వాళ్లతో గడిపిన క్షణాలు... | amithab tribute to chopras on their Birth aniversary | Sakshi
Sakshi News home page

వాళ్లతో గడిపిన క్షణాలు...

Published Sun, Sep 27 2015 12:39 PM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

amithab tribute to chopras on their Birth aniversary

బాలీవుడ్ దర్శకనిర్మాత యాష్ చోప్రా జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. తన ప్రతి అనుభూతిని ట్విటర్ లో అభిమానులతో పంచుకునే బిగ్బి... తనకు దివార్, కబీ కబీ, కాలాపత్తర్, సిల్సిలా లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన యష్ చోప్రాను ఆయన 83వ జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

యాష్ చోప్రాతో పాటు ఆయన మేనల్లుడు రవి చోప్రా జయంతి కూడా కావటంతో వారిద్దరితో కలిసి పనిచేసిన రోజులను మరోసారి మననం చేసుకున్నారు అమితాబ్. చోప్రా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండే అమితాబ్ 2012లో ఆయన స్మారకార్థం ఏర్పాటుచేసిన యాష్ చోప్రా మెమోరియల్ అవార్డ్ అందుకున్నారు. యాష్ చోప్రా 2012, అక్టోబర్ 12న మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement