మహానగరానికి దగ్గరగా.. కాలుష్యానికి దూరంగా.. పచ్చని రంగేసినట్లుండే కొండలు, వనాన్ని తలపించే వృక్షాలతో నిండిన అటవీ ప్రాంతం.. ఉదయం, సాయంత్రం పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, వందలాది పక్షిజాతులు.. కొండలు, గుట్టలు ఎక్కాలని కోరుకునే వారికి ట్రెక్కింగ్ ట్రాక్.. భక్తితో కొలిచే వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న అనంతపధ్మనాభ స్వామి దేవాలయం.. ఇవన్నీ అనంతగిరి అటవీ ప్రాతం సొంతం. మరో అడుగు ముందుకేస్తే సరదా బోటింగ్.. కోట్‌పల్లి జలాశయంలో కాయాకింగ్ సదుపాయం.. ప్రకృతి ప్రేమికులకైనా.. వారాంతంలో సేదతీరేందుకు టూర్ ప్లాన్ చేసుకునే వారికైనా వికారాబాద్ తొలిప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఒక్కరోజులో ఎంజాయ్ చేసిరావచ్చు.
వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం నవాబుల కాలం నుంచి పర్యాటక ప్రాంతంగా, ఔషధ వనమూలికలు కలిగిన వృక్షాలకు నిలయంగా ప్రసిద్ధి. అనంతగిరి గుట్టపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక శాఖ హరిత రిస్సార్ట్ నిర్మించింది. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, ప్లే ప్లేస్, గార్డెన్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రాత్రికి ఫైర్ క్యాంప్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో ఇక్కడ స్టే చేయడం కోసం ముందస్తుగా గదులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వారాంతంలో అప్పటికప్పుడు స్టేయింగ్ దొరకాలంటే కష్టం. అటవీ శాఖకు చెందిన గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంటుంది. సిబ్బందిని సంప్రదిస్తే ఉదయం ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. అడవిలో నలుదిక్కులు తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ సీజన్(వర్షాకాలం)లో అనంతగిరి కొండల్లో జలపాతాలు పర్యాటకులను కనువిందుచేస్తాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టపై వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అడవి మొత్తాన్ని చూడొచ్చు. ఈ ట్రిప్‌కి ఒక్కొరికీ రూ.3000 నుంచి రూ.5000 వరకూ ఖర్చు అవుతుంది.
ఆధ్యాతి్మకంగానూ..
అనంతగిరిలో వెలసిన అనంతపధ్మనాభస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని తెలంగాణతో పాటు కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్, మహారాష్త్ర ప్రజలు గట్టిగా నమ్ముతారు. సుమారు 5వేల సంవత్సరాల క్రితం మార్కండేయుడు ఇక్కడ తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజుల్లో వేల సంఖ్యలో ఉంటారు.
ఎలా వెళ్లాలి..
హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు 65 కిలోమీటర్లు. మొయినాబాద్, చేవెళ్ల మీదుగా హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిలో మన్నెగూడ దగ్గర వికారాబాద్ వైపు తిరగాలి. గచి్చ»ౌలి, కూకట్‌పల్లి, పటాన్‌చెరువు, తదితర ప్రాంతాల ప్రజలు శంకర్‌పల్లి మీదుగా రావచ్చు. సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి మీదుగా రైలు
సదుపాయం ఉంది.
బోటింగ్..
అనంతగిరి కొండల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కోట్‌పల్లి జలాశయం ఉంటుంది. ఇక్కడ బోటింగ్(కాయాకింగ్) చేయవచ్చు. వారాంతాలు, సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బోటింగ్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఒక్కరికి రూ.250, పెయిÆŠḥకి రూ.450 ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం
5.30 వరకూ బోటింగ్‌కు అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment