ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత యాష్ చొప్రా తనయుడు బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా నటిస్తున్న తాజా చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధూమ్ -౩. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉదయ్ చొప్రా మూడేళ్ల తరువాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షులకు ముందుకు రానుంది. ధూమ్ -౩ లో ఉదయ్ `అలీ` అనే ఎమోషన్ ల్ పాత్ర పోషిస్తున్నాడు. అంతకమందు ధూమ్ రెండు సీరిస్ లలో ఉదయ్ చొప్రా తన నటనతో అభిమానులను మెప్పించాడు. ఆదిత్య చొప్రా నిర్మాతగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ధూమ్ -3 ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం విశేషాలపై బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా పిటిఐతో మాట్లాడుతూ.. బాలీవు్డ్ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద దర్శకుడైన తన తండ్రి యాష్ చొప్రా దర్శకత్వంలో తాను నటించలేకపోకపోయనందుకు చాలా బాధపడుతున్నట్టు చెప్పాడు. తాను ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్ లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంతవరకూ ఆ అవకాశం రాలేదని, ఆ కల తీరేలోపే తన తండ్రి యాష్ చొప్రా అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధించిందని చెప్పాడు. ఇది నా జీవితంలో పెద్ద విషాద సంఘటనగా పేర్కొన్నాడు.
యాష్ చొప్రా దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పడు తనకు ఏదైనా చిన్న సన్నివేశంలో పాత్ర ఇవ్వమని సోదరుడు ఆదిత్యను కోరినట్టు చెప్పాడు. `జబ్ తక్ హాయ్ జాన్` అనే చిత్రం చివరి దశలో ఉండగా, యాష్ చొప్రా అనుకోని విధంగా డెంగ్యూ బారిన పడి మరణించారని తెలిపాడు. అప్పటికి తండ్రి యాష్ చొప్రాకు 80ఏళ్ల వయస్సు. తాను ధూమ్ -౩ చిత్రం కోసం చికాగోలో ఉండగా, ఆ సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ ఫోన్ వచ్చింది. అప్పటికి తండ్రి మరణించిన విషయం తన సోదరుడు ఆదిత్య చెప్పలేదన్నాడు. తన తండ్రి మరణవార్త వినడంతోనే తాను దిగ్బ్రాంతికి లోనైయన్నాడు.
ప్రస్తుతం రాబోతున్న ధూమ్ -౩ చిత్రంలో తాను పోషిస్తున్నరోల్ `అలీ` (తపొరీ - రౌడీ)గా అందరినీ ఆకట్టుకుంటుందన్నాడు. వరుస పరాజయాల అనంతరం మరల తెరపైకి కనిపించబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నెగిటివ్ రోల్ లో ఆమీర్ ఖాన్ నటించడం అందరికీ తెలిసిందే.
నాన్న దర్శకత్వంలో నటించలేకపోవడం బాధకరం: ఉదయ్ చొప్రా
Published Mon, Dec 9 2013 2:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement