`గూండే` లో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక చోప్రా | Priyanka Chopra glams up 'Gunday' as cabaret dancer | Sakshi
Sakshi News home page

`గూండే` లో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక చోప్రా

Published Thu, Dec 12 2013 6:03 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

`గూండే` లో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక చోప్రా

`గూండే` లో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక చోప్రా

ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `గూండే`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నందితా పాత్రలో క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు చిత్ర నిర్మాత అలీ అబ్బాస్ జాఫర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా, ఆధిత్య చోప్రా నిర్మాత. రణబీర్ సింగ్ బిక్రమ్ పాత్రలో, అర్జున్ కపూర్ బాల పాత్రను పోషిస్తుండగా, ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో మరో రోల్ చేస్తున్నట్టు తెలిసింది.

1970నాటి కలకత్తా నగరంలోని పరిస్థితుల ఆధారంగా చేసుకుని ఈ గుంఢే చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు జాఫర్ ఈ చిత్రంలో  ప్రియాంక చోప్రా క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు ప్రేక్షుకులకు తెలియజేశాడు. ఈ చిత్రాన్ని 2014లో ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాత జాఫర్ చెప్పారు.

గూండే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను శుక్రవారం దుబాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఈ కొత్త ట్రైలర్ ను `యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ` యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంటుందని చిత్ర నిర్మాత వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement