sail ali khan
-
అయోధ్య వేడుకలో కనిపించని సైఫ్ జంట: ఆసుపత్రిలో చేరిన సైఫ్అలీ ఖాన్?
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ముగిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరోలందరూ తరలివచ్చారు. బిగ్‌బీ అమితాబ్, చిరంజీవితోపాటు,ధనుష్ అలియా భట్-రణబీర్ కపూర్ జంట, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ దంపతులు, ఆయుష్మాన్ ఖురానా , రణదీప్హుడా, భర్త శ్రీరామ్‌తో కలిసి మాధురీ దీక్షిత్ , జాకీ ష్రాఫ్ సహా పలువురు సెలబ్రిటీలు అయోధ్య నగరానికి తరలివచ్చారు. ఇంకా చిత్ర నిర్మాతలు రోహిత్ శెట్టి ,రాజ్ కుమార్ హిరానీ నిర్మాత మహావీర్ జైన్ ఇంకా సుభాయ్ఘాయ్ తదితరులు బాలరాముణ్ని దర్శించుకున్నారు.రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, ఇషా అంబానీ, అనిల్ అంబానీ, ఎయిర్టెల్ చీఫ్ తదితర వ్యాపార దిగ్గజాలు కూడా హాజరైన్నారు. #WATCH | Ayodhya: On the Shri Ram Pran Pratishtha ceremony, BJP leader Bansuri Swaraj says, "... The ambience of the whole country has changed for good. My heart feels very happy... I would credit the late Ashok Singhal for this day... This 500-year-long fight was for our… pic.twitter.com/EzMbdn0rDV — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Dhanush attended the Ayodhya Ram Temple 'Pran Pratishtha' ceremony today pic.twitter.com/r1B7UdVLBp — ANI (@ANI) January 22, 2024 కానీ ఆదిపురుష్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అతని భార్య కరీనా కపూర్ జాడ కనిపించలేదు. అయితే మోకాలి , భుజానికి గాయం కారణంగా సైఫ్ సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం. ఓం రౌత్ దర్శకత్వంలో కృతి సనన్ , ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
క్వారంటైన్ కటింగ్
లాక్ డౌన్ సమయంలో సెలూన్స్ అన్నీ బంద్ కావడంతో సరదాగా కత్తెర్లు పడుతున్నారు కొందరు. ఆ మధ్య తన భర్త విరాట్ కోహ్లీ హెయిర్ కట్ చేశారు అనుష్కా శర్మ. తాజాగా కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కి హెయిర్ కట్ చేశారు సైఫ్ అలీ ఖాన్. కొడుకు జట్టుని భర్త కత్తిరిస్తున్న ఫొటోను కరీనా కపూర్ తన ఇన్ స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. -
‘నేను అలా పిలిస్తే ఆమె స్పృహ తప్పడం ఖాయం’
నేను అలా పిలిస్తే కరీనా గుండె బద్దలవుతుంది అంటున్నారు సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్. నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి తండ్రి సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు సారా అలీ ఖాన్. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానలు ఇచ్చారు సారా అలీ ఖాన్. ఈ క్రమంలో తన మారు తల్లి కరీనా కపూర్‌కి, తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడారు సారా. ‘మీ అమ్మ చాలా గొప్పది. నేను మీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ కరీనా తనతో చెప్పేదన్నారు. అంతేకాక తన తండ్రి కూడా కరీనాను మారు తల్లిగా ఎప్పుడు తనకు పరిచయం చేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఒకవేళ నేను కరీనాను ‘ఛోటి మా’(చిన్నమ్మ) అని పిలిస్తే తన గుండె బద్దలవుతుందం’టూ హాస్యమాడారు. తన తండ్రి సైఫ్, తల్లి అమృతా సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వడం చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు నా తల్లి, తండ్రి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక వేళ వారు కలిసి ఉన్నా కూడా ఇంత సంతోషంగా ఉండే వారు కాదేమో. ఈ రోజు నాకు రెండు సౌకర్యవంతమైన కుటుంబాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట్లో అయినా.. మా అమ్మ అమృత దగ్గరైనా మేం చాలా సంతోషంగా ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చారు. సారా ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు ఆమె మెచ్యూరిటీ లెవల్స్‌కి, ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. ‘నీకు గొప్ప భవిష్యత్ ఉంది.. మరో 10 ఏళ్లలో నువ్వే బాలీవుడ్ టాప్ హీరోయిన్’ అంటూ సారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 10 Years From Now - #SaraAliKhan is going to be the number one female star. So Confident, So Charming, So Vocal, So Honest... One Episode of #KoffeeWithKaran, and quite sure that she has already won several hearts! — Himesh (@himeshmankad) November 18, 2018 ‘కేదార్నాథ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సారా అలీ ఖాన్. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. అయితే తొలి చిత్రం రిలీజ్ కాకాముందే మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నారు సారా. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రన్వీర్ సింగ్ సరసన సింబా చిత్రంలో నటిస్తున్నారు సారా. -
సంక్రాంతి వరకు సెలవులోనే హీరో
ఇటీవలే తండ్రి అయిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ జవనరి మధ్య వరకు.. అంటే సుమారు సంక్రాంతి వరకు సెలవులోనే ఉంటాడట. ఆ తర్వాతే తాను తదుపరి చేయబోతున్న 'చెఫ్' సినిమా షూటింగులో పాల్గొంటాడట. అప్పటివరకు తాను పితృత్వ సెలవు తీసుకుంటానని ఈ నవాబు గారు చెబుతున్నట్లు టాక్. సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ ఈనెల 20వ తేదీన ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో మగబిడ్డను కంది. ఆమెను ఆస్పత్రినుంచి గురువారమే డిశ్చార్జి చేశారు. తమ కొడుక్కి తైమూర్ అలీఖాన్ పటౌడీ అని వీళ్లు పేరు పెట్టుకున్నారు. చివరిసారిగా చెఫ్ షూటింగులో సైఫ్ ఈనెల 12న పాల్గొన్నాడని, జనవరి రెండోవారం తర్వాత నుంచి మళ్లీ వస్తాడని చిత్ర దర్శకుడు రాజా కృష్ణ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, దాన్ని విదేశాల్లో తీస్తామని అన్నారు. ఇందుకోసం తాను అమెరికా, యూరప్ దేశాల్లో కొన్ని ప్రాంతాలు చూశానని, త్వరలోనే ఖరారు చేస్తానని చెప్పారు. ఈయన ఇంతకుముందు అక్షయ్ కుమార్ హీరోగా ఎయిర్‌లిఫ్ట్ సినిమా తీశారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సైఫ్ చేసిన 'రంగూన్' సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది.