బస్సు టిక్కెట్ ధరలే ఎక్కువని చాలామంది ప్రజలు ట్రైయిన్‌లో ప్రయాణించి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. పైగా ట్రైయిన్‌లో బెర్త్ బుక్ చేసుకుని హాయిగా పడుకుని వెళ్లిపోవచ్చు. సాధారణంగా సంపన్నులు మంచి ఫస్ట్ క్టాస్ ట్రైయిన్‌లో ప్రయాణిస్తారు లేదా లగ్జరియస్ బోగి బుక్ చేసుకుని వెళ్లడం గురించి విన్నాం. కానీ అత్యంత ఖరీదైన రైల్వే టిక్కెట్ ఒకటి ఉంటుందని, అక్కడ రైల్లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఎప్పుడైనా విన్నారా!.
ఔను} ఈ ట్రైయిన్ టిక్కట్ ధర అత్యంత ఖరీదు. పైగా లోపల ఫైవ్ స్టార్ రేంజ్‌లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. చూస్తే మనకు ఇది ట్రైయిన్ లేక హోటల్ అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. మహారాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో రాజభవనాన్ని తలపించేలా రాయల్ ట్రీట్‌మెంట్‌తో కూడిన సౌకర్యాలు ఉంటాయి. ఐతే టిక్కెట్ ధర ఎంతంటే అక్షరాల 19 లక్షలు పై చిలుకే ఉంటుంది.
ఈ లగ్జరీ రైలు 2010 నుంచి తన సేవలను అందిస్తోంది. ఈ రైలుని మన సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత రాజసంగా తీర్చి దిద్దారు. ఈ రైలులో అత్యంత సంపన్నులు బుక్ చేసుకునే బోగిలోని గదులను నవరత్నగా పిలుస్తారు. ఆ గది ఎంత విలాసవంతంగా ఉంటుందో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు మాత్రం నమ్మశక్యంగా లేదంటూ కామెంటు చేస్తూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment