పూర్తిగా గడ్డకట్టిన మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ఫిన్లండ్‌లోని కెమీ నగరంలో ఉంది. దీనిని తొలిసారిగా 1996లో ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే ఈ హోటల్‌కు మూడు లక్షల మంది అతిథులు వచ్చారు. ఫిన్లండ్‌లో ఏటా ఏప్రిల్ వరకు శీతకాలం ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు గడ్డకట్టే పరిస్థితులే ఉంటాయి.
అందువల్ల ఏటా శీతకాలంలో ఈ హోటల్‌ను నిర్మించి, అతిథులకు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి మొదలయ్యాక ఈ మంచు అంతా కరిగిపోతుంది. దాదాపు ఇరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్‌లో ఒక ప్రార్థనా మందిరం, రెస్టారెంట్ సహా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇందులోని టేబుళ్లు, కుర్చీలు, మంచాలు కూడా మంచుతో తయారు చేసినవే! వీటిపైన ధ్రువపు జింకల చర్మంతో సీట్లు, పరుపులు ఏర్పాటు చేస్తారు. ఇందులోని రెస్టారెంట్‌లో విందు భోజనాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment