Karan Johar Revealed Sara Ali Khan And Janhvi Kapoor Dated With Two Brothers, Deets Inside - Sakshi
Sakshi News home page

Sara Ali Khan - Janhvi Kapoor: అన్నదమ్ములతో హీరోయిన్ల డేటింగ్‌ !.. ఫొటోలు వైరల్‌

Published Fri, Jul 15 2022 3:33 PM | Last Updated on Fri, Jul 15 2022 9:38 PM

Sara Ali Khan Janhvi Kapoor Dating With Two Brothers - Sakshi

Sara Ali Khan Janhvi Kapoor Dating With Two Brothers: అత్యధిక ప్రజాధరణ పొందిన టాక్‌ షోలలో 'కాఫీ విత్‌ కరణ్‌' ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షో 7వ సీజన్‌ ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ అలరించగా.. రెండో ఎపిసోడ్‌లో బాలీవుడ్‌ బెస్ట్ ఫ్రెండ్స్‌ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్‌ సందడి చేశారు. అయితే వీరిద్దరూ పార్టిస్‌పేట్‌ చేసిన ఎపిసోడ్‌ ఫుల్‌ వీడియో గురువారం (జులై 15)న రిలీజైంది. ఈ ఎపిసోడ్‌లో సారా, జాన్వీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు హోస్ట్‌ కరణ్‌ జోహార్.

కాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో వీరిద్దరు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌ చేయాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి విజయ్‌ కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్ అన్నదమ్ములతో డేటింగ్‌ చేసినట్లు తెలిపాడు కరణ్‌ జోహార్. దీనికి షాకైన ఈ ముద్దుగుమ్మలు 'ఇంత ఓపెన్‌గా షోలో చెప్పేస్తావా ?' అని అన్నారు. తర్వాత ఆ అన్నదమ్ములతో స్నేహం లాక్‌డౌన్‌ సమయంలో జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆ బ్రదర్స్‌ ఇద్దరూ సారా, జాన్వీ పొరుగింట్లో ఉండేవాళ్లని తెలిపారు. కరణ్‌ చేప్పిన మాటలు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. 
 

సారా, జాన్వీతో డేటింగ్‌ చేసిన ఆ అదృష్టవంతులు వీరేనంటూ పలు రకాల వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. వారు డేటింగ్‌ చేసిన బ్రదర్స్‌ వీర్‌ పహారియా, శిఖర్‌ పహారియా (వరుసగా సారా, జాన్వీ)గా తెలుపుతున్నారు నెటిజన్స్‌. అంతేకాకుండా వారి ఫొటోలు సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ వీర్‌, శిఖర్‌ ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవళ్లు కావడంతో ఈ వార్త జోరందుకుంది. కాగా 'కాఫీ విత్‌ కరణ్' టాక్ షో ఏడో సీజన్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement