mother murdered
-
కసాయి కూతురు
బెంగళూరు, కృష్ణరాజపురం: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు ప్రవర్తించింది. మృగ్యమవుతున్న మానవ సంబంధాలకు ఈ సంఘటన అద్దం పడుతోంది. తల్లితో తలెత్తిన వాగ్వాదం శృతి మించడంతో కూతురు కన్నతల్లినే క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్ పురంలోని అక్షయనగర్లో చోటు చేసుకుంది. ఉత్తర కర్ణాటకకు ప్రాంతానికి చెందిన నిర్మల (55) అనే మహిళ, ఇంజనీరింగ్ చదివిన కూతురు అమృత, కొడుకుతో కలసి చాలాకాలంగా అక్షయ నగరలో ఉంటున్నారు. కాగా తల్లీకూతురు మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గలాటా మొదలైంది. కొంతసేపటికి తల్లి తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. కోపంతో ఊగిపోతున్న కూతురు చాకుతో తల్లిని పొడిచి చంపి పరారైంది. కొడుకు కూడా పారిపోయాడు. కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కూతురిపై రేప్ : కోర్టులోనే భార్య హత్య
గువహటి: మనిషిలోని కర్కశానికి, మృగత్వానికి ప్రతీకగా నిలిచిన ఉదంతమిది. ఒకపుడు కన్నూమిన్నూ గానకుండా కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు పెట్టిందన్న అక్కసుతో ఇపుడు ఏకంగా భార్యను హత్య చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు,ఇతరులు అందరూ అక్కడ ఉండగానే పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. డిబ్రూగఢ్ జిల్లాలోని సెషన్స్ కోర్టు ప్రాంగణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డిబ్రూగఢ్ డీఎస్పీ ప్రదీప్ సైకియా అందించిన సమాచారం ప్రకారం నిందితుడు పూర్ణ నహర్ డేకా కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా అతని భార్య రీటా నహర్ దేకా కోర్టు హాజరైంది. అకస్మాత్తుగా నిందితుడు భార్యపై దాడిచేశాడు. జేబులో నుంచి కత్తితీసి గొంతు కోశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారన్నారు. ఈయ కేసులో నిందితుడు తొమ్మిది నెలలపాటు జైలులో ఉన్నాడనీ, కొన్ని రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యాడరి డిబ్రూగఢ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ సిధేశ్వర్ బోరాహ్ చెప్పారు. -
మాంసం కూర వండలేదని తల్లిని చంపాడు
బడేపురం(తాడికొండ): మాంసం కూర వండలేదని మద్యానికి బానిసైన ఓ కొడుకు కన్నతల్లిని కత్తితో పొడిచి చంపిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ శివారు బడేపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడేపురం గ్రామానికి చెందిన బెజ్జం కిషోర్ గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య అతన్ని వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రుల ఆసరాతో జీవిస్తున్నాడు. వృద్ధుడైన తండ్రి వెంకటేశ్వరరావు తాడికొండలో ఆర్ఎంపీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం బయటికెళ్లిన కిషోర్ మద్యం తాగి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. మాంసం కూర వండలేదనే కారణంతో తల్లి బెజ్జం మరియమ్మ (70)తో వాగ్వాదానికి దిగాడు. ఆమె వంటకు ఏర్పాట్లు చేసుకుంటుండగా వెనుక నుంచి కూరలు తరిగే కత్తితో వీపుపై పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. విధి నిర్వహణలో భాగంగా బయటికి వెళ్లి వచ్చిన తండ్రి వెంకటేశ్వరరావు.. కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడటంతో నిశ్చేష్టుడయ్యాడు. ఘటనా స్థలాన్ని మంగళగిరి రూరల్ సీఐ మధుసూదనరావు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆస్తి ఇవ్వలేదనే చంపేశాడు.. ఆస్తి కోసమే తన కుమారుడు తల్లిని చంపేశాడని నిందితుడు బెజ్జం కిషోర్ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం నిత్యం వేధిస్తుండటంతో గతంలోనే పిల్లలకు పంపకాలు చేసి ఆస్తిని రాసిచ్చినట్టు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన కొడుకు ఆస్తిని దుర్వినియోగం చేస్తాడనే ఉద్దేశంతో మనుమలు, మనుమరాళ్ల పేరిట ఆస్తిని రాసినట్టు వివరించారు. ఇంతలోనే తల్లిని ఇలా హత్యచేస్తాడని ఊహించలేదని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. -
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం
నవాబుపేట: మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని కిరాతకంగా హతమార్చిందో కుమార్తె. అంతేకాకుండా తల్లిని చంపి మృతదేహంతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది. ఈ సంఘటన జిల్లాలోని జిల్లాలోని నవాబుపేట మండలం ఇత్తటూరు గ్రామంలో గురువారం బయటకు వచ్చింది. గ్రామానికి చెందిన పార్వతమ్మ తల్లి లక్ష్మమ్మను కిరాతకంగా హతమార్చి మృతదేహాన్నిమూడు రోజుల నుంచి ఇంట్లోనే ఉంచుకుంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో.. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి రావడంతో అసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. -
కన్నతల్లిని నరికి చంపిన కొడుకు
ప్రకాశం(మార్టూరు):మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గురువారం కన్నతల్లిని నరికి చంపాడో ఓ కసాయి కొడుకు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చిట్టెమ్మ(57)ను ఆమె కన్న కొడుకు మత్తయ్య కిరాతకంగా చంపాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రేమకోసం తల్లిని చంపిన కొడుకు అరెస్టు
ప్రేమ వ్యవహారం కోసం తల్లిని చంపిన కొడుకును విశాఖపట్నంలోని గాజువాక పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వ్యవహారం కారణంగానే అతడు ఈ హత్యకు పాల్పడినట్లు డీసీసీ రాంగోపాల్ నాయక్ తెలిపారు. తన తల్లి వద్ద ఉన్న 7 తులాల బంగారం అమ్మి విదేశాలకు వెళ్లేందుకు రాజశేఖర్ ప్రయత్నించాడని ఆయన చెప్పారు. మృతురాలి కుమార్తె అనుమానంతో తమకు ఫిర్యాదు చేయడంతో రాజశేఖర్ మీద నిఘా పెట్టి అతడిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు.