Yash Raj Films production
-
Alpha: స్పై యూనివర్స్‌లోకి వచ్చేస్తోన్న ‘ఆల్ఫా’ గర్ల్స్
‘వైఆర్ఎఫ్’ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న మరో హిందీ చిత్రం ‘ఆల్ఫా’. ఆలియా భట్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో శార్వరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వంలో ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఆల్ఫా’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘నిశితంగా గమనిస్తే ప్రతి నగరంలోనూ ఓ అడవి ఉంటుంది. ఆ అడవిని ఏలేది మనమే’’ అంటూ ఆలియా భట్ చెప్పే డైలాగ్ ఈ చిత్రం అనౌన్స్మెంట్ టీజర్లో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయా లనుకుంటున్నారు. -
చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా...
తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో బాలీవుడ్ కథానాయిక వాణీకపూర్. ‘ఆహా కల్యాణం’లో నానికి జంటగా నటించిన ఈ ఢిల్లీ భామ, ‘శుద్ద్ దేశీ రొమాన్స్’ చిత్రంతో యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ‘ఆహా కల్యాణం’తో తెలుగు ప్రేక్షకులతోనూ ఆహా అనిపించుకుంటానంటోన్న వాణీకపూర్‌తో ‘సాక్షి’ స్పెషల్ చిట్‌చాట్... * మీరేమో ఉత్తరాది అమ్మాయి. మీ పేరు చూస్తే దక్షిణాది వారిలా అనిపిస్తోంది? మా నాన్నగారే నాకు ఈ పేరు పెట్టారు. ప్రత్యేక కారణం కూడా ఏమీ లేదట. బహుశా భవిష్యత్తులో నాకు సినిమాల ద్వారా దక్షిణాదితో అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఆ పేరు సెట్ అయ్యిందేమో. * అసలు సినిమా రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. మన భారతీయ సినిమాలకు బలం పాటలే. సినిమాల్లో పాటలు, డాన్సులు చూసినప్పుడు నాకు భలే అనిపించేది. పైగా, నేను ఏ విషయాన్నయినా చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాను. అందుకే సినిమాలనే కెరీర్‌గా ఎంపిక చేసుకున్నాను. * మీ తొలి చిత్రమే (శుద్ద్ దేశీ రొమాన్స్) యశ్‌రాజ్ సంస్థలో చేశారు. ఆ అవకాశం ఎలా వచ్చింది? ముంబయ్‌లో మోడలింగ్ చేసేటప్పుడు ఓ కాస్టింగ్ డెరైక్టర్ ద్వారా యశ్‌రాజ్ సంస్థలో ఆడిషన్స్‌కి వెళ్లాను. ఆ తర్వాత చాలాసార్లు ఆడిషన్స్ చేశారు. ఓ ఆరేడు నెలలు ఉండి, సినిమా కుదిరితే ఓకే.. లేకపోతే ఢిల్లీ వెళ్లిపోవాలనుకున్నాను. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా అవకాశం ఇచ్చారు. ఈ బేనర్లో తొలి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా రెండో సినిమా కూడా ఇందులో చేయడం ఆనందంగా ఉంది. * ఇంతకీ ‘ఆహా కల్యాణం’ మాతృక ‘బ్యాండ్ బాజా బారాత్’ చూశారా? ఆ సినిమా విడుదలవ్వగానే చూశాను. అయితే, ఈ చిత్రం ‘ఆహా కల్యాణం’గా రీమేక్ అవుతుందని, అందులో నాకే అవకాశం వస్తుందని అనుకోలేదు. వచ్చిన తర్వాత మాత్రం చూడలేదు. ఎందుకంటే, అనుష్క శర్మ ప్రభావం నా మీద ఉండకూడదనుకున్నా. * ‘పెళ్లి’ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.. అసలు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదో రోజు పెళ్లి చేసుకుని సెటిలవుతా. వివాహ బంధం చాలా గొప్పది. * పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏంటనుకుంటున్నారు? వయసుతో సంబంధం లేదు. జీవితంలో సెటిల్ అవ్వడం ప్రధానం. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మానసికంగా రెడీ అయినప్పుడే పెళ్లి చేసుకోవాలి. నా సిస్టర్ నుపుర్‌కి పద్ధెనిమిదేళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ‘నువ్వు మాత్రం అలా చేసుకోవద్దు’ అని చెప్పింది. కొన్నాళ్లు జీవితాన్ని ఎంజాయ్ చేసి, పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది. * ఈ సినిమాలో నానితో మీ పెళ్లి చాలా వైభవంగా జరిగి ఉంటుంది. నిజజీవితంలో ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలను కుంటున్నారు. వైభవంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలో నిర్ణయించుకోలేదు. నా పెళ్లి నిరాడంబరంగా జరిగినా ఫర్వాలేదు. కానీ, నా పెళ్లికి వచ్చేవాళ్లందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి. * నాని గురించి చెప్పండి? నాని యాక్ట్ చేసిన ‘ఈగ’ సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. తను మంచి నటుడు. ఎప్పుడైతే కోస్టార్ మంచి పర్ఫార్మరో, అప్పుడు ఆటోమేటిక్‌గా తనకు పోటీగా బాగా యాక్ట్ చేయాలనే పట్టుదల ఏర్పడుతుంది. * అవసరమైతే బికినీ ధరిస్తానని, లిప్ లాక్కి రెడీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎప్పటికీ ఆ మాట మీదే ఉంటారా? తప్పకుండా. చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా? మరి.. సినిమాలో అలాంటి సీన్స్‌లో బికినీ వేసుకుంటే తప్పేంటి? అలాగే మంచి రొమాంటిక్ స్టోరీ అనుకోండి... హీరో హీరోయిన్ మధ్య లిప్‌లాక్ సీన్స్ ఉంటాయి కదా. అవి చేస్తేనే సీన్ పండుతుంది. కథకి అవసరమైనవి చేయడానికి నేను వెనకాడను. -
దుమ్ము రేపుతున్న ధూమ్ 3
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రవేశించి దుమ్ము రేపిన ధూమ్ 3 ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందో తెలుసా? ఒక్కసారి గుండె చిక్కబట్టుకోండి. ఎందుకంటే, ఇప్పటివరకు భారత సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని మొత్తమది. వంద కోట్ల కలెక్షన్లను అత్యంత తక్కువ సమయంలో సాధించిన ఘనత ధూమ్ 3దే. దాంతోపాటు.. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు 466.29 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది సరికొత్త రికార్డులు సాధిస్తోంది. పాకిస్థాన్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. తొలిరోజు భారత దేశంలో బాక్సాఫీసు రికార్డులను ఇది బద్దలుకొట్టింది. మొదటి రోజే 36.22 కోట్ల నెట్ కలెక్షన్లతో పాటు తొలి మూడు రోజుల్లో 107 కోట్లు సంపాదించింది. తొలిరోజు 36.22 కోట్లు, రెండో రోజు 33.36 కోట్లు, మూడో రోజు ఆదివారం 36.05 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి వెండితెర మొత్తాన్ని ఏలేసిన ఈ సినిమా ఇప్పటికి దాదాపు 184.70 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు కేవలం భారత్ లోనే సంపాదించింది. పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో యష్ రాజ్ ఫిలింస్ చేసి చూపించింది. భారతదేశంలో 4వేల థియేటర్లలోను, విదేశాల్లో 700 థియేటర్లలోను ఒకేసారి విడుదల చేశారు. దాంతోపాటు రాబోయే నెల రోజుల పాటు ఎలాంటి పెద్ద సినిమాలు విడుదల కాని సమయం చూసుకుని దీన్ని బయటకు తీసుకొచ్చారు. ధూమ్ బ్రాండు ఎటూ ఉండటంతో మొదటి మూడు నాలుగు రోజుల్లో జనం ఆటోమేటిగ్గా థియేటర్లకు వచ్చారు. వచ్చిన తర్వాత అందులోని గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, అమీర్ మ్యాజిక్ లాంటివాటితో పాటు కత్రినా కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. రిపీట్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోటీ పడుతుందనుకున్న క్రిష్ 3 నవంబర్ 1న విడుదలైనా, మూడువారాలతో దాని కథ చాలావరకు ముగిసిపోయింది. నవంబర్ 14న రామ్ లీలా విడుదలైనా దానికి డివైడ్ టాక్ వచ్చింది. దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు వెళ్లేందుకు కాస్త మొహమాటపడ్డారు కూడా. ఇవన్నీ కూడా ధూమ్ 3కి బాగా కలిసొచ్చాయి. తదుపరి పెద్ద చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ జనవరి 24న విడుదల కానుంది. దాంతో అప్పటివరకు ధూమ్ 3దే రాజ్యం అన్నమాట. ఇంకా ఎన్ని వందలకోట్లు మూటగట్టుకుంటుందో చూడాలి మరి!! -
`గూండే` లో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక చోప్రా
ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `గూండే`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నందితా పాత్రలో క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు చిత్ర నిర్మాత అలీ అబ్బాస్ జాఫర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా, ఆధిత్య చోప్రా నిర్మాత. రణబీర్ సింగ్ బిక్రమ్ పాత్రలో, అర్జున్ కపూర్ బాల పాత్రను పోషిస్తుండగా, ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో మరో రోల్ చేస్తున్నట్టు తెలిసింది. 1970నాటి కలకత్తా నగరంలోని పరిస్థితుల ఆధారంగా చేసుకుని ఈ గుంఢే చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు జాఫర్ ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు ప్రేక్షుకులకు తెలియజేశాడు. ఈ చిత్రాన్ని 2014లో ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాత జాఫర్ చెప్పారు. గూండే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను శుక్రవారం దుబాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఈ కొత్త ట్రైలర్ ను `యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ` యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంటుందని చిత్ర నిర్మాత వెల్లడించారు. -
దుబాయ్ ఫిల్మ్ ఫెస్ట్‌లో `గూండే` ట్రైలర్ విడుదల
బాలీవుడ్లో భారీ నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ `గూండే`. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను దుబాయ్ ఇంటర్నేషన్ ల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ హాజరుకానున్నట్టు ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. ఈ చిత్రంలో రణబీర్ సింగ్, అర్జున్ కపూర్, బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రాలు ప్రధాన పాత్రలు పొషించారు. వీరంతా దుబాయ్ ఇంటర్నేషన్ ల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరుకానున్నారు. 1970 సంవత్సరంనాటి కలకత్తా నగర పరిస్థితులను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. గూండే చిత్ర కథంతా బిక్రమ్, బాలా పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ కథ ఓ మాఫియా (నల్ల బంగారాన్ని దొంగిలించే పెద్ద మాఫియా ముఠా) కథనంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి అధిత్య చొప్రా నిర్మాతగా వ్యవహరించిన `గూండే` చిత్రం 2014 ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్ ను విడుదల చేశారు. తొలి టీజర్ లో రణబీర్ సింగ్, అర్జున్ కపూర్ తో చేసిన సన్నివేశాలే మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ టీజర్ సన్నివేశాల్లో ప్రియాంకా చొప్రా లేకపోవడంపై ఆమె తరువాత వివరణ ఇస్తూ.. అది కేవలం ప్రచార వ్యూహంలో భాగమేనని చెప్పినట్టు తెలిసింది. ఈ గూండే చిత్రానికి సంబంధించి కొత్త ట్రైలర్ ను `యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ` యూ ట్యూబ్ లో శుక్రవారం నాడు అందుబాటులో ఉంటుందని చిత్ర నిర్మాత వెల్లడించారు. -
నాన్న దర్శకత్వంలో నటించలేకపోవడం బాధకరం: ఉదయ్ చొప్రా
ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత యాష్ చొప్రా తనయుడు బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా నటిస్తున్న తాజా చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధూమ్ -౩. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉదయ్ చొప్రా మూడేళ్ల తరువాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షులకు ముందుకు రానుంది. ధూమ్ -౩ లో ఉదయ్ `అలీ` అనే ఎమోషన్ ల్ పాత్ర పోషిస్తున్నాడు. అంతకమందు ధూమ్ రెండు సీరిస్ లలో ఉదయ్ చొప్రా తన నటనతో అభిమానులను మెప్పించాడు. ఆదిత్య చొప్రా నిర్మాతగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ధూమ్ -3 ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలపై బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా పిటిఐతో మాట్లాడుతూ.. బాలీవు్డ్ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద దర్శకుడైన తన తండ్రి యాష్ చొప్రా దర్శకత్వంలో తాను నటించలేకపోకపోయనందుకు చాలా బాధపడుతున్నట్టు చెప్పాడు. తాను ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్ లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంతవరకూ ఆ అవకాశం రాలేదని, ఆ కల తీరేలోపే తన తండ్రి యాష్ చొప్రా అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధించిందని చెప్పాడు. ఇది నా జీవితంలో పెద్ద విషాద సంఘటనగా పేర్కొన్నాడు. యాష్ చొప్రా దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పడు తనకు ఏదైనా చిన్న సన్నివేశంలో పాత్ర ఇవ్వమని సోదరుడు ఆదిత్యను కోరినట్టు చెప్పాడు. `జబ్ తక్ హాయ్ జాన్` అనే చిత్రం చివరి దశలో ఉండగా, యాష్ చొప్రా అనుకోని విధంగా డెంగ్యూ బారిన పడి మరణించారని తెలిపాడు. అప్పటికి తండ్రి యాష్ చొప్రాకు 80ఏళ్ల వయస్సు. తాను ధూమ్ -౩ చిత్రం కోసం చికాగోలో ఉండగా, ఆ సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ ఫోన్ వచ్చింది. అప్పటికి తండ్రి మరణించిన విషయం తన సోదరుడు ఆదిత్య చెప్పలేదన్నాడు. తన తండ్రి మరణవార్త వినడంతోనే తాను దిగ్బ్రాంతికి లోనైయన్నాడు. ప్రస్తుతం రాబోతున్న ధూమ్ -౩ చిత్రంలో తాను పోషిస్తున్నరోల్ `అలీ` (తపొరీ - రౌడీ)గా అందరినీ ఆకట్టుకుంటుందన్నాడు. వరుస పరాజయాల అనంతరం మరల తెరపైకి కనిపించబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నెగిటివ్ రోల్ లో ఆమీర్ ఖాన్ నటించడం అందరికీ తెలిసిందే.