సంక్రాంతి వరకు సెలవులోనే హీరో | Saif ali khan on paternity leave till mid-January | Sakshi
Sakshi News home page

సంక్రాంతి వరకు సెలవులోనే హీరో

Published Fri, Dec 23 2016 12:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

సంక్రాంతి వరకు సెలవులోనే హీరో

సంక్రాంతి వరకు సెలవులోనే హీరో

ఇటీవలే తండ్రి అయిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ జవనరి మధ్య వరకు.. అంటే సుమారు సంక్రాంతి వరకు సెలవులోనే ఉంటాడట. ఆ తర్వాతే తాను తదుపరి చేయబోతున్న 'చెఫ్' సినిమా షూటింగులో పాల్గొంటాడట. అప్పటివరకు తాను పితృత్వ సెలవు తీసుకుంటానని ఈ నవాబు గారు చెబుతున్నట్లు టాక్. 
 
సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ ఈనెల 20వ తేదీన ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో మగబిడ్డను కంది. ఆమెను ఆస్పత్రినుంచి గురువారమే డిశ్చార్జి చేశారు. తమ కొడుక్కి తైమూర్ అలీఖాన్ పటౌడీ అని వీళ్లు పేరు పెట్టుకున్నారు. చివరిసారిగా చెఫ్ షూటింగులో సైఫ్ ఈనెల 12న పాల్గొన్నాడని, జనవరి రెండోవారం తర్వాత నుంచి మళ్లీ వస్తాడని చిత్ర దర్శకుడు రాజా కృష్ణ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, దాన్ని విదేశాల్లో తీస్తామని అన్నారు. ఇందుకోసం తాను అమెరికా, యూరప్ దేశాల్లో కొన్ని ప్రాంతాలు చూశానని, త్వరలోనే ఖరారు చేస్తానని చెప్పారు. ఈయన ఇంతకుముందు అక్షయ్ కుమార్ హీరోగా ఎయిర్‌లిఫ్ట్ సినిమా తీశారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సైఫ్ చేసిన 'రంగూన్' సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement