మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం
Published Thu, Feb 16 2017 4:16 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
నవాబుపేట: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని కిరాతకంగా హతమార్చిందో కుమార్తె. అంతేకాకుండా తల్లిని చంపి మృతదేహంతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది. ఈ సంఘటన జిల్లాలోని జిల్లాలోని నవాబుపేట మండలం ఇత్తటూరు గ్రామంలో గురువారం బయటకు వచ్చింది. గ్రామానికి చెందిన పార్వతమ్మ తల్లి లక్ష్మమ్మను కిరాతకంగా హతమార్చి మృతదేహాన్నిమూడు రోజుల నుంచి ఇంట్లోనే ఉంచుకుంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో.. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి రావడంతో అసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
Advertisement
Advertisement