ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. తెలియకుండానే కొందరు ప్రేమలో పడిపోతారు. కానీ కొందరే చివరివరకు ఆ ప్రేమను నిలుపుకుంటారు. చాలామటుకు ప్రేమలు మధ్యలోనే పుటుక్కుమంటాయి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేనికీ శుభం కార్డు పడలేదు. లవ్ ఆజ్ కల్ 2 సినిమా షూటింగ్ సమయంలో సారా అలీ ఖాన్‌తో, దోస్తానా 2 మూవీ చిత్రీకరణ టైంలో జాన్వీ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడిచింది.
ఇద్దరమ్మాయిలతో డేటింగ్
దోస్తానా 2 షూటింగ్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. అప్పుడే వీరి ప్రేమ కూడా ముగిసిపోయింది. తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్.. తన పాత లవ్ కహానీల గురించి ప్రస్తావించాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు అవునని బదులిస్తూనే.. ఒకవేళ నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు.
కనిపిస్తే అదే అడుగుతా
మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతావు? అని హోస్ట్ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్.. ఇద్దరూ క్లోజ్‌ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్ సినిమా చేస్తున్నాడు. అలాగే భూల్ భులయ్యా 3, ఆషిఖి 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment