
దేశంలో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాళ్ల జాబితాలో క్రికెటర్లు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మొదలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ముందుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వీరి సంపాదన వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

అయితే, ఈ నలుగురి కంటే అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళా క్రికెటర్ ఒకరు ఉన్నారు

ఆమే మృదుల జడేజా. .. ఓ యువరాణి

గుజరాత్‌లోని రాజవంశానికి చెందిన అమ్మాయి.

ఆమె తండ్రి పేరు మంధాతసిన్హ్ జడేజా.

తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి మృదుల చారిత్రాత్మక రంజిత్ విలాస్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు.

రాజ్‌కోట్‌లో సుమారు 225 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్టేట్‌లో.. సుమారు ఆరు ఎకరాల స్థలంలో ఈ భవనం ఉంది.

మృదుల పూర్వీకులకు చెందిన ఈ ప్యాలెస్‌లో 150కి పైగా గదులు ఉన్నట్లు సమాచారం. మృదుల జడేజా ఆల్‌రౌండర్.

దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర మహిళా జట్టుకు ఆమె సారథ్యం వహించారు.

తన కెరీర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో 46(వన్డే), టీ20 ఫార్మాట్లో 36, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక మ్యాచ్ ఆడారు.

33 ఏళ్ల మృదుల కుడిచేతి వాటం బ్యాటర్ .. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!!











