భూమికి దిగువన అద్భుతాలు ఉంటాయని, వాటిని చూస్తే ఎంతో ఆశ్యర్యం కలుగుతుందనే విషయం మీకు తెలుసా? పైగా అక్కడ నివాసయోగ్యానికి అనువైన సకల సౌకర్యాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అరుదైన ప్రత్యేకతల కారణంగా ఒక హోటల్ చర్చల్లో నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటంటే ఈ హోటల్ భూమికి 1,375 అడుగులు(419 మీటర్లు) లోతున ఉంది. దీనిలో బస చేసేందుకు విలాసవంతమైన గదులు, పసందైన ఆహార పానీయాలు అందుబాటులో ఉన్నాయి. కపుల్స్ కోసం ప్రత్యేకమైన గదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ హోటల్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ అండర్‌గ్రౌండ్ హోటల్ బ్రిటన్‌లో ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇది ప్రపంచంలోనే.. భూమికి అత్యంత లోతున ఉన్న హోటల్‌గా పేరొందింది. ఇది నార్త్‌వేల్స్‌లోని స్నోడోనియా పర్వతాలపై భూమికి 419 మీటర్ల దిగువన ఉంది. దీనిలో 4 పర్సనల్ ట్విన్-బెడ్ క్యాబిన్‌తో పాటు డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. అయితే ఈ హోటల్‌లోని గదులను శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది.
హోటల్‌కు చేరుకునేందుకు ట్రెక్కింగ్
ఈ హోటల్‌కు వెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సివుంటుంది. కొన్ని గంటల పాటు ట్రెక్కింగ్ చేసిన తరువాతనే ఈ హోటల్‌కు చేరుకోగలుగుతారు. ఈ మార్గంలో జలపాతాలు, అందమైన కొండలు, ఎగుడుదిగుడు రహదారులు, సొరంగమార్గాలు మొదలైనవి ఉంటాయి. ఈ హోటల్‌కు వెళ్లేవారికి ఒక గైడ్ తోడుగా ఉంటాడు. ఆయన హోటల్‌లో స్టే చేసేవారిని అందమైన మార్గం గుండా తీసుకువెళతారు. ఈ ప్రయాణం సాగించేవారికి హార్నర్స్ రోప్, హెల్మెట్, బూట్లు, లైటు మొదలైనవి అవసరం అవుతాయి.
ఎంట్రీ గేటు వద్ద..
ఈ హాటల్‌కు వెళ్లే మార్గంలో పలు కళాఖండాలు కనిపిస్తాయి. ముందుకు సాగుతున్నప్పుడు వీటి గురించి గైడ్ వివరిస్తాడు. చివరగా హోటల్ ఎంట్రీలో ఒక పెద్ద ఇనుప తలుపు కనిపిస్తుంది. లోనికి ప్రవేశించగానే వెల్కమ్ డ్రింక్, స్నాక్స్‌తో స్వాగత సత్కారం లభిస్తుంది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉంటుంది.
హోటల్ బుకింగ్ ధర ఎంతంటే..
గో బిలో అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్ క్యాబిన్ బుకింగ్ ధర రూ. 36,000. గుహ రూము బుకింగ్‌కు రూ. 57,000 వెచ్చించాల్సి ఉంటుంది. దీనిలో టీ, టిఫిన్ ఖర్చులు కలిసి ఉంటాయి. డైలీ స్టార్ స్యూస్ వెబ్‌సైట్‌తో ఈ హోటల్ మేనేజర్ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చే అతిథులు ఇక్కడి ఏర్పాట్లను ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడ బస చేసేవారికి మంచి నిద్ర పడుతుంది. ఇక్కడికి వచ్చేవారు అన్నిరకాల ఆందోళనలను విడిచి పెట్టి, ప్రశాంతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. అందుకే ఈ హోటల్‌కు ‘డీప్ స్లీప్’ అనే పేరుపెట్టామన్నారు. ఈ హోటల్‌లో చిన్నచిన్న క్యాబిన్‌లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని రాళ్ల మధ్యలో రూపొందించారు. ఇక గదుల విషయానికి వస్తే అవి గుహలను పోలివుంటాయి. వీటిలో పెద్దసైజు బెడ్‌లను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ..
Comments
Please login to add a commentAdd a comment