అయోధ్య వేడుకలో కనిపించని సైఫ్‌ జంట: ఆసుపత్రిలో చేరిన సైఫ్‌అలీ ఖాన్‌? | Ayodhya Ram Mandir Pran Pratishtha what happened to Adipurush actor saif alikhan | Sakshi
Sakshi News home page

అయోధ్య వేడుకలో కనిపించని సైఫ్‌ జంట: ఆసుపత్రిలో చేరిన సైఫ్‌ అలీ ఖాన్‌?

Published Mon, Jan 22 2024 5:01 PM | Last Updated on Tue, Jan 23 2024 2:53 PM

Ayodhya Ram Mandir Pran Pratishtha what happened to Adipurush actor saif alikhan - Sakshi

అయోధ్యలో  బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ముగిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా జరిగిన ఈ  వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా  రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.   ముఖ్యంగా  బాలీవుడ్‌  స్టార్ హీరోయిన్‌, హీరోలందరూ తరలివచ్చారు.  

బిగ్‌బీ అమితాబ్‌, చిరంజీవితోపాటు,ధనుష్‌ అలియా భట్-రణబీర్ కపూర్ జంట, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ దంపతులు,  ఆయుష్మాన్ ఖురానా , రణదీప్‌హుడా,   భర్త శ్రీరామ్‌తో కలిసి మాధురీ దీక్షిత్ ,  జాకీ ష్రాఫ్ సహా పలువురు సెలబ్రిటీలు అయోధ్య నగరానికి  తరలివచ్చారు. ఇంకా చిత్ర నిర్మాతలు రోహిత్ శెట్టి ,రాజ్ కుమార్ హిరానీ  నిర్మాత మహావీర్ జైన్ ఇంకా సుభాయ్‌ఘాయ్‌ తదితరులు బాలరాముణ్ని దర్శించుకున్నారు.రిలయన్స్‌ అధినేత ముఖేష్‌  అంబానీ, నీతా అంబానీ ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, ఇషా అంబానీ, అనిల్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ చీఫ్‌  తదితర వ్యాపార  దిగ్గజాలు  కూడా హాజరైన్నారు.


కానీ  ఆదిపురుష్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌, అతని భార్య  కరీనా కపూర్‌ జాడ  కనిపించలేదు. అయితే మోకాలి , భుజానికి గాయం   కారణంగా సైఫ్‌  సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు  తెలుస్తోంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం. ఓం రౌత్ దర్శకత్వంలో కృతి సనన్ , ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో  నటించిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement