తాజ్‌మహల్ అంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. ఆ అద్భుత నిర్మాణాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌ను సందర్శించేవారి నుంచి ప్రభుత్వానికి ప్రతీయేటా ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
విదేశీయులు ఎవరైనా భారతదేశానికి వస్తే ముందుగా వారు చూడాలనుకునేది తాజ్‌మహల్. ఇక మనదేశంలోని ప్రతీఒక్కరూ తాజ్‌మహల్ చూడాలని తప్పనిసరిగా అనుకుంటారు. తాజ్‌మహల్‌కు ఇంత క్రేజ్ ఏర్పడటానికి కారణం దాని నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిందనే సంగతి అందరికీ తెలిసిందే. తాజ్‌మహల్ అనునిత్యం పర్యాటకులతో కిటకిటలాడిపోతుంటుంది. మరి అటువంటప్పుడు తాజ్ మహల్ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది. అలాగే ప్రతీయేటా తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి ఎన్ని టిక్కెట్లు అమ్ముడవుతాయనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందువరుసలో...
దేశంలోని అత్యంత పురాతన అందమైన కట్టడాలలో తాజ్‌మహల్ ముందువరుసలో ఉంటుంది. తాజ్‌మహల్‌కు ఎంతటి ఆదరణ ఉన్నదంటే.. కరోనా కాలంలో అన్నీ స్థంభించిపోయినప్పుడు కూడా.. ఆ రెండు సంవత్సరాల్లో తాజ్‌మహల్ సందర్శించేందుకు పర్యాటకులు వచ్చారు. అటువంటి విపత్కర సమయంలోనూ తాజ్ మహల్ సందర్శన టిక్కెట్లు విక్రయమయ్యాయి.
ఇది కూడా చదవండి: గిన్నిస్ పెళ్లిళ్లు
సందర్శకుల సంఖ్య ఎంతంటే..
అధికారికంగా అందిన సమాచారం ప్రకారం తాజ్‌మహల్ సందర్శనకు ప్రతీయేటా సుమారు 80 లక్షలమంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో 80 వేలమంది విదేశీయులు ఉంటారు. తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి స్థానికులకు (భారత్) రూ. 50, విదేశీయులకు రూ.1100 టిక్కెట్ రూపంలో వసూలు చేస్తారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో అంటే మూడేళ్ల వ్యవధిలో రూ.152 కోట్ల ఆదాయం తాజ్‌మహల్ నుంచి ప్రభుత్వానికి సమకూరింది. ఇది చారిత్రాత్మక కట్టడాల నుంచి వచ్చిన ఆదాయంలో 40 శాతం. దేశంలోని పర్యాటకుల కారణంగా తాజ్‌మహల్‌కు టిక్కెట్ల రూపంలో ప్రతీయేటా రూ. 40 కోట్లు, విదేశీయులకు విక్రయించే టిక్కెట్ల కారణంగా రూ.110 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది.
తరువాతి స్థానంలో ఆగ్రాకోట
పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయపరంగా చూస్తే తాజ్‌మహల్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. 2021-2022లో తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్ల విక్రయాల కారణంగా సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూరింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట నుంచి కూడా అత్యధిక ఆదాయం వస్తుంటుంది. దేశంలోని మొత్తం పర్యాటక ప్రాంతాల నుంచి ప్రతీయేటా వచ్చే ఆదాయంలో.. తాజ్‌మహల్, ఆగ్రాకోటల సందర్శకుల నుంచి వచ్చే ఆదాయం 53 శాతం మేరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా..
Comments
Please login to add a commentAdd a comment