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement