అమ్మ లేదు..నాన్న రాలేదు | She did not ledunanna | Sakshi
Sakshi News home page

అమ్మ లేదు..నాన్న రాలేదు

Published Tue, Jan 6 2015 3:55 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

She did not ledunanna

భివండీ, న్యూస్‌లైన్: ఆరు రోజుల క్రితం తల్లి వదిలేసి వెళ్లిన నలుగురు పాలమూరు చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. కన్నతల్లి జాడే తెలియకపోగా, కన్నతండ్రి కనీసం చూసేందుకు కూడా రాలేదు. అయితే ‘సాక్షి’ చొరవతో అయిదు రోజుల తరువాత పిల్లలను తీసుకుపోయేందుకు మేనమామ వచ్చా రు. అయితే ‘బాల్ కల్యాణ్ సమితి’ (బాలల సంక్షేమ సంస్థ) పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారిని అప్పగించేందు కు నిరాకరించింది.

ఆ పిల్లలను రెండు రో జుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చిన్నారుల పరిస్థితి అగమ్మగోచరంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోయ రాజేశ్వరి (9), బోయ స్వప్న (7), బోయ అఖిల (5), బోయ మహాలక్ష్మి (3)లను వారి క న్నతల్లి డిసెంబరు 31నస్థానిక కల్యాణ్ బ స్‌స్టాండ్‌లో వదిలి వెళ్లిన విషయం తె లిసిందే. వీరిని పోలీసులు స్థానిక బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు.

కాగా అయిదు రోజుల తర్వాత పిల్లలను తీసుకుపోయేందుకు వారి తల్లి బోయ సుజాత సోదరుడైన చంద్రకంటి ఆంజనేయులు, మరో వ్యక్తి జోగి నారాయణతో కలిసి సోమవారం కల్యాణ్ చేరుకున్నారు. మహాత్మఫులే పోలీస్ స్టేషన్‌లో అన్ని వివరాలు అందించిన తర్వాత పోలీసులు వా రిని పిల్లలు ఆశ్రయం పొందుతున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు తీసుకెళ్లారు.

అయితే పిల్లలను మేనమామ ఆంజనేయులుకు అప్పగించేందుకు కమిటీ అధ్యక్షురాలు మీనల్ ఠాకోర్, సభ్యురాలు విద్యా ఆటపాడ్కర్, సభ్యుడు కిరణ్ మోరే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజనేయులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, పిల్లలను తీసుకుపోయేందుకు తండ్రి రాలేదని, తదితర కారణాల చూపుతూ వారిని అప్పగించేందుకు నిరాకరించారు. ఆ నలుగురు పిల్లలను మహబూబ్‌నగర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

 ఆనందంనుంచి తేరుకునేలోపే....
 అయిదు రోజులుగా అయినవారు కనిపించక బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు ఊరి నుంచి వచ్చిన మేనమామను చూసి ఒక్కసారిగా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. వారి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. తమను ఊరికి తీసుకెళ్లమంటూ మేనమామ వద్ద గోళ చేశారు. అయితే  చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ వారిని అప్పగించేందుకు నిరాకరించడంతో పిల్లల ముఖాల్లో విషాదం నిండుకుంది.

అప్పటివరకు ఆనందంగా గడిపిన పిల్లలు మళ్లీ సంక్షేమ కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించారు. మేనమామతో కలిసి అమ్మమ్మ దగ్గరికి వెళ్తామంటూ చేసిన వారి రోదనలు స్థానికులను కంటతడిపెట్టించాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశానుసారం రెండు రోజుల్లో పిల్లలను మహబూబ్‌నగర్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిషార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement