దుబాయ్ ఫిల్మ్ ఫెస్ట్‌లో `గూండే` ట్రైలర్ విడుదల
Published Tue, Dec 10 2013 4:39 PM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
బాలీవుడ్లో భారీ నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ `గూండే`. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను దుబాయ్ ఇంటర్నేషన్ ల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ హాజరుకానున్నట్టు ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. ఈ చిత్రంలో రణబీర్ సింగ్, అర్జున్ కపూర్, బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రాలు ప్రధాన పాత్రలు పొషించారు. వీరంతా దుబాయ్ ఇంటర్నేషన్ ల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరుకానున్నారు.
1970 సంవత్సరంనాటి కలకత్తా నగర పరిస్థితులను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. గూండే చిత్ర కథంతా బిక్రమ్, బాలా పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ కథ ఓ మాఫియా (నల్ల బంగారాన్ని దొంగిలించే పెద్ద మాఫియా ముఠా) కథనంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి అధిత్య చొప్రా నిర్మాతగా వ్యవహరించిన `గూండే` చిత్రం 2014 ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్ ను విడుదల చేశారు.
తొలి టీజర్ లో రణబీర్ సింగ్, అర్జున్ కపూర్ తో చేసిన సన్నివేశాలే మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ టీజర్ సన్నివేశాల్లో ప్రియాంకా చొప్రా లేకపోవడంపై ఆమె తరువాత వివరణ ఇస్తూ.. అది కేవలం ప్రచార వ్యూహంలో భాగమేనని చెప్పినట్టు తెలిసింది. ఈ గూండే చిత్రానికి సంబంధించి కొత్త ట్రైలర్ ను `యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ` యూ ట్యూబ్ లో శుక్రవారం నాడు అందుబాటులో ఉంటుందని చిత్ర నిర్మాత వెల్లడించారు.
Advertisement
Advertisement