Gunday
-
'రాయల్ స్టాగ్' అంబాసిడర్లుగా రణవీర్, అర్జున్!
న్యూఢిల్లీ: రాయల్ స్టాగ్ ఉత్పత్తులకు బాలీవుడ్ హీరోలు రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. రణ్ వీర్, అర్జున్ సింగ్ లిద్దరూ ఇటీవల విడుదలైన గూండే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. రాయల్ స్టాగ్ కంపెనీ ఫిలాసఫీ తెగనచ్చిందని ఇద్దరు హీరోలు ఓ ప్రకటన చేశారు. 'ఇది మీ జీవితం. బ్రహ్మండంగా ఆనందించండి. నేను సాధించాలని అనుకుంటే 100 శాతం ఇవ్వడానికి సిద్దంగా ఉంటాను అని అర్ధవచ్చే సందేశం తమకు నచ్చిందని రణ్ వీర్, అర్జున్ లు తెలిపారు. -
రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల గూండే
-
న్యూ గెటప్‌లో ప్రియాంక చోప్రా
-
'నాకు ఏ హీరోయిన్ తో ఎఫైర్ లేదు'
నాకు ఎవరితో కూడా ఎఫైర్లు కాని, లింకులు కాని లేవని బాలీవుడ్ నటుడు, బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ స్పష్టం చేశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కూతురు ఆలియా భట్ తో అఫైర్ నడుపుతున్నారని వస్తున్న వార్తలను అర్జున్ ఖండించాడు. 'ప్రస్తుతం నేను ఒంటరినే. నా దృష్టి అంతా కెరీర్ పైనే ఉంది. కెరీర్ లో ఉన్నత శిఖరానికి చేరుకోవడమే ఏకైక లక్ష్యం. ఆతర్వాతే నేను జీవిత భాగస్వామి కోసం ఆలోచిస్తాను' అని అర్జున్ తెలిపారు. ప్రస్తుతం తాను పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించడం లేదు. నా జీవితంలో ఏ అమ్మాయి ప్రస్తుతం చోటు లేదు అని తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన 'గూండే' చిత్రంలో రణ్ వీర్ సింగ్, ప్రియాంక చోప్రాతో కలిసి అర్జున్ నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. చేతన్ భగత్ నవల '2 స్టేట్స్: ది స్టోరి ఆఫ్ మై మ్యారేజ్' ఆధారంగా రూపొందుతున్న '2 స్టేట్స్' చిత్రంలో ఆలియా భట్ నటిస్తొంది. -
`గూండే` లో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక చోప్రా
ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `గూండే`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నందితా పాత్రలో క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు చిత్ర నిర్మాత అలీ అబ్బాస్ జాఫర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా, ఆధిత్య చోప్రా నిర్మాత. రణబీర్ సింగ్ బిక్రమ్ పాత్రలో, అర్జున్ కపూర్ బాల పాత్రను పోషిస్తుండగా, ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో మరో రోల్ చేస్తున్నట్టు తెలిసింది. 1970నాటి కలకత్తా నగరంలోని పరిస్థితుల ఆధారంగా చేసుకుని ఈ గుంఢే చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు జాఫర్ ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క్యాబరే డాన్సర్ గా నటిస్తున్నట్టు ప్రేక్షుకులకు తెలియజేశాడు. ఈ చిత్రాన్ని 2014లో ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాత జాఫర్ చెప్పారు. గూండే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను శుక్రవారం దుబాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఈ కొత్త ట్రైలర్ ను `యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ` యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంటుందని చిత్ర నిర్మాత వెల్లడించారు.