అది.. మొన్నటి అక్టోబర్ 7 నాటి ఉదయం.. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగినవార్త హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలాది క్షిపణులను హమాస్ ప్రయోగించింది. అక్కడి ప్రజలు ముందురోజు రాత్రిపూట ఎంత ప్రశాంతంగా నిద్రించారో.. మరుసటి రోజు నాటికి విగతజీవులుగా ఎలా మారారో తలచుకుంటేనే ఆవేదన పెల్లుబికి వస్తుంది.
ఇటువంటి పరిస్థితిలో ప్రపంచంలో శాంతి కరువైపోతున్నదనే భావన అందరిలో కలుగుతుంది. ఏ దేశంలో ఎప్పుడు దాడి జరగవచ్చో అనే ఆందోళన అందరినీ పట్టిపీడిస్తుంది. ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఎవరూ చెప్పలేకపోయినా, అందుకు బదులుగా ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2023లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్‌లాండ్ గుర్తింపు పొందింది. ఇది 2008 నుండి ఇదే స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు కూడా అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఉన్నాయి. 2023లో ప్రపంచంలో అత్యల్ప శాంతియుత దేశం ఆఫ్ఘనిస్తాన్. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇదే స్థాయిలో ఉంది. యెమెన్, సిరియా, సౌత్ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు మరో నాలుగు తక్కువ శాంతియుత దేశాల జాబితాలో చేరాయి.
అత్యధిక జనాభా కలిగిన భారత దేశం 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్ (జీపీటీ)లో 126వ అత్యంత శాంతియుత దేశంగా ఉంది. హింసాత్మక నేరాలు తగ్గుముఖం, పొరుగు దేశాలతో సంబంధాలు, రాజకీయ అస్థిరత కారణంగా గత ఏడాది దేశంలో శాంతి 3.5 శాతం మెరుగుపడింది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కూడా తగ్గింది.
ఇది కూడా చదవండి: భారత్-యూరప్ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది?
Comments
Please login to add a commentAdd a comment