
‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో ముగ్గురు హీరోయిన్లకు అతిథులుగా ఆహ్వానం అందిందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘గల్లీబాయ్’ వంటి సక్సెస్ ఫిల్మ్ తర్వాత హీరో రణ్‌వీర్ సింగ్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (రాఖీ.. రాణీల ప్రేమకథ). కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే అతిథులుగా కనిపించనున్నారన్నది బీ టౌన్ టాక్.
అంతేకాదు.. కొన్ని సీన్స్‌లో కూడా వీరు ఉంటారట. కరణ్ జోహార్ నిర్మించిన ‘ధడక్’లో జాన్వీ, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో అనన్యా పాండే, ‘సింబ’ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్లుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. సో.. కరణ్ రిక్వెస్ట్ మేరకు ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో జాన్వీ, సారా, అనన్యలు అతిథులుగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment