వెంకటలక్ష్మి (ఫైల్)
కెలమంగలం(కర్ణాటక): సంతోషంగా ఉగాది పండుగను జరుపుకొనేందుకు పుట్టింటికి వెళ్లిన కూతురు తల్లిదండ్రుల గొడవలో చిక్కి తూటాలకు బలైంది. ఈ దుర్ఘటన తళి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకొంది. డెంకణీకోట తాలూకా అంచెట్టి సమీపంలోని కరడికల్ గ్రామానికి చెందిన అరుణాచలం కూతురు వెంకటలక్ష్మి (20)కి కోలారు జిల్లా మాలూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్‌తో నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. పుట్టింటిలో ఉగాదిని జరుపుకొనేందుకు గత రెండు రోజుల క్రితం కరడికల్ గ్రామానికి వచ్చింది.
మద్యం మత్తులో వీరంగం..
బుధవారం రాత్రి అతిగా మద్యం తాగి అరుణాచలం భార్యతో గొడవ పడ్డాడు. అరుణాచలం తీవ్ర ఆవేశం చెంది ఇంట్లో దాచిన నాటు తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు. ఈ సమయంలో అడ్డుకొనేందుకెళ్లిన కూతురు వెంకటలక్ష్మిపై తుపాకీ గుండు పేలింది. వెంకటలక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తండ్రి తుపాకీ పడేసి పరారయ్యాడు. డెంకణీకోట డీఎస్పీ సంగీత, తళి పోలీసులు చేరుకొని శవాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న అరుణాచలం కోసం గాలిస్తున్నారు.
చదవండి:
యూట్యూబ్‌లో పూజలు చూసి బిడ్డను బలిచ్చిన తల్లి
జుత్తాడ ఫ్యామిలీ మర్డర్: అదును చూసి ఆరుగురిని చంపాడు
Comments
Please login to add a commentAdd a comment