కూతురు అమృత
బెంగళూరు, కృష్ణరాజపురం: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు ప్రవర్తించింది. మృగ్యమవుతున్న మానవ సంబంధాలకు ఈ సంఘటన అద్దం పడుతోంది. తల్లితో తలెత్తిన వాగ్వాదం శృతి మించడంతో కూతురు కన్నతల్లినే క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్ పురంలోని అక్షయనగర్‌లో చోటు చేసుకుంది. ఉత్తర కర్ణాటకకు ప్రాంతానికి చెందిన నిర్మల (55) అనే మహిళ, ఇంజనీరింగ్ చదివిన కూతురు అమృత, కొడుకుతో కలసి చాలాకాలంగా అక్షయ నగరలో ఉంటున్నారు. కాగా తల్లీకూతురు మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గలాటా మొదలైంది. కొంతసేపటికి తల్లి తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. కోపంతో ఊగిపోతున్న కూతురు చాకుతో తల్లిని పొడిచి చంపి పరారైంది. కొడుకు కూడా పారిపోయాడు. కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment