Tourist area
-
రాజమండ్రి : పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)
-
భారత్‌లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. షిల్లాంగ్ తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
-
Ananthagiri Hills: కూల్ వెదర్..హాట్ స్పాట్..
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగర ప్రజలు, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, ఫైర్ క్యాంప్, అడ్వెంచర్ గేమ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇటువంటి సందర్భాల్లో హిల్ స్టేషన్లలో ఫైర్ క్యాంప్‌తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లు రిస్సార్ట్స్, హోటల్ యాజమాన్యాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. రానున్నది శీతాకాలం. కాబట్టి ఫిబ్రవరి వరకూ ఈ క్యాంపులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.ఔటర్ చుట్టూ.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో ఫాం హౌస్‌లు, పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. రానున్న శీతాకాలంలో సాయంత్రం మంచు కురిసే వేళలో వెచ్చగా ఫైర్ క్యాంప్ కల్చర్ వచ్చే ఐదు నెలలపాటు కొనసాగుతుంది. దీనికి తోడు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర ఫంక్షన్లు వంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎత్తైన హిల్ స్టేషన్లలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, వాయు, శబ్ధ కాలుష్యాలకు దూరంగా, ఇతర ఆటంకాలు ఉండని చోటు కోరుకుంటున్నారు. చల్లని వాతావరణంలో.. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలికాచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమొరీస్‌ను పదిలం చేసుకుంటున్నారు.ఆకర్షణగా అనంతగిరి హిల్స్.. హైదరాబాద్ సమీపంలో హిల్ స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్. పాల నురగలు కక్కుతూ జాలువారే వాటర్ ఫాల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఆ పక్కనే పదుల సంఖ్యలో అత్యాధునిక వసతులతో కూడిన రిసార్ట్స్. ఉదయం లేత సూర్యకిరణాలు తాకుతున్న వేళ ట్రెక్కింగ్, సాయంత్రం చల్లని వాతావరణంలో వెచ్చగా ఫైర్ క్యాంపు, ఆపై రెయిన్ డ్యాన్స్‌లు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అనంతగిరి హిల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిసార్ట్స్‌కు రోజుకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారాంతపు డెస్టినేషన్ హిల్ స్టేషన్‌గా అనంతగిరి వెలుగొందుతోంది.రెండు సీజన్లలో క్యాంప్ ఫైర్.. రానున్న శీతాకాలం ఎక్కువ మంది క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అడుగుతుంటారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, అడ్వెంచర్ గేమ్స్, రోప్ వే సంబంధిత కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్యాకేజీలు మారుతుంటాయి. వేసవిలో వాటర్ స్పోర్ట్స్, రెయిన్ డ్యాన్స్, వర్షాకాలం, శీతాకాలంలో క్యాంప్ ఫైర్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. – పీ.గంగాథర్ రావు, హరివిల్లు రిస్సార్ట్స్ నిర్వాహకులు, వికారాబాద్ఆ వాతావరణం ఇష్టం..చల్లనివాతావరణంలో వెచ్చగా మంట కాగుతూ, పాటలు పాడుకుంటూ డ్సాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కొడైకెనాల్, కూర్గ్, వయనాడ్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి రిసార్ట్స్ యజమానులే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసేవారు. బయటకు వెళ్లినప్పుడు ఒత్తిడిని మర్చిపోయి, హాయిగా గడపాలని అనుకుంటాం. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో రాత్రి వేళ చుక్కలను చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణంలో మనసుకు హాయిగా ఉంటుంది. – జి.సిద్ధార్థ, ఉప్పల్ -
వీకెండ్@ వికారాబాద్
మహానగరానికి దగ్గరగా.. కాలుష్యానికి దూరంగా.. పచ్చని రంగేసినట్లుండే కొండలు, వనాన్ని తలపించే వృక్షాలతో నిండిన అటవీ ప్రాంతం.. ఉదయం, సాయంత్రం పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, వందలాది పక్షిజాతులు.. కొండలు, గుట్టలు ఎక్కాలని కోరుకునే వారికి ట్రెక్కింగ్ ట్రాక్.. భక్తితో కొలిచే వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న అనంతపధ్మనాభ స్వామి దేవాలయం.. ఇవన్నీ అనంతగిరి అటవీ ప్రాతం సొంతం. మరో అడుగు ముందుకేస్తే సరదా బోటింగ్.. కోట్‌పల్లి జలాశయంలో కాయాకింగ్ సదుపాయం.. ప్రకృతి ప్రేమికులకైనా.. వారాంతంలో సేదతీరేందుకు టూర్ ప్లాన్ చేసుకునే వారికైనా వికారాబాద్ తొలిప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఒక్కరోజులో ఎంజాయ్ చేసిరావచ్చు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం నవాబుల కాలం నుంచి పర్యాటక ప్రాంతంగా, ఔషధ వనమూలికలు కలిగిన వృక్షాలకు నిలయంగా ప్రసిద్ధి. అనంతగిరి గుట్టపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక శాఖ హరిత రిస్సార్ట్ నిర్మించింది. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, ప్లే ప్లేస్, గార్డెన్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రాత్రికి ఫైర్ క్యాంప్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో ఇక్కడ స్టే చేయడం కోసం ముందస్తుగా గదులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.వారాంతంలో అప్పటికప్పుడు స్టేయింగ్ దొరకాలంటే కష్టం. అటవీ శాఖకు చెందిన గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంటుంది. సిబ్బందిని సంప్రదిస్తే ఉదయం ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. అడవిలో నలుదిక్కులు తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ సీజన్(వర్షాకాలం)లో అనంతగిరి కొండల్లో జలపాతాలు పర్యాటకులను కనువిందుచేస్తాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టపై వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అడవి మొత్తాన్ని చూడొచ్చు. ఈ ట్రిప్‌కి ఒక్కొరికీ రూ.3000 నుంచి రూ.5000 వరకూ ఖర్చు అవుతుంది.ఆధ్యాతి్మకంగానూ.. అనంతగిరిలో వెలసిన అనంతపధ్మనాభస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్త్ర ప్రజలు గట్టిగా నమ్ముతారు. సుమారు 5వేల సంవత్సరాల క్రితం మార్కండేయుడు ఇక్కడ తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజుల్లో వేల సంఖ్యలో ఉంటారు.ఎలా వెళ్లాలి..హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు 65 కిలోమీటర్లు. మొయినాబాద్, చేవెళ్ల మీదుగా హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిలో మన్నెగూడ దగ్గర వికారాబాద్ వైపు తిరగాలి. గచి్చ»ౌలి, కూకట్పల్లి, పటాన్చెరువు, తదితర ప్రాంతాల ప్రజలు శంకర్పల్లి మీదుగా రావచ్చు. సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి మీదుగా రైలు సదుపాయం ఉంది.బోటింగ్..అనంతగిరి కొండల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కోట్‌పల్లి జలాశయం ఉంటుంది. ఇక్కడ బోటింగ్(కాయాకింగ్) చేయవచ్చు. వారాంతాలు, సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బోటింగ్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒక్కరికి రూ.250, పెయిÆŠḥకి రూ.450 ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ బోటింగ్‌కు అనుమతిస్తారు. -
Tank Bund: చల్ మోహన రంగ
సిడ్నీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించే ట్యాంక్ బండ్..అద్భుత అందాలతో పాటు చారిత్రాత్మక వైభవాలకు ప్రతీకనగరానికి మణిహారం సాగర తీరం..చెప్పుకుంటూ పోతే మరెన్నో.. రింజిమ్..రింజిమ్..హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రమలు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్.. అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు.. ఈ వంకా జూబిలి హాలూ తళతళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ...ఇలా చెప్పుకుంటూ పోతే.. పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు.. ఎటుచూసినా ఏదో ఒక విశేషమైన ప్రాంతం చూపరులను అబ్బురపరుసూనే ఉంటాయి... వాటిల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచేది.. ట్యాంక్ బండ్.. నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ట్యాంక్ బండ్‌తో అవినాభావ సంబంధం ఉంటుంది. ట్యాంక్ బండ్ ప్రారంభంలోనే ‘నగర రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ జవాన్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనం’గా ఏర్పాటు చేసిన యుద్ధనౌక స్వాగతం పలుకగా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పార్క్ అందాలు, మహనీయుల విగ్రహాల పలకరింపుతో సాగర్‌లోని నీటి ఫౌంటేన్ల తుంపరల మధ్య శాంతిమయుడు గౌతమ బుద్ధుడిని తిలకిస్తూ అక్కడి అందాలను ఆస్వాదించడం భలే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల గురించి లుసుకుందాం... సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రకు తలమానికమైన చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాలే కాకుండా..దేశానికే తలమానికంగా నిరి్మతమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్లమెంట్‌ను పోలిన నిర్మాణం పైన భారీ ఎత్తులో నిరి్మతమైన ఈ విగ్రహం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తిలకించినా సగర్వంగా కనిపిస్తుంది. బుద్ధుడిని స్పూర్తిగా తీసుకుని దేశం గరి్వంచదగ్గ వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్., హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని వెనుకనే నిరి్మంచడంతో సింబాలిక్‌గా నిలుస్తుంది. నగర వైభవాన్ని ప్రతిబింబించే నిర్మాణాలైన చారి్మనార్, అసెంబ్లీ భవనాల సరసన నిలిచేలా నూతనంగా నిర్మితమైన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, కేబుల్ బ్రిడ్జి వంటివి చూపు తిప్పుకోనివ్వవు అంటే అతిశయోక్తి కాదేమో..! ఎన్.టి.ఆర్ గార్డెన్... అరుదైన బొన్సాయ్ మొక్కలు, ఆరి్టఫీషి యల్ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్ రోడ్ అందాలను చూపించే జేయింట్ వీల్, అండర్ గ్రౌండ్లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆశ్చర్యపరిచే ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్ చేసే త్రీడి షో.. వెరసి అందరినీ అలరించే ఎన్.టీ.ఆర్ గార్డెన్. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో ఎన్.టీ.రామారావు సమాధిని సందర్శింవచ్చు.ప్రసాద్ ఐమాక్స్.. సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్ ఇలా అన్ని రకాల నగర జీవన శైలికి అద్దం పట్టే వేదిక ఐమాక్స్. ఇందులో సినిమా చూస్తే అదో క్రేజ్‌లా మారేంతలా గుర్తింపు పొందింది. కొత్త సినిమాల విడుదలతో ప్రతీ శుక్రవారం ఇక్కడ సెలబ్రిటీలు, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలతో సందడిగా ఉంటుంది. జల్ విహార్... కేవలం నీళ్లలో ఆడే ఆటలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్. రేయిన్ డ్యాన్స్, వాటర్ఫూల్స్లో ఎత్తునుంచి జారవిడిచే ఆటలతో పాటు ఇతర వాటర్ గేమ్స్ ప్రేక్షకులను బయటకు రానివ్వవు.థ్రిల్ సిటీ... ఈ మధ్యనే ప్రారంభమైన థ్రిల్ సిటీ ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. రోమాలను నిక్కబొడుచుకునేలా చేసే థ్రిల్లింగ్ గేమ్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.పీవీ జ్ఞాన భూమి... ఇంతకు ముందు ఎరుగని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు సమాధి ఈ జ్ఞాన భూమిలో కొలువుదీరింది. దేశానికి పనిచేసిన ఏ ప్రధాన మంత్రి సమాధిని చూడాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ దక్షిణాది ప్రధానిగా చక్రంతిప్పిన పీవీ సమాధి మాత్రం నెక్లెస్ రోడ్లో చూడవచ్చు.సంజీవయ్య పార్క్... అనేక రంగులతో అలరించే రోస్ గార్డెన్, రంగురంగుల సీతాకోకచిలుకలను కలుసుకునే బటర్ఫ్లవర్ పార్క్, ఎత్తులో దేశంలో రెండో అతిపెద్ద జాతీయ జెండాలను ప్రత్యక్షంగా చూడాలంటే సంజీవయ్య పార్క్ వెళ్లాల్సిందే. ఎత్తులో రెండో స్థానం అయినప్పటికీ త్రివర్ణ పతాకం సైజులో మాత్రం దేశంలోనే అతిపెద్దది.ఈట్ స్ట్రీట్–ఆర్ట్ స్ట్రీట్.. ఆహార ప్రియులకు అనువైన చోటు నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్., సాగర్ నీటి అలల అంచున కూర్చోని వివిధ డిష్‌లను ఆస్వాదించవచ్చు. దీని ఎదురుగానే ఉన్న వీధుల్లోని ఇళ్లను మొత్తం విభిన్న చిత్రాలతో కళాకారులు తయారు చేశారు. డాగ్ పార్క్.. ప్రతీ ఆదివారం ఉదయం నగరంలోని అన్ని రకాల కుక్కలతో వారి యజమానులు ఈ డాగ్ పార్క్‌కు వస్తారు. జంతు ప్రేమికులను ఇది విశేషంగా అలరిస్తుంది. సైక్లింగ్ క్లబ్.. థ్రిల్ సిటీకి ఎదురుగా ఉన్న సైక్లింగ్ క్లబ్ ఫిట్‌నెస్‌కు మంచి మార్గం. ఇందులో మొంబర్íÙప్ తీసుకుని ఎవరైనా సైక్లింగ్ చేయవచ్చు.అమరవీరుల స్మారక కేంద్రం... తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత శ్రద్ధాంజలిగా దీపం రూపంలో నిరి్మంచిన స్మారక కేంద్రం కొత్త శోభను తీసుకొచి్చంది. ఇందులో ప్రత్యేకంగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం అదనపు ఆకర్షణ.టూరిస్టు సర్కిల్‌గా ట్యాంక్బండ్ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గుర్తుచేసేలా సాగర్ మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం నగరానికే తలమానికం. చూట్టూ ఆవరించి ఉన్న నీటి మధ్యలో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి. ఇక్కడి బోటింగ్ సదుపాయాలు అదనపు ఆనందం.బిర్లా ప్లానిటోరియం.. విజా్ఞనం, వినూత్నం, వివేకానికి బిర్లా ప్లానిటోరియం మంచి వేదిక. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకూ అవసరమైన శాస్త్ర–సాంకేతిక, పురాతత్వ విషయాలను తెలుసుకొవచ్చు. ఇక్కడే అంతరిక్షానికి చెందిన ప్రత్యేక స్కై షో కూడా చూడవచ్చు. లుంబినీ పార్క్, బోటింగ్.. ఆటవిడుపుకు, కాలక్షేపానికి అడ్డాగా మాత్రమే కాకుండా హుస్సేన్‌సాగర్ అందాలను తనివితీరా చూపించే బోటింగ్ సదుపాయం లుంబినీ పార్క్ సొంతం. సాధారణ బోటింగ్, సినిమాల్లో చూపించే వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లతో పాటు వ్యక్తిగత పారీ్టలు సైతం నిర్వహించుకునేలా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. -
ఢిల్లీలో తప్పక చూడాల్సిన ఐదు పర్యాటక ప్రాంతాలివే!
దేశ రాజధాని ఢిల్లీ చరిత్ర వందేళ్ల నాటిది. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని తిలకించేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ఢిల్లీలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్షరధామ్ ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని స్వామినారాయణ దేవాలయం అని కూడా అంటారు. స్వామి నారాయణ్ శాఖకు చెందిన ఈ ఆలయం హిందూ ధర్మం, దాని ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. 2005, నవంబర్ 6న ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్ 8 నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించారు. ఈ ఆలయ ప్రాంగణంలో బోట్ రైడ్, లైట్ షో, థియేటర్ ఉన్నాయి. ఆలయంలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇండియా గేట్ కర్తవ్యపథ్‌లోని ఇండియా గేట్ భారతదేశంలోని ప్రధాన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకుల రద్దీ ఉంటుంది. ఇండియా గేట్ 1931-1933 మధ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇండియా గేట్ ఎత్తు సుమారు 42 మీటర్లు. వారాంతాల్లో పర్యాటకులతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కుతుబ్ మినార్ ఢిల్లీలోని అందమైన ప్రదేశాలలో కుతుబ్ మినార్ కూడా ఒకటి. 73 మీటర్ల ఎత్తయిన ఈ టవర్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా చేరింది. దీనిని చూసేందుకు దేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు. ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల రాజధాని ఢిల్లీ. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638- 1648 మధ్య కాలంలో నిర్మించారు. ఇక్కడి మ్యూజియంలో సాంప్రదాయ హస్తకళలకు సంబంధించిన అనేక విశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి ఎరుపు రంగు గోడల కారణంగా సాయంత్రం వేళల్లో ఎర్రకోట మరింత కనువిందు చేస్తుంది. లోటస్ టెంపుల్ లోటస్ టెంపుల్ కలువ పూవు ఆకృతిని కలిగివుంటుంది. ఆలయం పాలరాయితో నిర్మితమయ్యింది. 1986లో దీనిని నిర్మించారు. లోటస్ టెంపుల్‌ను ‘బహాయి దేవాలయం’ అని కూడా అంటారు. దీనిని ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల ఒపెరా హౌస్‌తో పోలుస్తుంటారు. ఇక్కడ చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఏ దేవుని విగ్రహం కూడా ఉండదు. ఇక్కడి వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. -
రక్షణ విస్మరించి.. అడ్డగించి.. ‘కోట్‌పల్లి’కి పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్న అధికారులు
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరచి.. అక్కడికి ఎవ్వరూ రాకుండా నిషేధం విధించడం విమర్శలకు తావిస్తోంది. జనవరి 16న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు ఈత కోసం ప్రాజెక్టుకు వచ్చి నీట మునిగి చనిపోయారు. దీన్ని సాకుగా చూపి పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించి ఇలా నిషేధం విధించడం ఏమిటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో కోట్‌పల్లికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ నీటిలో సరదాగా ఆడుకొని సేద తీరుతారు. యువతీ యువకులు గంటల తరబడి నీటిలో సరదాగా ఈత కొడతారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే తలమానికమైన ఈ ప్రాజెక్టును పర్యాటక రంగానికి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్ద కాయ కింగ్ బోటింగ్ సైతం నిషేధించారు. 6 నెలల గడిచినా బోటింగ్ సంస్థకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పర్యాటకులు, బోటింగ్‌కు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం
భూమికి దిగువన అద్భుతాలు ఉంటాయని, వాటిని చూస్తే ఎంతో ఆశ్యర్యం కలుగుతుందనే విషయం మీకు తెలుసా? పైగా అక్కడ నివాసయోగ్యానికి అనువైన సకల సౌకర్యాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అరుదైన ప్రత్యేకతల కారణంగా ఒక హోటల్ చర్చల్లో నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటంటే ఈ హోటల్ భూమికి 1,375 అడుగులు(419 మీటర్లు) లోతున ఉంది. దీనిలో బస చేసేందుకు విలాసవంతమైన గదులు, పసందైన ఆహార పానీయాలు అందుబాటులో ఉన్నాయి. కపుల్స్ కోసం ప్రత్యేకమైన గదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ హోటల్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ అండర్‌గ్రౌండ్ హోటల్ బ్రిటన్‌లో ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇది ప్రపంచంలోనే.. భూమికి అత్యంత లోతున ఉన్న హోటల్‌గా పేరొందింది. ఇది నార్త్వేల్స్లోని స్నోడోనియా పర్వతాలపై భూమికి 419 మీటర్ల దిగువన ఉంది. దీనిలో 4 పర్సనల్ ట్విన్-బెడ్ క్యాబిన్‌తో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అయితే ఈ హోటల్లోని గదులను శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. హోటల్‌కు చేరుకునేందుకు ట్రెక్కింగ్ ఈ హోటల్‌కు వెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సివుంటుంది. కొన్ని గంటల పాటు ట్రెక్కింగ్ చేసిన తరువాతనే ఈ హోటల్‌కు చేరుకోగలుగుతారు. ఈ మార్గంలో జలపాతాలు, అందమైన కొండలు, ఎగుడుదిగుడు రహదారులు, సొరంగమార్గాలు మొదలైనవి ఉంటాయి. ఈ హోటల్‌కు వెళ్లేవారికి ఒక గైడ్ తోడుగా ఉంటాడు. ఆయన హోటల్లో స్టే చేసేవారిని అందమైన మార్గం గుండా తీసుకువెళతారు. ఈ ప్రయాణం సాగించేవారికి హార్నర్స్ రోప్, హెల్మెట్, బూట్లు, లైటు మొదలైనవి అవసరం అవుతాయి. ఎంట్రీ గేటు వద్ద.. ఈ హాటల్‌కు వెళ్లే మార్గంలో పలు కళాఖండాలు కనిపిస్తాయి. ముందుకు సాగుతున్నప్పుడు వీటి గురించి గైడ్ వివరిస్తాడు. చివరగా హోటల్ ఎంట్రీలో ఒక పెద్ద ఇనుప తలుపు కనిపిస్తుంది. లోనికి ప్రవేశించగానే వెల్కమ్ డ్రింక్, స్నాక్స్‌తో స్వాగత సత్కారం లభిస్తుంది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉంటుంది. హోటల్ బుకింగ్ ధర ఎంతంటే.. గో బిలో అనే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్ క్యాబిన్ బుకింగ్ ధర రూ. 36,000. గుహ రూము బుకింగ్‌కు రూ. 57,000 వెచ్చించాల్సి ఉంటుంది. దీనిలో టీ, టిఫిన్ ఖర్చులు కలిసి ఉంటాయి. డైలీ స్టార్ స్యూస్ వెబ్‌సైట్‌తో ఈ హోటల్ మేనేజర్ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చే అతిథులు ఇక్కడి ఏర్పాట్లను ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడ బస చేసేవారికి మంచి నిద్ర పడుతుంది. ఇక్కడికి వచ్చేవారు అన్నిరకాల ఆందోళనలను విడిచి పెట్టి, ప్రశాంతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. అందుకే ఈ హోటల్‌కు ‘డీప్ స్లీప్’ అనే పేరుపెట్టామన్నారు. ఈ హోటల్లో చిన్నచిన్న క్యాబిన్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని రాళ్ల మధ్యలో రూపొందించారు. ఇక గదుల విషయానికి వస్తే అవి గుహలను పోలివుంటాయి. వీటిలో పెద్దసైజు బెడ్లను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ.. -
టాప్ 10 దక్షిణ భారత పర్యాటక ప్రదేశాలు
-
‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్!
తాజ్‌మహల్ అంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. ఆ అద్భుత నిర్మాణాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌ను సందర్శించేవారి నుంచి ప్రభుత్వానికి ప్రతీయేటా ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విదేశీయులు ఎవరైనా భారతదేశానికి వస్తే ముందుగా వారు చూడాలనుకునేది తాజ్‌మహల్. ఇక మనదేశంలోని ప్రతీఒక్కరూ తాజ్‌మహల్ చూడాలని తప్పనిసరిగా అనుకుంటారు. తాజ్‌మహల్‌కు ఇంత క్రేజ్ ఏర్పడటానికి కారణం దాని నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిందనే సంగతి అందరికీ తెలిసిందే. తాజ్‌మహల్ అనునిత్యం పర్యాటకులతో కిటకిటలాడిపోతుంటుంది. మరి అటువంటప్పుడు తాజ్ మహల్ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది. అలాగే ప్రతీయేటా తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి ఎన్ని టిక్కెట్లు అమ్ముడవుతాయనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందువరుసలో... దేశంలోని అత్యంత పురాతన అందమైన కట్టడాలలో తాజ్‌మహల్ ముందువరుసలో ఉంటుంది. తాజ్‌మహల్‌కు ఎంతటి ఆదరణ ఉన్నదంటే.. కరోనా కాలంలో అన్నీ స్థంభించిపోయినప్పుడు కూడా.. ఆ రెండు సంవత్సరాల్లో తాజ్‌మహల్ సందర్శించేందుకు పర్యాటకులు వచ్చారు. అటువంటి విపత్కర సమయంలోనూ తాజ్ మహల్ సందర్శన టిక్కెట్లు విక్రయమయ్యాయి. ఇది కూడా చదవండి: గిన్నిస్ పెళ్లిళ్లు సందర్శకుల సంఖ్య ఎంతంటే.. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం తాజ్‌మహల్ సందర్శనకు ప్రతీయేటా సుమారు 80 లక్షలమంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో 80 వేలమంది విదేశీయులు ఉంటారు. తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి స్థానికులకు (భారత్) రూ. 50, విదేశీయులకు రూ.1100 టిక్కెట్ రూపంలో వసూలు చేస్తారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో అంటే మూడేళ్ల వ్యవధిలో రూ.152 కోట్ల ఆదాయం తాజ్‌మహల్ నుంచి ప్రభుత్వానికి సమకూరింది. ఇది చారిత్రాత్మక కట్టడాల నుంచి వచ్చిన ఆదాయంలో 40 శాతం. దేశంలోని పర్యాటకుల కారణంగా తాజ్‌మహల్‌కు టిక్కెట్ల రూపంలో ప్రతీయేటా రూ. 40 కోట్లు, విదేశీయులకు విక్రయించే టిక్కెట్ల కారణంగా రూ.110 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. తరువాతి స్థానంలో ఆగ్రాకోట పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయపరంగా చూస్తే తాజ్‌మహల్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. 2021-2022లో తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్ల విక్రయాల కారణంగా సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూరింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట నుంచి కూడా అత్యధిక ఆదాయం వస్తుంటుంది. దేశంలోని మొత్తం పర్యాటక ప్రాంతాల నుంచి ప్రతీయేటా వచ్చే ఆదాయంలో.. తాజ్‌మహల్, ఆగ్రాకోటల సందర్శకుల నుంచి వచ్చే ఆదాయం 53 శాతం మేరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా.. -
పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు: సీఎం వైఎస్ జగన్
-
అడవికి వెళ్లిన యువజంట.. యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: పర్యాటక ప్రాంతం చూసేందుకు ఓ జంట బైక్‌పై వెళ్లింది. దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించి ఫోన్ లాక్కోవడమే కాకుండా యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి తీవ్ర రక్తస్రావం అవడంతో తిరిగి ఇంటి వద్ద దిగబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి యువతి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీ సులు శనివారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని పర్యాటక స్థలమైన బ్లాక్‌బెర్రీ ఐలాండ్ అటవీ ప్రాంతానికి గతనెల 30న ఓ జంట బైక్‌పై వచ్చారు. వీరిని గమనించిన బొట్టాయిగూడెంకు చెందిన కోల సాత్విక్ అలియాస్ సైదులు, జనగామ ఆనందరావు అటకాయించి యువకుడిని కొట్టి సెల్‌ఫోన్ లాక్కున్నారు. ద్విచక్రవాహనం టైర్లలో గాలి కూడా తీసేశారు. యువతిని బలవంతంగా బైక్‌పై మణుగురు తీసుకెళ్లారు. అక్కడ నిందితుడు సాత్విక్ యువతిని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనికి ఆనందరావు సహకరించాడు. అయితే, యువతికి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆనందరావు బైక్‌పై ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లి వదిలేశాడు. అత్యాచారం వీడియో తీశామని, విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించడంతో ఆమె భయప డింది. చివరకు ఆమె స్నేహితుడు ఫిర్యాదు చేయ డంతో సీఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంక టేశ్వరరావు రంగంలోకి దిగి, నిందితులని కాటా పూర్ క్రాస్ వద్ద శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
మనకూ బృందావన్ గార్డెన్స్
కాళేశ్వరం ప్రాజెక్టు కింద వివిధ బ్యారేజీలు, జలాశయాలు, పంప్‌హౌస్‌ల చుట్టూ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తాం. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు, మైసూర్ కృష్ణరాజ సాగర్ ( బృందావన్ గార్డెన్) మాదిరిగానే ఒడ్డున ఎక్కువ చెట్లు నాటడం, ఉద్యానవనాలు, సంగీత ఫౌంటెయిన్లు, జలపాతాలు వంటి ఆకర్షణలతో కాళేశ్వరం ప్రాజెక్టును దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మార్చుతాం. అందుకు ప్రణాళిక సిద్ధమైంది. – ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సాక్షి, వరంగల్ : తెలంగాణకు తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. దేశంలో చరిత్రాత్మక ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ ప్రాంతాన్ని దేశ, విదేశ పర్యాటకులను ఆకట్టుకునేలా మార్చడానికి శ్రీకారం చుడుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీలు, పంపుహౌస్‌ల సమీపంలో పర్యాటకులను కనువిందు చేసే కళాకృతుల ఏర్పాటుకు నడుం బిగించారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సిద్ధం చేసే బాధ్యతలను స్వీకరించిన ‘సార్ ఇంటర్నేషనల్’కన్సల్టెన్సీ.. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. 680.44 ఎకరాలు.. రూ.600 కోట్లు.. సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్, సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి 680.44 ఎకరాల్లో చేపట్టే పనులను 9 ప్యాకేజీలుగా విభజించారు. వీటికి మాస్టర్ ప్లాన్, డీపీఆర్, ప్రాజెక్ట్ ప్రాంత రూపకల్పన బాధ్యతలను సార్ ఇంటర్నేషనల్‌కు అప్పగించారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని నిర్ధారించారు. ల్యాండ్‌స్కేప్డ్ ఏరియాలోని 145 ఎకరాల్లో 15 ప్రత్యేక థీమ్ పార్కులు, ఉద్యానవనాలు ఏర్పాటు చేయనున్నారు. 200 ఎకరాల్లో మూడు సరళి తోటలు, 61 ఎకరాల్లో ఎనిమిది స్మృతివనాలు, 10 ఎకరాల్లో 9 ఆట స్థలాలు, 25.48 ఎకరాల్లో రెండు స్మారక చిహ్నాలు నెలకొల్పుతారు. అలాగే 156.16 ఎకరాలను సుందరీకరణ ప్రాంతాలుగా తీర్చిదిద్దుతారు. వీటితో పాటు బిల్ట్ కాంపోనెంట్స్ కింద 82.80 ఎకరాల్లో ఎథినిక్ రిసార్ట్, ట్రోపికల్ రిసార్ట్, ఓర్జన్స్ రిసార్ట్లు, రెస్టారెంట్లు నిర్మించేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌లతో పాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ, తుపాకులగూడెం(సమ్మక్కసాగర్), దుమ్ముగుడెం ప్రాజెక్టులకు పర్యాటక కళ రానుంది. మరోవైపు ఈ ప్రాజెక్టుల పరిసరాల్లోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గూడెం గుట్ట, కోటిలింగాల, పర్ణశాల, భద్రాచలం వంటి ప్రసిద్ధ ఆలయాలకు వచ్చే భక్తులు ఈ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారం అంతా నిజమేనని, అంతా ప్రభుత్వ స్థాయిలో నడుస్తోందని, అధికారికంగా చెప్పలేమని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. -
ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట
సాక్షి, గుంటూరు : రెడ్డిరాజుల పౌరుషం, వైభవానికి ప్రతీకగా ఉన్న 'కొండవీడు కోట'ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత హామీనిచ్చారు. స్థిరమైన వారసత్వ సంపదను సంరక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక రామన్నపేట లోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో 'కొండవీడు అభివృద్ధి' సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొండవీడు హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సుకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత ప్రముఖ నేపథ్యగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి నిముషం పాటు మౌనంతో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి సమర్పణలో ప్రముఖ తెలుగు అధ్యాపకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వం చేసిన ' కొండవీడు చరిత్ర వ్యాసాలు' సంకలన గ్రంథాన్ని హోం మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ శత్రు సైన్యాన్ని బంధించడానికి బలంగా పెనవేసిన తాడు వంటిది కొండవీటి దుర్గం అని గుర్తుచేశారు. బాల్యంలో తాను స్థానికంగా కొండవీడు కోట కొండలను చూస్తూ పెరిగానని, అప్పట్లో కోట చేరే మార్గం సరిగా ఉండేది కాదని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కొండవీడు అభివృద్ధికి భారీ ప్రణాళికతో విశాల మనసును చాటారని చెప్పారు. కోవిడ్ పరిస్థితులు మారాక కోట అభివృద్ధి కార్యక్రమాలు శరవేగం అవుతాయన్నారు. ఫిరంగిపురం నుంచి కొండవీడు రోడ్డుమార్గం ఇరుకుగా ఉందని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ శివారెడ్డి తన దృష్టికి తెచ్చారని చెప్పారు. గుంటూరు నుంచి కొండవీడుకు చేరుకునే పర్యాటకులకు ప్రత్యామ్నాయ మార్గంగా అమీనాబాద్ నుంచి కొండవీడుకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు చేయాలని సుచరిత ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారసత్వ చారిత్రక సంపదగా ఉన్న కొండవీడు సంస్కృతి, సాహితీవైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యమన్నారు. చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల రజని మాట్లాడుతూ.. కోట అవశేషాలు, చరిత్ర నమూనాలతో ప్రపంచ స్థాయిలో పర్యాటకులకు విలువైన విజ్ఞానమందించే ప్రాంతంగా కొండవీడును అభివృద్ధిలోకి తెస్తామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో కొండవీడు అభివృద్ధిపై నిరంతర సమీక్షలకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎ. శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కొండపల్లి ఖిల్లా, కొండవీడు కోట రెండూ రెడ్డిరాజుల పాలనలో నిర్మించినవేనన్నారు. పరాక్రమమంటే ఇష్టపడే మహావీరులకు సరైన నివాస స్థానం కొండవీడు అన్నారు. ఓటమిని అంగీకరించిన వారికి సామ్రాజ్యాన్ని తిరిగి అప్పగించే సంప్రదాయం కొండవీటి రెడ్డి రాజుల సొంతమని, ఉత్తమ జాతి అశ్వాలకు, వీరులకు, సంపదలకు, మదపుటేనుగులకు పెట్టింది పేరని, రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ.1325 నుంచి క్రీ.శ. 1425 మధ్య రెడ్డి రాజుల పాలన సాగిందన్నారు.శత్రు దుర్భేద్యంగా నిర్మిచిన ఇక్కడి గిరి దుర్గం చారిత్రక సంపదగా వెలురొందిన కొండవీడు ఇక్కడ ఉండటం గుంటూరు జిల్లాకు గర్వకారణమన్నారు. రెడ్డి రాజులు తెలుగును అధికార భాషగా చేసి.. శాసననాలను తెలుగులో రాయించారని, వారి ఆస్థానంలో యర్రాప్రగడ కవిగా.. శ్రీనాథుడు విద్యాధికారిగా పని చేసినట్లు చరిత్ర చెబుతున్నట్లు కలెక్టర్ గుర్తుచేశారు. కోట ముఖద్వారం వద్ద ఆర్చి నిర్మాణం చేసి పర్యాటకుల నుంచి ప్రవేశరుసుం వసూలుపై పరిశీలిస్తామన్నారు. తెలుగు అధ్యాపకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి శివారెడ్డి కొండవీడు చరిత్ర ప్రాశస్థ్యం వివరించారు. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కొండవీడులో ఇక్కడ యోగి వేమన మండపం ఉండేదని చరిత్ర చెబుతుందని.. 15వ శతాబ్దానికి చెందిన కొండవీటి రాయసం పేరయ్య ‘నవనాథ సిద్ధసారం’ అనే ఆయుర్వేద గ్రంథాన్ని ఇక్కడే రచించి ప్రసిద్ధుడయ్యారని గుర్తుచేశారు. కొండవీడుకు ఉన్న విశిష్టత మరే ప్రదేశానికి లేదని, ఇది కాలుష్య రహిత ప్రదేశమన్నారు. దీనిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదాలని కోరారు. జిల్లా ఫారెస్టు రేంజి అధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ కోట పర్యాటక అవశేషాలను రక్షించడంలో తమవంతు బాధ్యతను సమర్ధంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ స్వరాజ్య పోరాటయోధుడు సైరా చిన్నప్పరెడ్డి ముది మనుమడు సుబ్బారెడ్డి తన ముత్తాత చరిత్ర పుస్తకాన్ని హోంమంత్రి, కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. -
తాజ్‌మహల్ పర్యాటక స్థలం కాదు
న్యూఢిల్లీ / లక్నో: ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి విడుదల చేసిన బుక్‌లెట్‌లో గంగా నదికి హారతి ఇవ్వడాన్ని ముఖచిత్రంగా ఇచ్చారు. ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మంది పర్యాటకులు, ఎక్కువగా విదేశీయులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. తాజ్‌మహల్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించగా.. ప్రధాని మోదీ ‘క్లీన్ ఇండియా మిషన్’కు ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో తాజ్‌మహల్ చోటు దక్కించుకుంది. రామాయణం, భగవద్గీతలు మాత్రమే భారతీయ సంస్కృతికి చిహ్నాలనీ, తాజ్‌మహల్ ఎంతమాత్రం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అది వాస్తవం కాదు: యూపీ పర్యాటక బుక్లెట్ నుంచి తాజ్‌మహల్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. యూపీలో రూ.370 కోట్లతో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టుల్లో ఒక్క తాజ్‌మహల్ కోసమే రూ.156 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఖైదీలకూ ఆ హక్కు ఉంది: సుప్రీం న్యూఢిల్లీ: నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న దోషులకు కూడా జైలు గోడలు దాటి బయటికి వెళ్లే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక సంబంధాలు కొనసాగించేందుకు వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. సుదీర్ఘ కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారు.. పెరోల్/ఫర్లాఫ్ కోరితే మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
ఉమ్మడి మండలం పర్యాటక ప్రాంతమయ్యేనా..?
చందంపేట (నేరడుగొమ్ము) : చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో ఓ వైపు చుట్టూ దట్టమైన అడవులు.. మరోవైపు నాగార్జునసాగర్ కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా చుట్టూ నీరు, రకరకాల పక్షుల కిలకిలరావాలతో ఎటు చూసినా మనసును పులకరింపచేసే అందాలే. ఇవేకాక భక్తి పారవశ్యానికి నిదర్శంగా నిలిచే అతి పురాతనమైన దేవాలయాలు.. 13వ శతాబ్ధంలో రాజులు, మునులు తపస్సు చేసిన ఆనవాళ్లు, గిరిజన సంస్కృతీ స్పష్టంగా కన్పిస్తుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే అరకు తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని నేరడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామపంచాయతీ వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా చేస్తే దేవరకొండ ప్రాంతంలోని చందంపేట, నేరడుగొమ్ము మండలాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనే ఉద్దేశంతో జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. ఇక్కడ పర్యటించిన మంత్రులూ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా పుష్కరాల సమయంలో రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ ప్రాంతంలో పర్యటించి వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో రాష్ట్ర అటవీశాఖా మంత్రి జోగు రామన్న, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలు కూడా చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో పర్యటించి వారు కూడా ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారని సమాచారం. పర్యాటక ప్రాంతమైతే.. చందంపేట, నేరడుగొమ్ము ఉమ్మడి మండలాల్లో 26,785 హెక్టార్లలో నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. నాగార్జునసాగర్ - కృష్ణా నది పరివాహక బ్యాక్ వాటర్ చందంపేట, నేరడుగొమ్ము మండలాలకు ఆనుకుని ఉంది. పురాతన దేవాలయాలు, అరకు అందాలు, చక్కటి రమణీయమైన దృశ్యాలు వీటన్నింటికి మించి ఇక్కడ కాచరాజుపల్లి గ్రామంలో బొర్రా గుహలను తలపించే నీలివర్ణం, ఆకుపచ్చని వర్ణంలో అతిపెద్ద గుహలూ ఉన్నాయి . దేవరచర్ల మునిస్వామి ఆలయం ప్రతి నిత్యం శివలింగంపై కొండచరియల నుంచి సంవత్సరం పొడుగునా నీళ్లు జాలువారుతుంటాయి . అంతే కాకుండా వైజాగ్ కాలనీ నుంచి బోటింగ్‌ను ఏర్పాటు చేసి నాగార్జున కొండ, ఏలేశ్వరం మల్లయ్యగట్టుకు లాంచీలను ఏర్పాటు చేస్తే ఇటు గిరిజన గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని ఇక్కడి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూపురేఖలు మారిపోతాయి వైజాగ్ కాలనీ పర్యాటక ప్రాంతమయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి . గతంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్, అటవీశాఖా మంత్రి జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లా. సీఎం సానుకూలంగా స్పందించారు. అటవీశాఖ నుంచి పర్యావరణ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేరుుంచి వీలైనంత త్వరలో ఉమ్మడి చందంపేట మండలం పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి చేస్తా. - నేనావత్ బాలునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ -
పర్యాటక ప్రాంతంగా సుంకేసుల
► కేసీ కాలువకు నీరు విడుదల చేసిన డిప్యూటీ సీఎం ► సుంకేసుల జలాశయం జలకళ సంతరించుకుంది. నంద్యాల ప్రాంత తాగునీటి అవసరాలు తీర్చేందుకు గురువారం కేసీ ► కెనాల్ రెండు గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీరు విడుదలయింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు జిల్లా ►కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బ్యారేజీ వద్ద పూజలు నిర్వహించి నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు సిటీ/గూడూరు రూరల్: సుంకేసుల బ్యారేజీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌తో కలిసి సుంకేసుల బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కర్నూలు-కడప కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజన్ మొదట్లోనే బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడం సంతోషకరమన్నారు. బ్యారేజీ పూర్తి స్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ఇప్పటికే సుమారు ఒక టీఎంసీ నీరు వచ్చిందన్నారు. ఇన్‌ఫ్లో దృష్ట్యా నంద్యాల ప్రాంత తాగునీటి అవసరాలకు కేసీ కెనాల్ ద్వారా నీరు విడుదల చేశామన్నారు. అనంతరం సుంకేసుల బ్యారేజీ కరకట్ట స్థితిగతులపై చీఫ్ ఇంజనీర్ చిట్టిబాబు, పర్యవేక్షక ఇంజనీర్ చంద్రశేఖర్ రావులు డిప్యూటీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, గొర్రెల సహకార సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డీఈఈ జవహర్ రెడ్డి, ఏఈఈ అశ్విని కూమారి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, కోడుమూరు సీఐ డేగల ప్రభాకర్, గూడురు ఎస్ఐ చంద్రబాబు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతంగా గొట్టాబ్యారేజీ అభివృద్ధి
ఎల్.ఎన్.పేట(హిరమండలం) : వంశధార నదిపై హిరమండలం వద్ద ఉన్న గొట్టాబ్యారేజీ పరిసర ప్రాంతాన్ని టూరిజం పార్క్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. గొట్టాబ్యారేజీను ఆయన మంగళవారం పరిశీలించారు. బ్యారేజీకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని గేట్లు ఉన్నాయి, కాలువులకు నీరు ఎంత విడిచిపెట్టే అవకాశం ఉంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అనే విషయాలను వంశధార ఎస్ఈ బి.రాంబాబును అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీకి సమీపంలో ఉన్న గులుమూరు, మహాలక్ష్మీపురం, (ఎం.ఎల్.పురం), భరీరథపురం ప్రాంతాలను కలుపుతూ టూరిజంగా అభివృద్ధి పర్చేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వంశధార నదిలో నివగాం బ్రిడ్జి వద్ద ఎక్కువగా ఉన్న ఇసుక మేటల తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. వంశధార రిజర్వాయర్ నిర్వాసితులు గొంతెమ్మ కొర్కెలు కోరడం తగదని, న్యాయమైన కోర్కెలన్నీ తీరుస్తామని చెప్పారు. నీరు-చెట్టు పథకం కింద నదిలో తీసిన ట్రాక్టర్ మట్టిని రూ.200 చొప్పున అధికారులు విక్రయించేశారని కొండరాగోలు మాజీ సర్పంచ్ మూకళ్ల చిన్నయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నీరు-చెట్టు ఈఈ గోపాలరావు, తహశీల్దారు జె.రామారావు, వంశధార ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నవ్యనగరికి నవోదయం
- సన్‌రైజ్ క్యాపిటల్ బ్లూ ప్రింట్ సిద్ధం - జలమార్గాలు, స్కైవాక్‌లు - ఇళ్ల వద్దే ఉద్యోగాల కల్పన - ఎంఆర్టీఎస్, మెట్రోతో ప్రజారవాణా - సింగపూర్ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదనలు - 50 ఏళ్లకు పూర్తయ్యే అవకాశం సాక్షి, విజయవాడ బ్యూరో : అద్భుత పర్యాటక ప్రాంతంగా, ఆర్థికాభివృద్ధి కేంద్రంగా నూతన రాజధాని అమరావతిని నిర్మించేందుకు సింగపూర్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అత్యాధునిక నగరాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని హంగులను ప్రణాళికలో పొందుపరిచింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 219 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం ఎలా ఉండాలి, అందులో ఏమేమి ఉండాలనే మాస్టర్ ప్లాన్‌ను సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వం అందించింది. రాజధాని నగరం ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ప్రాంతీయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలను సన్‌రైజ్ క్యాపిటల్ ప్లాన్‌లో ప్రతిపాదించారు. అందులో భాగంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను నెలకొల్పుతారు. ఇందులోనే పారిశ్రామిక పార్కులు కూడా ఉంటాయి. నగరం మధ్యలోని ప్రాంతాన్ని కమర్షియల్ జోన్లుగా విభజించి వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాజధాని నగరంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు హోమ్ జాబ్స్ విధానాన్ని సింగపూర్ ఏజెన్సీలు సూచించాయి. ప్రజలు ఇళ్ల వద్దే పనిచేస్తూ సంపాదించుకునేందుకు గృహావసర వ్యాపారాలను ప్రోత్సహిస్తారు. - రాజధాని నగరానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అనుగుణంగా రైలు, రోడ్డు మార్గాల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తారు. బీఆర్టీఎస్ తర్వాత మోడల్ అయిన ఎంఆర్టీఎస్ (మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)ను ప్రవేశపెట్టనున్నారు. అంటే రైలు మార్గాల మాదిరిగానే బస్సులకే ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేసి తిప్పుతారు. - మెట్రోరైలు రాజధాని నగరంలో కీలకం. వీటిద్వారా నగరంలో వ్యక్తిగతంగా ఎవరూ కార్లు, స్కూటర్లు, బైక్‌లను వినియోగించకుండా అందరూ ప్రజారవాణా వ్యవస్థనే వినియోగించే విధానాన్ని ప్రోత్సహిస్తారు. తద్వారా నగరంలో కాలుష్యం లేకుండా చూడాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. - మోటారు వాహనాలకు ప్రత్యామ్నాయంగా నగరంలో జలమార్గాలను అభివృద్ధి చేస్తారు. కాలువలు, రిజర్వాయర్లలో బోట్ల ద్వారా ప్రయాణించే ఏర్పాట్లు చేస్తారు. సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. - పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, లైబ్రరీ, యూనివర్సిటీ వంటి వాటిని నివాస ప్రాంతాలకు దగ్గరే ఏర్పాటుచేస్తారు. దీనివల్ల స్థానికులు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నగరాన్ని పర్యాటక అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్లాన్‌లో ప్రతిపాదించారు. నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను నిర్మించి స్థానికులు, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తారు. అందమైన పార్కులు, గార్డెన్లు, రిక్రియేషన్ క్లబ్బులు ఏర్పాటుచేస్తారు. అమరావతి నగరం కృష్ణానది ఒడ్డు నుంచి చూస్తే అద్భుత దృశ్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణమైన అన్ని హంగులూ ఏర్పాటు చేయాలని ప్లాన్‌లో ప్రతిపాదించారు. నగరంలోనే పలు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుచేస్తారు. నగరాన్ని ఆకాశం నుంచి చూసేందుకు స్కైవాక్‌లు కూడా ఉంటాయి. - నగర సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదువేల ఎకరాలను రిజర్వు చేసుకోవాలని ప్లాన్‌లో సూచించారు. - నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ వేలు ఏర్పాటు చేస్తారు. - చెత్త నిర్వహణకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలను నెలకొల్పుతారు. - కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని తప్పించి దాన్ని పర్యాటకానికి ఉపయోగిస్తారు. - రాజధాని నగరం నుంచి మచిలీపట్నం పోర్టుకు కారిడార్‌ను నిర్మిస్తారు. ఇవన్నీ 50 ఏళ్లలో రాజధానిలో ఏర్పాటు చేసుకోవాలని సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు సూచించాయి. -
నల్లమల అందాల అల
నల్లమల.. ఆ పేరు వింటేనే అభయారణ్యంతో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతమే నేడు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోబోతుంది. పోటీ ప్రపంచంతో కుస్తీపట్టి విసిగిపోయి.. అలసిపోయిన పట్టణజనం సెలవుదినాల్లో ఈ ప్రాంతంలో గడపడానికి అత్యంత మక్కువ చూపుతున్నారు. ఇక్కడ జలజల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రాగాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు.. నాటి శిల్పకళను తెలియజేసే ఎంతో సుందరమైన కట్టడాలు ఆధ్యాత్మికను నింపుతాయి. కనుచూపుమేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్లుగా కనిపించే అరుదైన వృక్షాలు ఆహ్లాదపరుస్తాయి. అడవిని చీల్చుతూ ముందుకుసాగే రోడ్డు వెంట ఎన్నో మరెన్నో అందాలు చూడొచ్చు. మన్ననూర్: నల్లమల ముఖద్వారమైన మన్ననూర్ నుంచి ప్రారంభమయ్యే అభయారణ్యంలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అటవీశాఖ చెక్‌పోస్టు వద్దే వనమాలిక ఉంది. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి హంగులతో, పచ్చని చెట్ల నడుమ విడిది కేంద్రాలు ఉన్నాయి. ఎన్నో వన్యప్రాణులు తలదాచుకుంటూ తమ సంతతిని వృద్ధిచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అటవీశాఖ నల్లమలను పర్యాటక ప్రాంతంగా, ప్రశా ంత వాతావరణానికి కేంద్రంగా తీర్చిదిద్దాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శ్రీశైల ఉత్తర ముఖద్వారంగాఉమామహేశ్వరం శ్రీశైల ఉత్తర ముఖద్వారంగా విరాజిల్లుతు న్న శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికంతోపాటు నల్లమల ఊటీగా పిలుస్తారు. మండుటెండలో కూడా ఈ ప్రాంతంలో చల్లగా ఉండటంతో ఈ ప్రాంతవాసులందరు ఉమామహేశ్వర క్షేత్రాన్ని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే శ్రీశైలం వెళ్లే ప్రతీ యాత్రికుడు సైతం ఇక్కడికి వచ్చే శ్రీశైలానికి వెళ్లే సంప్రదాయం అలవాటు పడింది. వ్యూ పాయింట్ ప్రత్యేకం.. నల్లమల ద్వారం ఫర్హాబాద్ చౌరస్తానుంచి 8 కి.మీ దూరంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్ ఇక్కడ ప్రత్యేకం. సుదూరప్రాంతం, అనేక గ్రామాలు, ఎల్లవేళలా మంచుదుప్పటితో కప్పివేసిన దృశ్యాలను చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఆ అందాలు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. సఫారీ ప్రయాణం నల్లమల అందాలను చూడటానికి అటవీశాఖ సఫారీ వాహనంలో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసింది. అటవీజంతువులను దగ్గరనుంచి చూసేందుకు ఈ వాహనాలెందో ఉపకరిస్తాయి. లోతట్టే ప్రాంతం నుంచి అడవిబిడ్డల గూడేలు, వారి జీవన స్థితిగతులతోపాటు ఎత్తయిన కొండ అందాలను ఈ ప్రయాణంలో చూడొచ్చు. వాచ్‌టవర్, రకరకాల చెట్లు, ఔషధ మూలికలు, అడవిలో స్వేచ్ఛగా సంచరి ంచే వన్యప్రాణులను తిలకించే మంచి అవకాశం కల్పించారు. జాలువారే జలపాతం వటువర్లపల్లి గ్రామానికి 10 కి.మీ దూరంలోని మల్లెలతీర్థం ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈకో డెవలప్మెంట్ భాగస్వామ్యంతో అటవీశాఖ ఇక్కడ పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పక్కనే శివలింగం ఉండటంతో మునులు, అడవిబిడ్డలు ఆ ప్రాంతంలో తరచూ పూజలుచేస్తుంటారు. అలాగే రోడ్డు వెంట ఉండే ఎన్నో సుందర దృశ్యాలు శ్రీశైలం వెళ్లే యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
లాంచీ ‘కొండె’క్కనుందా?
బుద్దవనం బహుభారం - హిల్‌కాలనీ నుంచి నడిపితే మేలు - విభజన లోపే చర్యలు తీసుకుంటే మేలు నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌లో రాష్ట్ర విభజన అనంతరం లాంచీలు ఎక్కాలంటే ఇబ్బందులు తప్పేలాలేవు. లాంచీ ఎక్కి నాగార్జునకొండ చూడాలంటే గుంటూరు జిల్లాకు చెందిన రైట్బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది. ఈ నేపథ్యంలో విభజన జరిగేలోపే నల్లగొండ జిల్లా పరిధిలోని హిల్‌కాలనీ నుంచి లాంచీలను నడపితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని పర్యాటకులు సూచిస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా నాగార్జునసాగర్ రూపుదిద్దుకుంది. ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ) నుంచి టీజీ టీడీసీగా(తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ)గా విడిపోయి నూతనంగా రిజిస్ట్రేషన్ కాబోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ పర్యాటక డివిజన్లో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. సాగర్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు లాంచీ ఎక్కి నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. తప్పుదోవ పట్టిస్తున్న కన్సల్టెంట్ పర్యాటక అభివృద్ధి సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి లాంచీలు నడిపే విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. నాగార్జునకొండతో పాటు ఏలేశ్వరం ప్రాంతాలకు బుద్ధవనం నుంచి లాంచీలు నడపాలని ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ, అది సాధ్యం కాదన్నది కన్సల్టెంట్‌కు తెలిసిన విషయమే. ఎందుకంటే బుద్ధవనం నుంచి జలాశయం తీరానికి వెళ్లి లాంచీ ఎక్కాలంటే పర్యాటకులు కనీసం ఐదుకిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి లాంచీలు నడపాలంటే.. దట్టమైన అడవి కలిగిన ప్రాంతం కాబట్టి పోలీసుల అనుమతి కావాల్సి ఉంటుంది. దేశరక్షణకుగాను కోసం నిత్యం ప్రయోగాలు నిర్వహించే నావికాదళం స్టేషన్ కూడా ఇక్కడ ఉంది. అది దాటి లాంచీలు వెళ్లాలి. ప్రస్తుతం చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల పుట్టీలనే అక్కడి నుంచి రానివ్వరు. దేశ రక్షణ దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి లాంచీలను కూడా అనుమతి నివ్వరు. అదీ కాకుండా పర్యాటకుల రక్షణకుగాను ఆరుబయటి ప్రదేశం కావాలి. నావికాదళం వారు దేశ రక్షణ దృష్ట్యా ఇటు నుంచి రోడ్డునే బ్లాక్ చేయాలనే ప్రతిపాదనను ఢిల్లీకి పంపారు. బైపాస్ రోడ్డువేస్తే ఇటు ప్రత్యేకంగా పర్యాటకులు రావాల్సిందే తప్ప ఏవాహనాలు ఇక్కడి నుంచి వెళ్లవు. లాంచీస్టేషన్ నిర్మాణం ఇప్పట్లో సాధ్యం కాదు ఇప్పటికిప్పుడు కొత్తగా లాంచీలు ఏర్పాటు చేయడం, జట్టీ నిర్మాణం చేయడం అంత సులువైన పనికాదు. తెలంగాణ రాష్ట ఏర్పాటు అనంతరం లాంచీలు నడపాలంటే అనుమతుల కోసం కేంద్రం చుట్టూ తిరగాలి. ఒక లాంచీ నిర్మాణం కావాలంటే కోటిన్నర అవసరమవుతాయి. కనీసం రెండు సంవత్సరాల కాలం పడుతుంది. అన్నింటికి అన్ని ఉండి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాగసిరి లాంచీ నిర్మాణం ప్రారంభమై మూడున్నర సంవత్సరాలైనా ఇంకా ఓకొలిక్కిరాలేదు. ఇప్పటి వరకు దీని కోసం రూ. 1.30 కోట్లు ఖర్చుచేశారు. మరో రూ.30లక్షలు వరకు అవసరం ఉన్నాయి. అదేమీ లేకుండా అపాయింటెడ్ డేకు ముందుగానే బుద్ధపూర్ణిమ ఉత్సవాలలో భాగంగా హిల్‌కాలనీ నుంచే లాంచీ లను ప్రారంభించాలని పర్యాటకులు కోరుతున్నారు. పుష్కరఘాట్ నుంచి.. బుద్ధవనం నుంచి లాంచీలు నడపాలన్న ప్రతిపాదనలు మానుకోవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు లాంచీలలో మూడింటిని తెలంగాణ వాటాకింద తీసుకుని హిల్‌కాలనీలోని డౌన్ పార్కు వద్ద నిర్మించిన పుష్కర ఘాట్ నుంచే నడపడానికి వీలుగా ఉందని వారు పేర్కొంటున్నారు. బైపాస్ రోడ్డువేసినా ఆ రోడ్డు డౌన్‌పార్కు సమీపం నుంచే వెళ్తుంది. రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. హిల్‌కాలనీ బస్టాండుకు నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. ఎంతో అనువైన ప్రదేశం. అన్ని పర్యాటక యూనిట్లు కలిసి ఉండే కంటే మరో యూనిట్ ఏర్పాటవుతుంది. ఉద్యోగాల సంఖ్యా పెరుగుతుంది. రెండుచోట్ల టికెట్లు విక్రయించడం వల్ల పర్యాటక శాఖకు ఆదాయం పెరుగుతుంది. పర్యాటకులకు రెండు ప్రాంతాలను చూసిన అనుభూతి కలుగుతుంది. రక్షణ దృష్ట్యా డౌన్‌పార్కు నుంచి నాగార్జునకొండకు వెళ్లేంత వరకు లాంచీలు కనిపిస్తాయి. కొండకు వెళ్లడానికి బుద్ధవనం నుంచి వెళ్లిన దాని కన్నా నీటిపై ప్రయాణం తగ్గుతుంది. నాగార్జునకొండకు వెళ్లడానికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారు. వారికి చుట్టూ తిరిగి వెళ్లడం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. ఏడాదిలో రూ. 1.30 కోట్ల ఆదా యం లాంచీస్టేషన్‌కు వస్తే ఇందులో తెలంగాణ ప్రాంతీయు ల నుంచి వచ్చిన రెవెన్యూ రూ. కోటి ఉంటుందని పర్యాటకశాఖ అధికారుల అంచనా. గతంలో ఎన్ఎస్పీ పరిధిలో లాంచీలు ఉన్నప్పుడు కూలీలలను నాగార్జునకొండకు ఇక్కడి నుంచి తీసుకువెళ్లినట్లుగా నాటి ఉద్యోగులు తెలిపారు. మూడు లాంచీలు తీసుకుని.. సాగర్‌లో ఒకప్పుడు ఆరు లాంచీలు ఉండేవి. అందులో విజయలక్ష్మి, ఎమ్మెల్ కృష్ణ, అగస్త్య, శాంతిసిరి, నాగసిరి, జరియా. అయితే వీటిలో జరియా లాంచీని గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రాప్రాంతానికి తరలించగా, ఇక్కడ ప్రస్తుతం ఐదు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఈ ప్రాంతం కోసం మూడు లాంచీలు తీసుకోవడమే గాక, అక్కడ పనిచేసే తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పించి, అన్ని అనుమతులు తీసుకుని హిల్‌కాలనీ నుంచి లాంచీలు ప్రారంభిస్తే పర్యాటకులకు చుట్టూ తిరిగి వెళ్లే శ్రమ తప్పుతుందని పలువురు పేర్కొంటున్నారు. జట్టీ నిర్మాణం జరగాలన్నా మరో రెండు సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ప్రతి అనుమతికి ఢిల్లీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎట్లాగూ పర్యాటక అభివృద్ధి సంస్థ అప్పులు, లాంచీలు రెండుప్రాంతాలవారు పంచుకోవాల్సిందేనంటున్నారు. బుద్ధపూర్ణమి ఉత్సవాలలో భాగంగా ఇక్కడి నుంచి లాంచీల ట్రయల్న్ ్రజరపాలని తెలంగాణ ప్రాంత పర్యాటకులు కోరుతున్నారు. -
విహారం: ప్రకృతి గీసిన చిత్రం... ఆ వెదురు అడవి!
మనిషిని ప్రకృతి ఆనందపరిచినంతగా మరేదీ ఆనంద పరచలేదు. నేచర్ నెవర్ అవుట్‌డేటెడ్. మనకు తెలిసినవి, మనం చూసినవే మనకు కొత్తగా, అద్భుతంగా కనిపించడం అన్నది ఒక్క ప్రకృతి విషయంలో మాత్రమే జరుగుతుంది. అలాంటి ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చే ఒక టూర్... అరషియామా, జపాన్. జపాన్.. అంటే మనకెప్పుడూ ఏ ఫోనో, మెషినో గుర్తొస్తుంటుంది. ఆ దేశాన్ని ఎపుడూ మనం ప్రకృతితో పోల్చి ఊహించుకున్న దాఖలాలు లేవు. అలాంటి జపాన్‌లో అక్కడే ఉండిపోవాలనిపించేటంత అందమైన ప్రదేశాలుంటాయంటే అతిశయోక్తి అనుకుంటారు. కానీ, ఒక్కసారి ఫొటోలు చూశాక అక్కడకు వెళాల్సిందే అని ఫిక్సయిపోతారు. అంతటి మనోహరంగా ఉంటుందా ప్రదేశం. వెదురు చెట్లు మనకు కొత్త కాదు, కానీ అవే వెదురు చెట్లను అక్కడ చూడటం మహానుభూతి. అది ఎంత గొప్ప అనుభూతి అంటే అక్కడకు వెళ్లొచ్చాక పర్యాటకులు ఆన్లైన్లలో తమ రివ్యూలు ద్వారా ఆ స్థలం గురించి అభిప్రాయం చెబుతూ యావరేజ్ అన్న వారే లేరంటే అర్థం చేసుకోండి... అందరి నోటా అద్భుతం అనే మాటే వస్తుంది. ఎక్కడ ఉంటుంది? ఈ బాంబూ ఫారెస్ట్ అరషియామా-సగానో ప్రాంతంలో ఉంటుంది. ఇది జపాన్‌లో అత్యంత ఆదరణ పొందిన టూరు. ఈ ప్రాంతం జపాన్‌లోని క్యోటో నగరానికి దగ్గరగానే ఉంటుంది. ఇది దాదాపు వెయ్యేళ్ల క్రితం నుంచే పర్యాటక స్థలంగా వర్ధిల్లుతోంది. ఒక్కో సీజను ఒక్కో అనుభూతిని ఇచ్చే ప్రాంతం ఇది. జపాన్‌లోని ఏ నగరం నుంచైనా ఇక్కడకు టూర్ ప్యాకేజీలు ఉన్నాయంటే ఇది ఎంత ప్రసిద్ధి పొందిన టూరో అర్థం చేసుకోవచ్చు. ఈ పర్యాటక ప్రాంతంలో బాంబూ ఫారెస్ట్‌తో పాటు వెయ్యేళ్ల క్రితం నాటి టొగెట్సుక్యో వంతెన, విభిన్న జాతులకు చెందిన కోతులుండే మంకీ పార్క్, సాగా-టొరిమొటో వీధి (ఇది రెండు వందల ఏళ్ల క్రితం కట్టిన భవనాలు మాత్రమే ఉన్న వీధి), వివిధ ఆలయాలు, సాగా సీనిక్ రైల్వే వంటి వెన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రతిదానికీ ప్రత్యేకత ఉంది. టొగెట్స్యుకో వంతెన వెయ్యేళ్ల క్రితం కట్టారు. అప్పటికే ఇది పర్యాటకాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించారట. అది బాగా శిథిలం కావడంతో నిత్యం జన సందోహం ఉండే ప్రాంతమని 1930 లో దానిని పునర్నిర్మించారు. అంటే కొత్తవంతెనకు కూడా ఎనభై ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. ఇక్కడ కొండల్లో ఒక రైల్వే లైన్ ఉంది. అందులో ప్రయాణమే ఒక అనుభూతి. ఆ రైలు మార్గానికి ఒకవైపేమో ఎత్తయిన కొండ అడవులతో నిండి ఉంటుంది. మరో వైపు ఏమో నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏదో ఒక అందాన్నే చూడగలం... ఎందుకంటే రెండూ వేర్వేరు వైపు ఉంటాయి కదా. ఇక్కడకు వస్తే కచ్చితంగా ఈ రైలు మార్గంలో పయనించాల్సిందే. ఆకట్టుకునే ఆలయాలు ఇక్కడ ఆలయాల్లో ఆధ్యాత్మికతే కాదు... ఆర్కిటెక్చర్ కూడా ప్రధానమైనదే. ఇక్కడున్న టెన్య్రుజి టెంపుల్ జపాన్‌లో ప్రముఖ జైన దేవాలయం. దీనిని 1339లో కట్టారు. కానీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఇందులో గార్డెన్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండటమే కాదు ఈ మధ్యనే కట్టిన గుడి అన్నంత కొత్తగా ఉంటుంది. అందుకే దీనికి యునెస్కో గుర్తింపు దక్కింది. దీంతో ఇది ప్రపంచ పర్యాటకుల దృష్టిలో పడింది. అలాగే ప్రశాంత చిత్తంతో ధ్యానముద్రలో ఉన్న కొన్ని వందల విగ్రహాలుండే ఒతగి టెంపుల్ కచ్చితంగా చూడదగ్గది. ఇంకా ప్రకృతి మధ్య ఒదిగి ఉండే నిసోనిన్ టెంపుల్, గియోజీ టెంపుల్, అదాషినో టెంపుల్, 1596లో కట్టిన జకోజీ టెంపుల్ కనుల విందు చేసే వైవిధ్యమైన నిర్మాణాలతో సుందరంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కసారి ఆ ఫారెస్ట్‌లో అడుగుపెడితే... అరషియామాలో మీరెన్ని చూసినా మీకు గుర్తుండేది, మిగతా అన్నింటినీ మరిపించేలా చేసేది బాంబూ ఫారెస్ట్ మాత్రమే. దానికి ముందు, దాని తర్వాత మీరు జీవిత కాలంలో ఎన్ని పర్యాటక స్థలాలు చూసినా... ఈ బాంబూ ఫారెస్ట్‌ను మాత్రం మరిచిపోరు. అంత ప్రత్యేకత దానిది. అది ఒక అడవిలా కాకుండా కళాఖండంలా కనిపిస్తుంది. స్వర్గానికి ఒక దారిని డిజైన్ చేస్తే అది కచ్చితంగా ఇలాగే చేయాలేమో అనిపించేలా ఉంటుంది ఆ ప్రదేశం. స్కేలు పెట్టి గీచినట్టు ఉండే వెదురు చెట్లు ఏపుగా పచ్చగా పెరిగి ఉంటాయి. వాటి మధ్యలో కొలిచి నిర్మించినట్టు ఉండే వెదురు బొంగుల మెట్ల దారి అలా కట్టిపడేస్తుంది. ఇంకో రూట్లో వెళితే వెదురు పలకలతో నిర్మించిన రోడ్డు. దానిమీద నడుస్తుంటే ఆ ఫీలింగే గొప్పగా ఉంటుంది. వెదురు చెట్లలో కాలిబాటకు అటు ఇటు చిన్న వెదురు కట్టెలతో రెయిలింగ్ చూడటానికి ముచ్చటేస్తుంది. మనోహరంగా పచ్చగా ఉండే ఆ వెదురు చెట్లలో ఒక్కో చోట ఒక్కరకమైన కాలిబాటలు వేశారు. ఒకచోట విశాలంగా వెదురు రోడ్లు, మరో చోట చిన్న కాలిబాటు మెట్లతో కూడిన దారి... ఇంకో చోట రాలిన ఆకుల మామూలు కాలిబాట, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన రాళ్లతో కూడిన కాలిబాట... అబ్బో ఒకటేమిటి ఎన్నో అందాలు. అలా రోజంతా అక్కడే ఉండి ఉదయం-సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడకు వచ్చి ఫొటో దిగని పర్యాటకుడు ఉండనే ఉండరు. ఎపుడు వెళ్లాలి! జపాన్ టూర్లన్నీ మార్చి-నవంబరు మధ్య వెళ్లడం మంచిది. క్యోటో టూర్ అయితే మే నుంచి వెళ్లడం వల్ల దేశంలో జరిగే ప్రముఖ ఫెస్టివల్స్‌ను చూసే అవకాశం వస్తుంది. ఆగస్టు, సెప్టెంబరులో మూడు ఫెస్టివల్స్ ఉంటాయి. వీటిని కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ కాలంలో వెళితే బెటర్. ఎలా చేరుకోవాలి... ఇంటర్నేషనల్ టూర్స్ అంటే ఫ్లైట్ ఎక్కాల్సిందే. క్యోటో జపాన్ పెద్ద నగరాల్లో ఒకటి అయినా కూడా సొంత విమానాశ్రయం లేదు. వంద కిలోమీటర్ల దూరంలోని కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడకు చేరుకోవాలి. అసలే జపాన్ టెక్నాలజీలో ముందుండే దేశం. ఇక అక్కడ్నుంచి క్యోటోకి చేరుకోవడానికి ఇబ్బందా చెప్పండి.. అందుకే నిశ్చింతంగా బయలుదేరండి. రోడ్డు, రైలు వంటి అన్ని అత్యాధునిక రవాణా మీకందుబాటులో ఉంటుంది. క్యోటో నుంచి అరషియామాకు కేవలం ఎనిమిది కిలోమీటర్లు. బైకులు, సైకిళ్లు కూడా అద్దెకు దొరుకుతాయి.