వైఎస్సార్ స్మృతివనంలో పునఃప్రతిష్టించిన అడెన్ సోనియా వృక్షం
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంవత్సరాలు జీవించే వృక్షజాతుల్లో అడెనేషియా సోనియా ఒకటి. ఆఫ్రికా ఖండంలో విస్తారంగా కనిపించే ఈ మహావృక్షం మనదేశంలోనూ అక్కడక్కడా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా గార్గేయపురం గ్రామంలో ఒకటి, గ్రామ శివార్లలో కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పక్కన మరో రెండు వృక్షాలున్నాయి. అలాగే జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఎస్‌పీజీ గ్రౌండ్స్ పక్కనున్న క్రైస్తవ శ్మశాన వాటికలో రెండు వృక్షాలు కనిపిస్తున్నాయి.
గార్గేయపురంలో ఉన్న చెట్లలో ఒకదానిని ట్రీ ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో అక్కడ నుంచి ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో ఉన్న వైఎస్సార్ స్మృతివనంలో పునఃస్థాపించారు. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న అడెన్ సోనియా చెట్టు వయస్సు 6వేల ఏళ్లుగా నిర్ధారించి ఇది ప్రపంచంలో ఎక్కువ కాలంగా జీవించిన చెట్టుగా చెబుతున్నారు. వీటిని ఇక్కడ బ్రహ్మమల్లిక, ఏనుగు చెట్టు, పారిజాతంగా పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment