Ravi Chopra
-
ది బర్నింగ్ ట్రైన్....
బి.ఆర్.చోప్రా కొడుకు రవిచోప్రా భారీగా తీసిన సినిమా ఇది. ఇంత భారీగా తీయడం వెనుక ‘షోలే’ ఘన విజయం ఉంది. 1975లో విడుదలైన షోలే సృష్టించిన కలెక్షన్లు అసామాన్యమైనవి. దీంతో రవి చోప్రా కూడా చాలా ఖర్చు పెట్టి భారీ హంగామాతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుని ఈ కథ తీశాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతున్న కొత్త రైలు ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’ అగ్ని ప్రమాదానికి గురైతే అందరూ కలిసి దానిని ఎలా ఆపారు, ప్రయాణికులను ఎలా రక్షించారు అనేది కథ. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, పర్విన్బాబీ, హేమమాలిని, నీతూ సింగ్ ఇంత మంది హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. డానీ విలన్. 1980 మార్చిలో విడుదలైంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా చాలా తొందరగా కలెక్షన్లు పడిపోయాయి. షోలేలో ఉన్న కథ, మానవోద్వేగాలు, విలన్ ఇందులో అంత గట్టిగా లేకపోవడం కథ రైలు వరకే కుదించుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. కాని టెక్నికల్‌గా సినిమా మంచి ప్రమాణాలు అందుకుంది. ఇందులో రఫీ ఖవాలి (సాహిర్ రచన) ‘పల్ దో పల్ కా సాథ్ హమారా... పల్ దో పల్ కే యారానే హై’ పెద్ద హిట్. ఈ సినిమాకు సంబంధించి ఈ పాటే మిగిలింది. -
వాళ్లతో గడిపిన క్షణాలు...
బాలీవుడ్ దర్శకనిర్మాత యాష్ చోప్రా జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. తన ప్రతి అనుభూతిని ట్విటర్ లో అభిమానులతో పంచుకునే బిగ్‌బి... తనకు దివార్, కబీ కబీ, కాలాపత్తర్, సిల్సిలా లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన యష్ చోప్రాను ఆయన 83వ జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యాష్ చోప్రాతో పాటు ఆయన మేనల్లుడు రవి చోప్రా జయంతి కూడా కావటంతో వారిద్దరితో కలిసి పనిచేసిన రోజులను మరోసారి మననం చేసుకున్నారు అమితాబ్. చోప్రా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండే అమితాబ్ 2012లో ఆయన స్మారకార్థం ఏర్పాటుచేసిన యాష్ చోప్రా మెమోరియల్ అవార్డ్ అందుకున్నారు. యాష్ చోప్రా 2012, అక్టోబర్ 12న మరణించారు. T 2008 - Yash ji's birth anniversary .. Yash Chopra and the glorious times spent together .. pic.twitter.com/nRGiVr2xqb — Amitabh Bachchan (@SrBachchan) September 26, 2015 T 2008 - Yash Chopra ji's birth anniversary falls on the same day as Ravi Chopra his nephew .. with whom I had great times too .. — Amitabh Bachchan (@SrBachchan) September 26, 2015 T 1098 - RT @MosesSapir #HappyBirthdayYashChopra @SrBachchan pic.twitter.com/d02jVpDR6s @yrf pic.twitter.com/mLQw78Lent — Amitabh Bachchan FC (@Thekkapoor) September 26, 2015 -
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రవిచోప్రా మృతి
ముంబై: ప్రముఖ బాలీవుడు దర్శకుడు, నిర్మాత బీఆర్ చోప్రా కుమారుడు ప్రముఖ దర్శకుడు రవి చోప్రా (68) బుధవారం ముంబైలో మరణించారు. గత కొంత కాలంగా ఆయన ఉపిరితిత్తులకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రవిచోప్రాను ఆయన కుటుంబ సభ్యులు నవంబర్ 6న నగరంలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు కన్నుమూశారు. రవిచోప్రా అంత్యక్రియలు గురువారం ఉదయం 11.00 గంటలకు పవన్ హన్స్లో నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రవిచోప్రాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రవిచోప్రా మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. రవిచోప్రా మృతి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ చిత్రదర్శకుడు మదురు బండార్కర్ అన్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అతి అరుదైన వ్యక్తుల్లో రవిచోప్రా ఒకరని ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ తెలిపారు. రవిచోప్రా మృతిపై ప్రముఖ నటీ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన దర్శకత్వంలో పని చేసిన చిత్రాలకు సంబంధించిన అంశాలను స్మృతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. రవి చోప్రా ఇన్సఫ్ కా తరజు చిత్రానికి అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. అమితాబ్, హేమమాలిని కాంబినేషన్లో బాగ్బన్ చిత్రాన్ని తీశారు. జమీర్ (1975), ద బర్నింగ్ ట్రైన్ (1980), మజ్దూర్ (1983), దహ్లీజ్ (1986), బాబుల్ (2006) భూతనాథ్, భూత్నాథ్ రిటర్న్స్ చిత్రాలను ఆయన నిర్మించారు. మహాభారత్ సీరియల్ రవిచోప్రాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.