‘నేను అలా పిలిస్తే ఆమె స్పృహ తప్పడం ఖాయం’ | Sara Ali Khan Said If I Called Kareena Kapoor Khan As Choti Maa Then A Fell Down | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 19 2018 12:27 PM | Last Updated on Mon, Nov 19 2018 12:27 PM

Sara Ali Khan Said If I Called Kareena Kapoor Khan As Choti Maa Then A Fell Down - Sakshi

నేను అలా పిలిస్తే కరీనా గుండె బద్దలవుతుంది అంటున్నారు సైఫ్‌ అలీ ఖాన్‌ గారాల పట్టి సారా అలీ ఖాన్‌. నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమానికి తండ్రి సైఫ్‌ అలీ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు సారా అలీ ఖాన్‌. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానలు ఇచ్చారు సారా అలీ ఖాన్‌. ఈ క్రమంలో తన మారు తల్లి కరీనా కపూర్‌కి, తనకు మధ్య ఉన్న రిలేషన్‌ గురించి మాట్లాడారు సారా. ‘మీ అమ్మ చాలా గొప్పది. నేను మీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ కరీనా తనతో చెప్పేదన్నారు. అంతేకాక తన తండ్రి కూడా కరీనాను మారు తల్లిగా ఎప్పుడు తనకు పరిచయం చేయలేదని తెలిపారు.

ఈ సందర్భంగా ‘ఒకవేళ నేను కరీనాను ‘ఛోటి మా’(చిన్నమ్మ) అని పిలిస్తే తన గుండె బద్దలవుతుందం’టూ హాస్యమాడారు. తన తండ్రి సైఫ్‌, తల్లి అమృతా సింగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వడం చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు నా తల్లి, తండ్రి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక వేళ వారు కలిసి ఉన్నా కూడా ఇంత సంతోషంగా ఉండే వారు కాదేమో. ఈ రోజు నాకు రెండు సౌకర్యవంతమైన కుటుంబాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట్లో అయినా.. మా అమ్మ అమృత దగ్గరైనా మేం చాలా సంతోషంగా ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చారు. సారా ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు ఆమె మెచ్యూరిటీ లెవల్స్‌కి, ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. ‘నీకు గొప్ప భవిష్యత్‌ ఉంది.. మరో 10 ఏళ్లలో నువ్వే బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌’ అంటూ సారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘కేదార్‌నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు సారా అలీ ఖాన్‌. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. అయితే తొలి చిత్రం రిలీజ్‌ కాకాముందే మరో క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నారు సారా. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రన్‌వీర్‌ సింగ్‌ సరసన సింబా చిత్రంలో నటిస్తున్నారు సారా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement