most
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాలు
న్యూస్‌కు సంబంధించి.. 1. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం 2. టైటానిక్ సబ్‌మెరైన్ 3. టర్కీ భూకంపం వ్యక్తులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. జెరెమీ రెన్నర్ (అమెరికన్ నటుడు) 3. ఆండ్రూ టేట్ (కిక్బాక్సర్–సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్) సంగీత కళాకారులు 1. షకీరా (కొలంబియా సింగర్) 2. జేసన్ ఆల్డీన్ (అమెరికన్ సింగర్) 3. జో జోనాస్ (అమెరికన్ సింగర్–నటుడు) సినిమాలు 1. బార్బీ 2. ఓపెన్ హైమర్ 3. జవాన్ క్రీడాకారులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. కైలియన్ ఎంబాపే (ఫ్రెంచ్ ఫుట్‌బాలర్) 3. ట్రావిస్ కెల్స్ (అమెరికన్ ఫుట్‌బాలర్) చనిపోయిన ప్రముఖులు 1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు) 2. టీనా టర్నర్ (అమెరికన్ సింగర్, నటి) 3. సినీడ్ ఓ కానర్ (ఐరిష్ సింగర్, లిరిసిస్ట్) -
IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..
ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒక్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్‌కి వచ్చాయి. 2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే.. ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఫోన్‌పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది. ఆకాష్: బైజూస్ అనుబంధ సంస్థ అయిన ఎడ్టెక్ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా. ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్ చేసింది. ఫార్మ్ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు. మొబీక్విక్: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌తో కలిసి సుమారు 84 మిలియన్ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్‌కు వస్తోంది. పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్‌కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది. -
వీటిలో అయితే పనిచేస్తాం.. మహిళల ఛాయిస్ ఇవే..
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ), టెలికం, ఈ-కామర్స్ రంగాల్లో కెరీర్ అవకాశాల పట్ల ఎక్కువ మంది మహిళా ఉద్యోగార్థులు సుముఖంగా ఉన్నారు. అలాగే మెజారిటీ మహిళలు ఇంటి నుంచి పనిచేసే అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ వివరాలను ఆప్నా డాట్ కో ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. కెరీర్లో సౌకర్యం, అంకిత భావానికి మధ్య సమతుల్యం ఉండాలని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు. నైట్ షిఫ్ట్‌లలో 18 లక్షల మంది మహిళలు అప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్‌పై మహిళల ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 18 లక్షల మంది మహిళలు రాత్రి షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారని.. సవాళ్లను అంకిత భావంతో ఎదుర్కొనేందుకు వారు సంసిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అప్నా ప్లాట్‌ఫామ్‌పై 1.38 కోట్ల మంది మహిళలు సభ్యులుగా ఉంటే, అందులో 67 లక్షల మంది టైర్–2 పట్టణాలకు చెందిన వారు. గతేడాదితో పోలిస్తే 33 శాతం మేర పెరిగారు. చండీగఢ్, పాట్నా, లక్నో, అజ్మీర్, వదోదర పట్టణాల నుంచి సభ్యుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ పట్టణాలకు చెందిన మహిళా ఉద్యోగార్థులు ఎక్కువగా బిజినెస్ డెవలప్మెంట్, హెచ్ఆర్, బ్యాక్ ఆఫీస్, బోధన, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరగడం కేవలం జనాభాపరమైన మార్పు కంటే కూడా ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించినది. ఇది కుటుంబాల శ్రేయస్సు, సామాజిక పురోగతికి తోడ్పడుతుంది’’అని అప్నా డాట్ కో వ్యవస్థాపకుడు, సీఈవో నిర్మిత్ పారిఖ్ తెలిపారు. -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
శాంతియుత దేశం ఏది? అశాంతికి నిలయమెక్కడ? భారత్ పరిస్థితేంటి?
అది.. మొన్నటి అక్టోబర్ 7 నాటి ఉదయం.. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగినవార్త హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలాది క్షిపణులను హమాస్ ప్రయోగించింది. అక్కడి ప్రజలు ముందురోజు రాత్రిపూట ఎంత ప్రశాంతంగా నిద్రించారో.. మరుసటి రోజు నాటికి విగతజీవులుగా ఎలా మారారో తలచుకుంటేనే ఆవేదన పెల్లుబికి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రపంచంలో శాంతి కరువైపోతున్నదనే భావన అందరిలో కలుగుతుంది. ఏ దేశంలో ఎప్పుడు దాడి జరగవచ్చో అనే ఆందోళన అందరినీ పట్టిపీడిస్తుంది. ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఎవరూ చెప్పలేకపోయినా, అందుకు బదులుగా ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఇది 2008 నుండి ఇదే స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు కూడా అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఉన్నాయి. 2023లో ప్రపంచంలో అత్యల్ప శాంతియుత దేశం ఆఫ్ఘనిస్తాన్. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇదే స్థాయిలో ఉంది. యెమెన్, సిరియా, సౌత్ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు మరో నాలుగు తక్కువ శాంతియుత దేశాల జాబితాలో చేరాయి. అత్యధిక జనాభా కలిగిన భారత దేశం 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్ (జీపీటీ)లో 126వ అత్యంత శాంతియుత దేశంగా ఉంది. హింసాత్మక నేరాలు తగ్గుముఖం, పొరుగు దేశాలతో సంబంధాలు, రాజకీయ అస్థిరత కారణంగా గత ఏడాది దేశంలో శాంతి 3.5 శాతం మెరుగుపడింది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కూడా తగ్గింది. ఇది కూడా చదవండి: భారత్-యూరప్ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది? -
కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? బంగారం, ప్లాటినం ఎందుకు దిగదుడుపు?
ఎవరైనా ఏదైనా ఖరీదైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు ముందుగా బంగారాన్ని ప్రస్తావిస్తారు. నిజానికి ఒక గ్రాము బంగారం కొనాలన్నా కూడా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లాటినం దాని కంటే ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే బంగారం, ప్లాటినం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. దీనికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఖనిజం ఏది? దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం. బంగారం కంటే ఖరీదైన ఖనిజాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ జాబితాలో అనేకమైనవి కనిపిస్తాయి. వాటిలో మనం ఉపయోగించే వాటి విషయానికొస్తే రోథియం, పల్లాడియం, ఇరిడియం, జాడైట్ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాకుండా మనం నేరుగా ఉపయోగించని అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. అవి బంగారం కంటే చాలా ఖరీదైనవి. వీటిలో లిథియం లాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఖనిజం ఏమిటో తెలుసుకుందాం. అత్యంత ఖరీదైన ఖనిజం విషయంలో అనేక వాదనలు వినిపిస్తాయి. దానికి సంబంధించిన అనేక నివేదికలు కనిపిస్తాయి. ఆ నివేదికల ప్రకారం చూస్తే రోథియం అత్యంత ఖరీదైనది. మరికొందరు శాస్త్రవేత్తలు జాడైట్ ఖనిజం అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. జాడైట్ ఒక రకమైన రాయి. అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఖరీదైన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. దీని ధర క్యారెట్లలో ఉంటుంది. డైమండ్ మాదిరిగా ఇది క్యారెట్ల లెక్కన లభిస్తుంది. జాడైట్ క్యారెట్ ధర చాలా అధికం. ఒక క్యారెట్ జాడైట్ ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని చెబుతారు. అంటే ఒక్క జాడైట్ రాయి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? -
వైఎస్సార్ స్మృతివనంలో ఆఫ్రికా వృక్షం
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంవత్సరాలు జీవించే వృక్షజాతుల్లో అడెనేషియా సోనియా ఒకటి. ఆఫ్రికా ఖండంలో విస్తారంగా కనిపించే ఈ మహావృక్షం మనదేశంలోనూ అక్కడక్కడా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా గార్గేయపురం గ్రామంలో ఒకటి, గ్రామ శివార్లలో కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పక్కన మరో రెండు వృక్షాలున్నాయి. అలాగే జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఎస్పీజీ గ్రౌండ్స్ పక్కనున్న క్రైస్తవ శ్మశాన వాటికలో రెండు వృక్షాలు కనిపిస్తున్నాయి. గార్గేయపురంలో ఉన్న చెట్లలో ఒకదానిని ట్రీ ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో అక్కడ నుంచి ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో ఉన్న వైఎస్సార్ స్మృతివనంలో పునఃస్థాపించారు. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న అడెన్ సోనియా చెట్టు వయస్సు 6వేల ఏళ్లుగా నిర్ధారించి ఇది ప్రపంచంలో ఎక్కువ కాలంగా జీవించిన చెట్టుగా చెబుతున్నారు. వీటిని ఇక్కడ బ్రహ్మమల్లిక, ఏనుగు చెట్టు, పారిజాతంగా పిలుస్తున్నారు. -
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్‌మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
టాప్ 100 స్టార్టప్‌లలో భారత్ సంస్థలు.. దిగ్గజాల సరసన చోటు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిస్కులను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషించే సాంకేతికతను జాక్‌మాజ్ రూపొందిస్తోంది. నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ .. క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
అమెజాన్‌ను మించి.. ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్ ఏంటో తెలుసా?
ముంబై: దేశీయంగా అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ (ఉద్యోగాలు కల్పించే సంస్థ) బ్రాండ్‌గా టాటా పవర్ కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ వరుసగా రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. మానవ వనరుల సర్వీసుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తమ వార్షిక నివేదిక ‘రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2023‘లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక స్థితి, మంచి పేరు, కెరియర్లో పురోగమించేందుకు అవకాశాలు కల్పించడం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా రాండ్‌స్టాడ్ ర్యాంకులు ఇచ్చింది. దీని ప్రకారం 2022లో 9వ స్థానంలో ఉన్న టాటా పవర్ తాజాగా నంబర్ వన్ స్థానానికి చేరింది. నివేదిక ప్రకారం ఉద్యోగులు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా ఆటోమోటివ్‌కు (77 శాతం) ఓటేశారు. ఐటీ, ఐటీఈఎస్, టెలికం (76 శాతం) .. ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్ (75 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. టాప్ 10 కంపెనీల్లో నాలుగో స్థానంలో టీసీఎస్.. ఆ తర్వాత వరుసగా మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయ స్టార్టప్ ఎంప్లాయర్‌గా బిగ్ బాస్కెట్ నిల్చింది. ఎంప్లాయర్‌ను ఎంచుకునేటప్పుడు ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం, కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు, ఆకర్షణీయమైన జీతభత్యాలకు ఉద్యోగార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదనపు ఆదాయం కోసం వేరే అసైన్మెంట్లు లేదా అదనంగా మరో ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించే కంపెనీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని 91 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. సిబ్బంది ఆధారంగానే వ్యాపారంలో విజయం సాధించగలమని, పెట్టుబడి ఒక్కటే సరిపోదని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తిస్తున్నాయి. అలాగే, ఉద్యోగులు కూడా తాము ఏ బ్రాండుతో కలిసి పని చేయాలి, దీర్ఘకాలికంగా పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఎలా ఉంటుంది అనే అంశాలపై మరింతగా ఆలోచిస్తున్నారు. -
భారతదేశంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ప్రత్యేక భవనాలు
-
ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
'సోషల్’ ప్రచారాస్త్రం!
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏప్రిల్– మే నెలల్లో జరిగే అసెంబ్లీ 'ఎన్నికల ప్రచారానికి కర్ణాటక రాజకీయ పార్టీలు కొత్త అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. యువత, విద్యావంతులను ఆకర్షించేలా సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళికల రూపకల్పనను ముమ్మరం చేస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఒకదానితో ఒకటి పోటీపడుతూ వాట్సాప్, ట్వీటర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రచారం కోసం కార్పొరేట్ శైలిలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఈ బృందాలకు ‘సోషల్ మీడియా వింగ్’లుగా నామకరణం చేశాయి. ఇందులో బీజేపీ కాస్త ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఇక రాబోయే ఎన్నికల్లో పార్టీల మధ్య ‘సోషల్ మీడియా’ వేదికగా వార్‌ను చూడొచ్చని స్పష్టమవుతోంది. స్మార్ట్ఫోనే ఆయుధం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రత్యేక సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజలకు కలుగుతున్న మేలుతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వెలుగు చూస్తున్న కుంభకోణాలు, ఆరోపణలను ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ సోషల్ మీడియా వింగ్ పరిధిలో 7,000 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 100–150 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. ఇటీవల బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సోషల్ మీడియా కాన్క్లేవ్’ను కూడా నిర్వహించింది. ఈ కాన్క్లేవ్కు వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులను ఆహ్వానించింది. మొదటి విడతలో 3,500 మంది హాజరయ్యారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు అదే దారి హైకమాండ్ ఆదేశాలతో ఇటీవల సోషల్ మీడియా వింగ్‌ను ప్రారంభించిన అధికార కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 5,000 వాట్సాప్ గ్రూపుల ద్వారా తన విధానాలను ప్రచారం చేస్తోంది. సీఎం సిద్ధరామయ్య కూడా ఇటీవలే ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలు తెరిచారు. వీటి ద్వారా ఆయన తమ పార్టీ విధానాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు కేంద్రంలోని బీజేపీ పాలనను ఎండగడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో క్రియాశీలమయ్యే దిశగా జేడీఎస్ అడుగులు వేస్తోంది. పార్టీలోని వలంటీర్లను ఎంపిక చేసి వారి ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ పేరిట ట్వీటర్ ఖాతాను నడుపుతోంది. ఆ వింగ్‌ల పనేంటంటే ఆయా పార్టీల్లోని సోషల్ మీడి యా వింగ్‌లలో ఉన్న యాక్టివ్ సభ్యులు ఎప్పటికప్పుడు తమ పార్టీ విధానాలను సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేస్తూ ఉండాలి. అంతేకాదు పార్టీలోని కీలక నేతల ప్రసంగాలు, వారి వీడియోలు వంటి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలి. అలాగే ఇతర పార్టీల లోపాలపై కూడా ముమ్మరంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. -
మధుమేహంలో మనది రెండోస్థానం!
భారత దేశంలో మధుమేహం వేగంగా వ్యాప్తి చెందుతోందని, గతేడాది ఏడు కోట్ల వరకూ కేసులు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి. ఇండియాలో మధుమేహం సూపర్ ఫాస్ట్ గా పెరిగిపోతోందని ఐడీఎఫ్ లెక్కలను బట్టి తెలుస్తోంది. 20 నుంచి 70 ఏళ్ళ మధ్య వయసు కలిగిన వారు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనాలు చెప్తున్నాయి. 2014 లో 6.68 కోట్ల మంది ఉండగా, 2015 నాటికి మరో 6.91 కోట్లు పెరిగినట్లు ఆరోగ్య మంత్రి జె పి నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలోని అధిక డయాబెటిస్ కలిగిన మొదటి మూడు దేశాల్లో రెండోస్థానంలో ఉన్నట్లు వైద్య పత్రిక ది లాన్సెట్ నివేదికల ద్వారా తెలుస్తోంది. మధుమేహంలో రెండవ అత్యధిక స్థానంలో ఉండే చైనాను తాజాగా ఇండియా అధిగమించినట్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యయనాల ఆధారంగా తెలుస్తోందని.. నడ్డా తెలిపారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్.. డయాబెటిస్ అట్లాస్.. ఏడవ ఎడిషన్ ప్రకారం చైనా 109.6 మిలియన్ల మధుమేహ రోగులతో అత్యధిక స్థానంలో ఉంది. 61.1 మలియన్ ప్రజలతో భారత్ ఉండగా, అమెరికా మాత్రం 29.3 మిలియన్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాన్నర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ వ్యాధుల నింత్రణకు ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి వరకూ అమలు చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఆధునిక జీవన శైలిలో మార్పులు, రోగ నిర్థారణ, అధిక సౌకర్యాల నిర్వహణ వంటి వాటిపై దృష్టి సారించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు. -
గూగుల్ సెర్చింగ్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది
-
ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడి మృతి
మెక్సికో సిటి: ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడుగా పేరున్న మెక్సికోకు చెందన ఆండ్రస్ మొరేనో(38) శుక్రవారం మృతి చెందాడు. ఒకానొక దశలో 450 కిలోల బరువుకు చేరుకున్న మొరీనో.. రెండు నెలల క్రితం బరువు తగ్గడానికి బెరియాట్రిక్ సర్జరీని ఆశ్రయించాడు. సర్జరీ ద్వారా సుమారు 100 కిలోల బరువును డాక్టర్లు తగ్గించారు. దీంతో పాటు అహారం మితంగా తీసుకోవడానికి పొట్టలో ట్యూబ్‌ను అమర్చారు. క్రిస్మస్ రోజున ఒక్కసారిగా మొరేనో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఫైర్‌మెన్ సహాయంతో అతడిని హుటాహుటిన అసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో మొరేనో పోలీస్మెన్గా పనిచేశాడు. అధిక బరువు మూలంగా కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యాడు. వెయిట్ లాస్ కోసం చేయించుకున్న బెరియాట్రిక్ సర్జరీ విఫలం కావడం వలనే మొరేనో మృతి చెందాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.